Puri Jagannadh: క్రేజీ డీల్ వదులుకున్న 'లైగర్' టీమ్ - ఛార్మితో ఎఫైర్ పై స్పందించిన పూరి జగన్నాధ్!
హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన ఛార్మి ఇప్పుడు నిర్మాతగా కొనసాగుతుంది. చాలా రోజులుగా పూరి-ఛార్మిల మధ్య ఎఫైర్ నడుస్తుందనే ప్రచారం జరుగుతుంది.
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన 'లైగర్'(Liger) సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'ఇస్మార్ట్ శంకర్' సక్సెస్ తర్వాత పూరి జగన్నాథ్, యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ జోరు పెంచింది చిత్రబృందం.
ఇందులో భాగంగా తాజాగా విజయ్, పూరి జగన్నాధ్ లను ఛార్మి ఇంటర్వ్యూ చేసింది. దీనికి సంబంధించిన ప్రోమో యూట్యూబ్ లో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాల గురించి ఛార్మి.. విజయ్, పూరిలతో చర్చించారు. ఇక లాక్ డౌన్ సమయంలో ఓ ఓటీటీ సంస్థ నుంచి క్రేజీ ఆఫర్ వచ్చినా.. వదులుకున్నామని, చేతిలో ఒక్క రూపాయి లేకపోయినా సరే ఆఫర్ ని రిజెక్ట్ చేశామని చెబుతూ ఛార్మి ఎమోషనల్ అయింది.
ఛార్మితో ఎఫైర్ పై స్పందించిన పూరి జగన్నాధ్:
హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన ఛార్మి ఇప్పుడు నిర్మాతగా కొనసాగుతుంది. పూరి జగన్నాధ్ తో కలిసి పూరి కనెక్ట్స్ పేరుతో సినిమాలు చేస్తుంది. అయితే చాలా కాలంగా పూరి-ఛార్మిల మధ్య ఎఫైర్ నడుస్తుందనే ప్రచారం జరుగుతుంది. పూరితో రిలేషన్ కారణంగానే ఛార్మి ఇంకా పెళ్లి చేసుకోలేదనే వార్తలొస్తున్నాయి. తాజాగా ఛార్మితో తనకున్న రిలేషన్ గురించి మాట్లాడారు పూరి.
ఛార్మి 13 ఏళ్ల వయసప్పటి నుంచి తనకు తెలుసని.. దశాబ్దాలుగా ఆమెతో కలిసి పని చేస్తున్నానని తెలిపారు. ఛార్మితో తనకు ఎఫైర్ ఉందని ఏదేదో మాట్లాడుకుంటారని.. ఆమె యంగ్ గా ఉండడం వలనే *ఇలాంటి రూమర్స్ వస్తున్నాయని అన్నారు. అదే ఛార్మికి యాభై ఏళ్లు ఉంటే ఇలా ఎవరూ మాట్లాడేవారు కాదని.. ఆమెకి వేరేవాళ్లతో పెళ్లి జరిగినా పట్టించుకునేవారు కాదని చెప్పారు. ఒకే ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా ట్రావెల్ చేస్తుండడంతో ఇలా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఒకవేళ ఎఫైర్ ఉన్నా.. ఎక్కువ రోజులు నిలబడదని.. ఆకర్షణ కొన్ని రోజుల్లోనే చచ్చిపోతుందని.. స్నేహమే శాశ్వతమని క్లారిటీ ఇచ్చారు పూరి.
సెన్సార్ డీటైల్స్:
ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. సినిమా నిడివి 2 గంటల 20 నిమిషాలు. అయితే ఈ సినిమాకి సెన్సార్ టీమ్ ఏడు మార్పులు సూచించినట్లు తెలుస్తోంది. అందులో కొన్ని డైలాగ్స్ మార్చాల్సి వచ్చింది, కొన్ని చోట్ల మ్యూట్ వేయాల్సి వచ్చింది. నిడివిలో మాత్రం ఎలాంటి మార్పులు లేదు.
ఇక 'లైగర్' సినిమా విషయానికొస్తే.. స్పోర్ట్స్ యాక్షన్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో రమ్యకృష్ణ విజయ్ తల్లి పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించారు. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలకపాత్రలో నటించారు. ప్రముఖ బాలీవుడ్ దర్శక - నిర్మాత కరణ్ జోహార్‌కు చెందిన ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ నిర్మించారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మాతలు.
Also Read: తిరు రివ్యూ : ధనుష్, నిత్యా మీనన్ సినిమా ఎలా ఉందంటే?
Also Read: విద్యా బాలన్ 'డర్టీ పిక్చర్'కు సీక్వల్, ఆ పాత్ర చేసేందుకు కంగనా తిరస్కరణ?