అన్వేషించండి
Advertisement
Pushpa: 'ఉ.. అంటావా.. ఊఊ అంటావా..' సమంత స్పెషల్ సాంగ్ వచ్చేస్తుందోచ్..
'పుష్ప' సినిమాలో ఐటెం సాంగ్ ను విడుదల చేయబోతున్నారు. ఇందులో సమంత నటించిన సంగతి తెలిసిందే.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా 'పుష్ప'. దీనికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇదివరకు ఈ కాంబోలో వచ్చిన సినిమాలు ఆడియో పరంగా భారీ విజయాలను అనుకున్నాయి. అందుకే.. ఈ సినిమా పాటల విషయంలో ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలన్నీ కూడా ట్రెండింగా నిలిచాయి. ఇప్పుడు సినిమాలో ఐటెం సాంగ్ ను విడుదల చేయబోతున్నారు. ఇందులో సమంత నటించిన సంగతి తెలిసిందే.
'ఉ.. అంటావా.. ఊఊ అంటావా..' అంటూ సాగే ఈ ఐటెం సాంగ్ లిరికల్ వీడియోను డిసెంబర్ 10న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం అనౌన్స్ చేసింది. అంతేకాదు.. సమంతకు సంబంధించిన ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో సమంత తన హాట్ లుక్ తో ఆకట్టుకుంటుంది.
View this post on Instagram
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ రికార్డులను తిరగరాశాయి. ఈ సినిమాను డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నారు. రష్మిక హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నాడు. అలానే సునీల్, అనసూయ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. తొలిసారి ఈ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంటర్ అవుతున్నాడు బన్నీ.
Also Read:'పుష్ప' సెట్స్ లో గోల్డ్ బిస్కెట్స్ పంచిన బన్నీ..
Also Read: ఈ సెలెబ్రిటీ పెళ్లి ఓటీటీలో ప్రసారం కానుందా... వందకోట్ల డీల్ కుదిరిందా?
Also Read: కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబర్ మృతి...
Also Read: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
అమరావతి
హైదరాబాద్
విజయవాడ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement