Oo Antava Song: ‘ఊ.. అంటావా’ మేల్ వెర్షన్.. ఆడోళ్లపై రివేంజ్ తీర్చుకున్నాడా?
‘ఊ అంటావా.. ఉఊ అంటావా’ సాంగ్ మేల్ వెర్షన్ వచ్చేసింది చూశారా? ఈ పేరడి సాంగ్ మీకు తప్పకుండా నచ్చేస్తుంది.
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప: ద రైజ్’ (Pushpa: The Rise) సినిమా శుక్రవారం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ చిత్రంలోని ‘‘ఊ అంటావా.. ఉఊ అంటావా’’ సాంగ్ సోషల్ మీడియాలో దూసుకెళ్తోంది. ఈ స్పెషల్ సాంగ్‌లో సమంత తళుకులు చూసి అభిమానులు విజిల్స్ వేస్తున్నారు. అరుపులు కేకలతో థియేటర్లు దద్దరిల్లుతున్నాయ్. మంగ్లీ సోదరి.. ఇంద్రావతి చౌహాన్ ఆలపించిన ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండవ్వుతోంది. అయితే, ఈ పాటలో ‘‘మగాళ్ల బుద్ధి.. వంకర బుద్ధి’’ అనేది పురుషులకు అస్సలు నచ్చడం లేదు. దీనిపై ఓ పురుష సంఘం కేసు కూడా పెట్టింది. మగాళ్లనే అన్నేసి మాటలు అంటావా అంటూ.. ఓ నెటిజన్ ‘ఊ అంటావా’ మేల్ వెర్షన్ సాంగ్‌ను వదిలాడు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘‘మీ కళ్లల్లోనే వంకర ఉంది. ఆడాళ్ల బుద్ధే వంకర బుద్ధి.. ఊ అంటావా పాప.. ఊఊ అంటావా పాప’’ అంటూ సాగే ఈ పాట పురుషులకు తెగ నచ్చేసింది. ఆడవాళ్లను విమర్శిస్తూ ఈ పాట లిరిక్స్ ఉన్నాయి. అయితే, ఈ పాట పాడిన వ్యక్తి గళం కాస్త కర్ణకఠోరంగా ఉన్నా.. మీకు నచ్చేస్తుంది. అంతేకాదు.. ఈ పాట ఎడిటింగ్ కూడా మీకు నచ్చుతుంది.
Fun male version of #OoAntavaOoOoAntava 😀 #Pushpa pic.twitter.com/hIeOFjfS2s
— Vaali (@vaaalisugreeva) December 15, 2021
‘పుష్ప: ద రైజ్’ సినిమాలో సమంత స్టెప్స్ వేసిన స్పెషల్ సాంగ్ ‘‘ఊ అంటావా... ఉఊ అంటావా’’ పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పురుషుల సంఘం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు వేసింది. అమరావతిలోని తాళ్లూరు గ్రామంలో కోదండరామ ఆలయంలో 'ఊ అంటావా... ఊఊ అంటావా' పాటలో డాన్స్ చేసిన సమంతకు, ఆ పాట రాసిన గేయ రచయిత చంద్రబోసుకు స్థానిక మహిళామండలి సభ్యులు అర్చన చేశారు. అలాగే, వారి ఫొటోలకు పాలతో అభిషేకం చేశారు. అనంతరం పురుషులది దురహంకారమని, ఈ పాట మీద కేసు వేయడం దుశ్చ్యర్య అని మండిపడ్డారు. పురుషుల దురహంకారాలు, దుశ్చర్యలను ఎండగట్టే పాట మీద వివాదాన్ని రాజేసిన పురుష సంఘానిది వంకరబుద్ది అని దుయ్యబట్టారు. మహిళల ఐకమత్యం వర్థిల్లాలని నినాదాలు చేశారు. అంతే కాదు... 'పుష్ప' సినిమాను తొలి రోజు చూస్తామని, 'ఊ అంటావా' పాటకు ఈలలు వేసి, చెప్పట్లు కొడతామని చెప్పారు.
Also Read: ‘పుష్ప’ ట్విట్టర్ రివ్యూ.. అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో... ఇరగదీశాడట!