Priyamani: ప్రియమణి కోరిన కోర్కెలు విన్నారా? ఆ రెండు రోల్స్ వస్తే...
ప్రియమణి వైవిధ్యమైన పాత్రలు చేశారు. అయితే... ఆమెకు రెండు రోల్స్ వస్తే చేయాలని ఉందట! ఇంతకీ, ఆమె కోరిక ఏంటంటే?
'పెళ్ళైన కొత్తలో' సినిమాతో ప్రియమణి (Priyamani) తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుని పదహారేళ్ళ అవుతోంది. ఇప్పటికీ కొత్త కొత్త పాత్రలతో ప్రేక్షకుల ముందుకు ఆమె వస్తున్నారు. 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ రెండు సీజన్స్‌లో పెళ్ళైన తర్వాత ఉద్యోగానికి వెళ్లే మహిళగా కనిపించారు. ఇప్పుడు 'ఆహా' ఓటీటీ కోసం రూపొందిన ఒరిజినల్ ఫిల్మ్ 'భామా కలాపం'లో కూడా వైఫ్ రోల్ చేశారు. అంతకు ముందు కమర్షియల్ సినిమాలు చేశారు. 'పరుత్తివీరన్'తో నేషనల్ అవార్డు అందుకున్నారు. అటువంటి ప్రియమణికి ఇప్పుడు ఎటువంటి రోల్స్ చేయాలని ఉందో తెలుసా?
"ఫుల్ లెంగ్త్ కామెడీ ఫిల్మ్ చేయాలని ఉంది. అలాగే, గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కూడా చేయాలని ఉంది. ఈ రెండూ నేను ఇప్పటి వరకూ చేయలేదు" అని ప్రియమణి తెలిపారు. దర్శక - రచయితలూ... ప్రియమణి కోరిక విన్నారా? ఆ రెండు రోల్స్ రాసుకుని వెళితే ఆమె ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆమె సినిమాలు అని మాత్రమే కాకుండా... వెబ్ సిరీస్, వెబ్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నారు.
అన్నట్టు... 'భామా కలాపం'లో అనుపమ పాత్రలో ప్రియమణి నటించారు. కొత్త రకాల వంటలు, రెసిపీలు ట్రై చేసి యూట్యూబ్ లో పోస్ట్ చేసే హోమ్ మేకర్ అన్నమాట. ఇదొక థ్రిల్లర్ సినిమా. ఇందులో వెటకారం, వినోదం, డ్రామా... అన్నీ ఉన్నాయని ప్రియమణి చెబుతున్నారు. ఫిబ్రవరి 11న 'ఆహా' ఓటీటీలో 'భామా కలాపం' (Bhama Kalapam) విడుదల కానుంది. ఇటీవల సినిమా టీజర్‌ను నేషనల్ క్రష్ రష్మికా మందన్న విడుదల చేశారు.
View this post on Instagram