అన్వేషించండి

GOAT Movie Trailer: విజ‌య్ ‘ది గోట్’ మూవీ నుంచి అదిరిపోయే అప్‌ డేట్, ట్రైలర్ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన మేకర్స్

Thalapathy Vijay ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ది గోట్’. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్ డేట్ వచ్చింది. ట్రైలర్ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు.

GOAT Movie Trailer Update: తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి, మీనాక్షి చౌదరి హీరో, హీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (GOAT). ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ మూవీ విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే టీజర్ విడుదల చేసిన మేకర్స్.. ట్రైలర్ కు సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చారు. ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు.

ఆగష్టు 17న ‘ది గోట్’ ట్రైలర్ విడుదల

సెప్టెంబర్ 5న ‘ది గోట్’ సినిమా విడుదలకానుంది. మరో 20 రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ట్రైలర్ ను ఆగష్టు 17న సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు అదిరిపోయే పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో విజయ్ స్టైలిష్ డ్రెస్ లో విలన్స్ ను గన్ తో ఫైర్ చేస్తున్నట్లు కనిపించాడు. ‘ది గోట్’ ట్రైలర్ ఆగష్టు 17న సాయంత్రం 5 గంటలకు మీ స్క్రీన్స్ మీద ల్యాండింగ్ కానుంది” అని దర్శకుడు వెంకట్ ప్రభు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.  

చనిపోయిన కెప్టెన్ తో కామియో రోల్

ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ‘ది గోట్’ సినిమా తెరకెక్కుతోంది. కల్పతి ఎస్ అఘోరం ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో చనిపోయిన కెప్టెన్ విజయ్ కాంత్ కామియో రోల్ చేయబోతున్నారు. AI టెక్నాలజీ సాయంతో కెప్టెన్ విజయ్ కాంత్ ను తెర మీద  సృష్టించబోతున్నారు. ముందుగా ఈ విషయాన్ని కెప్టెన్ కుటుంబ సభ్యులకు చెప్పి, వారి అనుమతి తీసుకున్న తర్వాతే ఆయన ఈ సినిమాలో చూపించబోతున్నట్లు మేకర్స్ గతంలోనే వెల్లడించారు. ‘ది గోట్’ విజయ్ రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. విజయ్ యువకుడిగా ఉన్న పాత్రలో విజయ్ కాంత్ కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. విజయ్ కాంత్ ను 18 ఏండ్ల యువకుడిగా చూపించేందుకు చిత్రబృందం  డీఏజింగ్ టెక్నాలజీని ఉపయోగించారట. ఇందుకోసం ప్రత్యేకంగా వీఎఫ్ఎక్స్ వాడినట్లు సమాచారం. విజయ్ సినిమాలో విజయ్ కాంత్ కనిపించడం పట్ల, విజయ్ తో పాటు విజయ్ కాంత్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, మీనాక్షి చౌదరి, జయరాం, యోగి బాబు సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  

‘ది గోట్’ స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్     

‘ది గోట్’ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఇందుకోసం భారీ మొత్తాన్ని వెచ్చించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకంటున్నాయి.  

Read Also: ఇండిపెండెన్స్ డే స్పెషల్- ‘మల్లేశం’ బ్యూటీ ‘పొట్టేల్‌’ రిలీజ్‌ డేట్ ఫిక్స్‌!

Read Also: ఇదేం ఇండిపెండెన్స్ డే, కోల్‌కత్తా డాక్టర్‌ హత్యాచార ఘటనపై ఉపాసనా సెన్సేషనల్ పోస్ట్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Embed widget