Pulsar Bike Jhansi: 'పల్సర్ బైక్' సాంగ్ ఫేమ్ కండక్టర్ ఝాన్సీకి సినిమా ఛాన్స్
Conductor Jhansi Acting Debut: 'పల్సర్ బైక్' పాటతో ఫేమస్ అయిన గాజువాక కండక్టర్ ఝాన్సీ. ఇప్పుడు ఆమె ఓ సినిమాలో నటిస్తున్నారు.
![Pulsar Bike Jhansi: 'పల్సర్ బైక్' సాంగ్ ఫేమ్ కండక్టర్ ఝాన్సీకి సినిమా ఛాన్స్ Pulsar Bike Conductor Jhansi to make her Tollywood debut with Ukku Satyagraham movie Pulsar Bike Jhansi: 'పల్సర్ బైక్' సాంగ్ ఫేమ్ కండక్టర్ ఝాన్సీకి సినిమా ఛాన్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/25/6ee9fb074910469effa4d5a38bcd832b1700896091366313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ukku Satyagraham Movie Song Launch By Gaddar daughter Vennela: 'నేను అట్టాంటిట్టాంటి ఆడ దాన్ని కాదు బావో... పల్సర్ బైక్ మీద రారా బావో' - కొందరు 'ధమాకా' సినిమాలో ఈ పాటకు రవితేజ, శ్రీ లీల స్టెప్పులు వేయడం చూసి ఉంటారు. దాని వెనుక గాజువాక బస్ కండక్టర్ ఝాన్సీ ఉన్నారు. యస్... ఝాన్సీ డ్యాన్స్ చేసిన 'పల్సర్ బైక్' పాపులర్ కావడంతో తర్వాత సినిమాలో వాడారు. 'పల్సర్ బైక్' తర్వాత 'శ్రీదేవి డ్రామా కంపెనీ', 'ఢీ' కార్యక్రమాల్లో ఝాన్సీ సందడి చేశారు. ఇప్పుడు ఆవిడ తెలుగు చిత్రసీమకు పరిచయం అవుతున్నారు.
సత్యారెడ్డి 'ఉక్కు సత్యాగ్రహం'లో ఝాన్సీ
Conductor Jhansi of Pulsar bike fame In Ukku Satyagraham movie: సత్యా రెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తూ... స్వీయ దర్శకత్వంలో నిర్మించిన తాజా సినిమా 'ఉక్కు సత్యాగ్రహం'. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో రూపొందుతోంది. ఈ సినిమాలో కండక్టర్ ఝాన్సీ నటిస్తున్నారు. ''ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం ఏం చేయాలి? ఏం చేస్తే బావుంటుంది? అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో మంచి అంశాలు ఉన్నాయి. అందువల్ల, నటించాలని అనుకున్నాను. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన సత్యారెడ్డి గారికి థాంక్స్'' అని అన్నారు.
పాటలు, ట్రైలర్ విడుదల చేసిన గద్దర్ కుమార్తె
'ఉక్కు సత్యాగ్రహం' ట్రైలర్, పాటలను గద్దర్ కుమార్తె వెన్నెల విడుదల చేశారు. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ... ''మా నాన్న గద్దర్ గారు ప్రజల కోసం ఎంతో పాటు పడ్డారు. ప్రజల కోసం, ప్రజల సమస్యల మీద ఆయన పాటలు రాశారు. కరోనా కాలంలోనూ ఆంధ్ర, తెలంగాణల్లో ఎన్నో ప్రాంతాలు తిరిగారు. ప్రజల కోసం ఎంతో సేవ చేశారు. ప్రజల సమస్యలపై ఎన్నో పాటలు రాశారు. నాన్నగారు ఈ సినిమాలో పాటలు రాయడంతో పాటు నటించారు'' అని అన్నారు.
Also Read: కోట బొమ్మాళి పీఎస్ రివ్యూ: రాజకీయ చదరంగంలో పోలీసుల మధ్య యుద్ధం - థ్రిల్ ఇస్తుందా? లేదా?
''నేను ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం గద్దర్ గారు. నాకు ఆయన తండ్రితో సమానం. వయసుతో సంబంధం లేకుండా అందరితో కలివిడిగా ఉండేవారు. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరం. విశాఖ ఉక్కు ఉద్యమానికి సంబంధించిన సమస్యల్ని తెలియజేస్తూ ఈ సినిమా తీశాం'' అని దర్శకుడు సత్యా రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమానికి త్రినాధరావు నక్కిన, ఎమ్మెల్యే ధర్మ శ్రీ, ఫిలిం ఛాంబర్ మాజీ చైర్మన్ బీవీ రెడ్డి, పారిశ్రామికవేత్త రాజీవ్, నిర్మాత దాసరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: ఆదికేశవ రివ్యూ: మెగా మేనల్లుడి ఊర మాస్ యాక్షన్ - వైష్ణవ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
గద్దర్, సత్యా రెడ్డి, 'పల్సర్ బైక్' ఝాన్సీ, ఎమ్మెల్యే ధర్మశ్రీ గారు, ఎంవివి సత్యనారాయణ, ప్రసన్నకుమార్, వెన్నెల తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీ కోటి, కూర్పు: మేనగ శ్రీను, కథ - స్క్రీన్ ప్లే - నిర్మాత - దర్శకత్వం : పి సత్యా రెడ్డి.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)