Radhe Shyam OTT Release: అమెజాన్ ప్రైమ్ లో 'రాధేశ్యామ్', స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సాధారణంగా ఏ సినిమా అయినా.. థియేట్రికల్ రిలీజ్ అనంతరం నాలుగు వారాల తరువాతే డిజిటల్ ప్లాట్ ఫామ్ కు వస్తుంది. కానీ రాధేశ్యామ్ ముందుగానే రిలీజ్ కానుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. ఓ వర్గం ఆడియన్స్ కి ఈ సినిమా కనెక్ట్ అయినప్పటికీ.. బీ,సీ ఆడియన్స్ కి సినిమా నచ్చలేదు. రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. పీరియాడిక్ లవ్ స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కించారు. విధికి, ప్రేమకి మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా. జస్టిన్ ప్రభాకరన్ సాంగ్స్, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి హైలైట్స్ గా నిలిచాయి.
ఇప్పుడు ఈ సినిమాను డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మార్చి 11న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం నిర్మాతలు ఓటీటీ సంస్థలతో పెట్టుకున్న డీలింగ్ ప్రకారం.. థియేట్రికల్ రిలీజ్ అనంతరం నాలుగు వారాల తరువాతే డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదల కావాలి. అంటే ఏప్రిల్ 11న సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాల్సివుంది. కానీ 'రాధేశ్యామ్' సినిమా అనుకున్నదానికంటే ముందే ఓటీటీలో విడుదల కానుంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ 'రాధేశ్యామ్' సినిమా హక్కులను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఉగాది కానుకగా ఏప్రిల్ 1నుంచి 'రాధేశ్యామ్'ను స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని అఫీషియల్ గా వెల్లడించింది. మరి ఓటీటీలో ఈ సినిమా ఎలాంటి రికార్డ్ సాధిస్తుందో చూడాలి..!
Also Read: నటుడిగా స్మిత్, నటిగా జెస్సికా, 'డ్యూన్'కు అవార్డుల పంట - ఆస్కార్స్ 2022 విజేతలు వీరే
Also Read: 'నాకు ఎవడి దోస్తీ అక్కర్లేదు' - 'కేజీఎఫ్2' ట్రైలర్ వచ్చేసిందోచ్
View this post on Instagram