Neelima Guna: గుణశేఖర్ కూతురి ఎంగేజ్మెంట్ - ఫొటో వైరల్!
రవి ప్రఖ్యా అనే వ్యక్తితో గుణశేఖర్ కూతురు నీలిమకి వివాహం కుదిరింది.
ప్రముఖ నిర్మాత గుణశేఖర్(Gunasekhar) మొదటి కూతురు నీలిమ గుణ(Neelima Guna) ఎంగేజ్మెంట్ వేడుకలు ఘనంగా జరిగాయి. రవి ప్రఖ్యా అనే వ్యక్తితో నీలిమకి వివాహం కుదిరింది. ఈ వేడుకకు సినీ సెలబ్రిటీలు చాలా మంది హాజరయ్యారు. తన ఎంగేజ్మెంట్ విషయాన్ని ప్రేక్షకులతో పంచుకుంటూ ఓ ఫొటో షేర్ చేసింది నీలిమ గుణ. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆమెకి శుభాకాంక్షలు చెబుతున్నారు.
గుణశేఖర్ కూడా ట్విట్టర్ లో ఈ విషయాన్ని చెబుతూ.. ఈరోజు తమకు స్పెషల్ డే అని రాసుకొచ్చారు. సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో నీలిమ గుణ కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తన తండ్రి డైరెక్ట్ చేసిన 'రుద్రమదేవి' సినిమాకి సహనిర్మాతగా వ్యవహరించింది. ఇప్పుడు 'శాకుంతలం' సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూనే ఉంది.
💛✨ the beginning of forever ✨💛#RaviPrakhya #NeelimaGuna pic.twitter.com/C7IyaoW7Vg
— Neelima Guna (@neelima_guna) October 8, 2022
ఈ ఏడాదిలోనే సినిమా రిలీజ్ అవుతుందని ప్రకటించింది. దానికి తగ్గట్లే నవంబర్ 4న రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. కానీ సినిమాను వాయిదా వేశారు. దానికి కారణం.. ఈ సినిమాను త్రీడీ టెక్నాలజీలోకి మార్చడమే. ఇలాంటి సినిమాను త్రీడీలో చూపించడం కరెక్ట్ అని భావించిన టీమ్.. దానికోసం వర్క్ చేయడం మొదలుపెట్టారు. అందుకే సినిమా రిలీజ్ ఆలస్యమవుతుందని తెలుస్తోంది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.
తమ ప్రయత్నాన్ని భారీ ఎత్తున, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో తెలుగు ప్రేక్షకులకు అందించడమే తమ లక్ష్యమని.. అందుకే 'శాకుంతలం' ఆలస్యమవుతుందని వెల్లడించారు మేకర్స్. ఇక ఈ సినిమాలో సమంత టైటిల్ రోల్ పోషిస్తుండగా.. దుశ్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించాడు. చిట్టి భరతుడి పాత్రలో అల్లు అర్హ నటించింది. ఈ సినిమాతోనే అర్హ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో డిఆర్‌పి, గుణ టీమ్ వర్క్స్ పతాకాలపై రూపొందుతోన్న 'శాకుంతలం' చిత్రానికి గుణ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. నీలిమా గుణ నిర్మాత. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీత సారథ్యం వహిస్తున్నారు. శేఖర్ వి.జోసెఫ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Also Read : హిందీలో మెగాస్టార్ 'గాడ్ ఫాదర్' రేర్ రికార్డ్ - మరో 600 స్క్రీన్లలో...
Also Read : ఎక్స్‌పోజ్డ్ వెబ్ సిరీస్ రివ్యూ : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమర్పించు... న్యూస్ ప్రజెంటర్ డెత్ మిస్టరీ
View this post on Instagram