అన్వేషించండి

Quotation Gang Movie: ఎన్టీఆర్ శ్రీను సమర్పణలో ‘కొటెషన్ గ్యాంగ్’ - కిరాయి హత్యల ముఠా థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే?

క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘కొటెషన్ గ్యాంగ్’ తెలుగు రిలీజ్ రైట్స్ ను రుషికేశ్వర్ ఫిలిమ్స్ దక్కించుకుంది. ఈ నెల 30న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు నిర్మాత వేణు గోపాల్ తెలిపారు.

Quotation Gang  Movie Telugu Release Rights: క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ‘దండుపాళ్యం‘ సినిమాను తలదన్నే చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘కొటెషన్ గ్యాంగ్’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం ఆగష్టు 30న విడుదలకు రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి తెలుగు వరల్డ్ వైడ్ రిలీజ్ రైట్స్ ను నిర్మాణ ఎం వేణుగోపాల్ దక్కించుకున్నారు. ఎన్టీఆర్ శ్రీను సమర్పణలో రుషికేశ్వర్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆయన ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.  

‘కొటెషన్ గ్యాంగ్’ ప్రేక్షకులను బాగా అలరిస్తుంది- నిర్మాత వేణుగోపాల్

‘కొటెషన్ గ్యాంగ్’ సినిమా తెలుగు రిలీజ్ రైట్స్ ను తనకు ఇవ్వడం పట్ల నిర్మాత వేణుగోపాల్ సంతోషం వ్యక్తం చేశారు. “గట్టి కాంపిటీషన్ ఉన్నా, ఈ సినిమా తెలుగు వరల్డ్ వైడ్ రిలీజ్ రైట్స్ నాకు ఇచ్చిన తమిళ నిర్మాతలకు కృతజ్ఞతలు. ఇప్పటికే విడుదలైన మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. తాజాగా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. జాకీష్రాఫ్,  ప్రియమణి, సన్నీ లియోన్, సారా నటన సినిమాకి హైలైట్ గా నిలువనుంది. త్వరలోనే ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాము. తెలుగు ప్రేక్షకులు కంటెంట్ ఉంటే చిన్న సినిమా, పెద్ద సినిమా అన్న తేడా లేకుండా మంచి విజయాన్ని అందిస్తారు. ఈ సినిమాను కూడా ఆదరించి పెద్ద సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను” అన్నారు.

కిరాయి హంతకుల కథాంశంతో తెరకెక్కిన ‘కొటెషన్ గ్యాంగ్’

‘కొటేషన్ గ్యాంగ్’ సినిమాకు వివేక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నటి ప్రియమణి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.  బాలీవుడ్ నటీనటులు జాకీ ష్రాఫ్, సన్నీ లియోన్, సారా అర్జున్  కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఫిల్మీ నటి ప్రొడక్షన్స్, వై స్టూడియోస్ పై వివేక్ కుమార్ ఈ సినిమాను నిర్మించారు. మరో నిర్మాతగా గాయత్రి సురేష్ వ్యవహరించారు. రీసెంట్ గా విడుదలైన టీజర్ పూర్తి స్థాయిలో హింసతో నిండిపోయింది. కిరాయి హత్యల గ్యాంగ్ కథాంశంతో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రం కథ చెన్నై, ముంబై, కశ్మీర్ ప్రాంతాల్లో జరిగే సంఘటనల చుట్టూ సాగుతుంది. ఈ మూడు ప్రాంతాల్లో జరిగే హత్యలకు, ఈ కిరాయి గ్యాంగ్ లకు మధ్య లింక్ పెట్టి ఈ సినిమాను రూపొందించారు. టీజర్ అంతా చంపుకోవడమే కనిపిస్తుంది.  

ఈ నెల 30న ‘కొటెషన్ గ్యాంగ్’ విడుదల

తాజాగా విడుదలైన టీజర్ లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ గా నిలుస్తోంది. డ్రమ్స్ శివమణి ఈ చిత్రానికి అందించిన మ్యూజిక్ అదుర్స్ అనిపిస్తోంది. సినిమాటోగ్రఫీ సైతం ఆకట్టుకుంటోంది. ప్రియమణి, సన్నీ లియోన్, జాకీష్రాఫ్ మాస్ లుక్ లో ఒదిగిపోయి నటించారు. నిజానికి ‘కొటేషన్ గ్యాంగ్’ సినిమా జూలైలో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ, కొన్ని కారణాలతో విడుదలను మేకర్స్ వాయిదా వేశారు. ఈనెల(ఆగష్టు 30న) ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.  ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎంతమేరకు మెప్పిస్తుందో చూడాలి. 

Quotation Gang Movie Cast And Crew: జాకీ ష్రాఫ్, ప్రియమణి, సన్నీ లియోన్, సారా అర్జున్ తదితరులు నటించిన ఈ చిత్రానికి నిర్మాణ సంస్థలు: రుషికేశ్వర్ ఫిలిమ్స్ - ఫిల్మ్ నటి ప్రొడక్షన్స్ - వై స్టూడియోస్, డిజిటల్ మీడియా: డిజిటల్ దుకాణం, పీఆర్వో: మధు వీఆర్, నిర్మాతలు: ఎం. వేణుగోపాల్ - వివేక్ కుమార్ కన్నన్ - గాయత్రి సురేష్, కెమెరా: అరుణ్ బాత్మనబన్, సంగీతం: డ్రమ్స్ శివమణి, కూర్పు: కేజే వెంకటరమణన్, దర్శకత్వం: వివేక్ కుమార్ కన్నన్.

Read Also: విజ‌య్ ‘ది గోట్’ మూవీ నుంచి అదిరిపోయే అప్‌ డేట్, ట్రైలర్ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన మేకర్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
Russia cancer Vaccine: ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
Russia cancer Vaccine: ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Look Back 2024: 151 నుంచి 11కు- జగన్ కు చేదు జ్ఞాపకంలా 2024
151 నుంచి 11కు- జగన్ కు చేదు జ్ఞాపకంలా 2024
Weather Today : తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
Keerthy Suresh: సౌత్ కంటే డబుల్... బాలీవుడ్‌లో రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్
సౌత్ కంటే డబుల్... బాలీవుడ్‌లో రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్
Embed widget