The Kashmir Files: ఇది గాయాలను మాన్పుతుందా? ‘ది కశ్మీర్ ఫైల్స్’పై ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు
‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై ప్రకాష్ రాజ్ స్పందించారు. ఆ సినిమా ప్రదర్శి్స్తున్న థియేటర్‌లో ఓ వ్యక్తి చేస్తున్న విద్వేషపూరిత ప్రసంగం వీడియోను ట్వీట్ చేశారు.
Prakash Raj | ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా ఏ స్థాయిలో ప్రశంసలు అందుకుంటుందో తెలిసిందే. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ చిత్రం చూసి ఫిదా అయ్యారు. కొన్ని రాష్ట్రాలైతే ఈ చిత్రానికి ట్యాక్స్ మినహాయింపులు కూడా ఇచ్చారు. 90వ దశకంలో కశ్మీర్ పండిట్‌లపై సాగిన సామూహిక హత్యాకాండ నేపథ్యంలో దర్శకుడు వివేక్ ‘ది కశ్మీర్ ఫైల్స్’ అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్ లు కీలకపాత్రలు పోషించారు. మార్చి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఊహించని కలెక్షన్లతో ముందుకు సాగిపోతోంది. అయితే, ఈ చిత్రంపై విమర్శలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. కొందరు బీజేపీని టార్గెట్ చేసుకుంటూ ట్రోల్ చేస్తున్నారు.
తాజాగా ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఈ చిత్రంపై స్పందిస్తూ తన ట్విట్ ఖాతాలో ఓ వీడియో వదిలారు. అందులో ఓ థియేటర్‌లో వ్యక్తి ఓ వర్గంపై విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నాడు. దీనిపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.. ‘‘ది కశ్మీర్ ఫైల్స్.. ఈ ప్రచార చిత్రం గాయాలను నయం చేస్తుందా? లేక విద్వేష బీజాలను విత్తి గాయాలను మాన్పుతుందా? జస్ట్ అడుగుతున్నా అంతే’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో నెటిజనులు ప్రకాష్ రాజ్‌ను ట్రోల్ చేస్తున్నారు. కొందరు మాత్రం ఆ వీడియోలో ఉన్న వ్యక్తి వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.
#kashmirifiles this propaganda film … is it healing wounds or sowing seeds of hatred and inflicting wounds #Justasking pic.twitter.com/tYmkekpZzA
— Prakash Raj (@prakashraaj) March 18, 2022
కశ్మీర్ లోయలోని హిందూ కుటుంబాలపై పాకిస్తాన్ ప్రేరేపిత ముస్లిం ఉగ్రవాదులు దారుణ మారణకాండకు పాల్పడ్డారు. కశ్మీరీ మహిళలలను వివస్త్రలుగా చేసి.. సామూహిక మానభంగం చేశారు. ఆ లోయలో ఉండాలంటే ముస్లింలుగా మతం మార్చుకోవాలని.. లేదంటే చంపేస్తామని బెదిరించారు. తమకు ఎదురు తిరిగినవారిని చంపేశారు. వారి ఆస్తులను దోచుకున్నారు. తుపాకులు, కత్తులతో హిందువులపై దాడి చేశారు. అప్పటివరకు తమతో కలిసి ఉన్న ముస్లిం సోదరులు తమను చంపడానికి ప్రయత్నించడం పండిట్ లను విస్మయానికి గురిచేసింది. దాదాపు 5 లక్షల మంది కశ్మీరీ పండిట్ లు స్వదేశంలోనే శరణార్థులుగా మారారు. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిపోయారు. వేలాది కుటుంబాలు చెల్లాచెదురైపోయాయి. అప్పట్లో జరిగిన ఈ మారణకాండకు కేంద్రంలో ఉన్న ఓ మంత్రి సాయం చేసినట్లు అనుమానాలు ఉన్నాయి. నాటి పరిస్థితులను దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి కళ్లకు కట్టినట్లు చిత్రీకరించారు.
Also Read: ‘యుద్ధం’ చూడాలని ఉందా? ఈ 8 వెబ్‌సీరిస్‌లు కట్టిపడేస్తాయ్, డోన్ట్ మిస్!