X

Prabhas: ప్రభాస్@25.. కొత్త సినిమా ప్రకటన ఆ రోజే, టైటిల్ ఇదేనా?

ప్రభాస్ చేసే సినిమాలకు క్రేజ్ ఎక్కువ. త్వరలో తన 25 వ సినిమాను ప్రకటించబోతున్నాడట డార్లింగ్ స్టార్.

FOLLOW US: 

‘బాహుబలి’ సినిమా ప్రభాస్ క్రేజ్ ను అమాంతం పెంచేసింది. పాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది. సలార్, రాధేశ్యామ్, ఆది పురుష్... ఈ మూడు సినిమాలు వరుస పెట్టి విడుదల కానున్నాయి. ఆ తరువాత ప్రభాస్ చేయబోయే సినిమా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయబోయే ‘ప్రాజెక్ట్ కె’.ఈ సినిమాకు ఇంకా పేరు ఖరారు చేయలేదు. ఈ సినిమా తరువాత ప్రభాస్ ఒప్పుకోబోయే సినిమా అతడి 25వ సినిమా అవుతుంది. ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తారు? నిర్మాత ఎవరు? ఆ సినిమా పేరు ఏమై ఉంటుంది? ఇలా చాలా సందేహాలు ప్రభాస్ అభిమానుల్లో కలుగుతున్నాయి. ఈ సందేహాలన్నింటికీ అక్టోబర్ 7న ఫుల్ స్టాప్ పడనుంది. ఆరోజున అధికారికంగా ప్రభాస్ తన 25వ సినిమాను ప్రకటించనున్నారట. 

సోషల్ మీడియాలో ప్రభాస్ 25వ సినిమాకు సంబంధించి కొన్ని రోజులుగా ఓ వార్త వైరల్ అవుతోంది. ఆ సినిమా పేరు  ‘వృందావన’ అని, ఇప్పటికే ఆ టైటిల్ ను రిజిస్టర్ చేయించారని టాక్ నడుస్తోంది. ఈ సినిమా దిల్ రాజు నిర్మాణంలో, హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ మైథాలజీ డ్రామాగా రాబోతోందట. ఇది నిజమో కాదో తెలియాలంటే అధికారికంగా ఓ ప్రకటన రావాల్సిందే. అతి త్వరలో ప్రకటన చేసేందుకు చిత్రయూనిట్ కూడా సిద్ధమవుతోంది. 

దర్శకుడిగా ప్రశాంత్ నీల్ నే మళ్లీ ఎంపిక చేసినట్టు కూడా టాలీవుడ్ టాక్. ఇప్పటికే ప్రభాస్ అతని దర్శకత్వంలో ‘సలార్’ సినిమాలో నటిస్తున్నాడు. తిరిగి అదే కాంబినేషన్లో ప్రభాస్ 25వ సినిమా రాబోతోందని అంటున్నారు. కెజీఎఫ్ చాప్టర్ 1తో ప్రశాంత్ నీల్ కు క్రేజీ దర్శకుడిగా ముద్రపడింది. ఆయన ‘కెజీఎఫ్ చాప్టర్ 2’ షూటింగ్ కూడా దాదాపు పూర్తి చేశాడు.  అయితే ప్రభాస్ 25వ సినిమా విడుదలవ్వడానికి మాత్రం రెండుమూడేళ్లు పట్టొచ్చని అంచనా . 

Also read: చైతూ-సామ్ లైఫ్‌లో అజ్ఞాత వ్యక్తి.. ప్రీతమ్ జుకల్కర్ కామెంట్స్ ఆమె గురించేనా? అందుకే విడాకులా?

Also read: చైతన్య-సమంత విడాకులకు అమీర్ ఖాన్ కారణమన్న కంగనా..

Also Read: చివరికి గెలిచేది ప్రేమే... వారికి తప్పదు పతనం, సామ్ భావోద్వేగం

Also read: సినీ పెద్దల ఆశీర్వాదం నాకొద్దు.. నరేష్ నీ చక్రం దొబ్బేశాం.. సిగ్గుపడేలా మాట్లాడకు: ప్రకాష్ రాజ్

Also read: ఈ ఫోటోలోని ఓ పిల్లాడు ఇప్పుడు తెలుగు వారికి నచ్చిన హీరో... ఎవరో కనిపెట్టారా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Prabhas 25 New film Prabhas film Update ప్రభాస్25

సంబంధిత కథనాలు

Ghani Anthem Promo: 'గని' యాంథెమ్.. 'They Call Him Ghani.. కనివిని ఎరుగని'.. 

Ghani Anthem Promo: 'గని' యాంథెమ్.. 'They Call Him Ghani.. కనివిని ఎరుగని'.. 

Aryan Khan Bail Hearing: 'ఆర్యన్ ఖాన్ వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా.. బెయిల్ ఇవ్వొద్దు మైలార్డ్'

Aryan Khan Bail Hearing: 'ఆర్యన్ ఖాన్ వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా.. బెయిల్ ఇవ్వొద్దు మైలార్డ్'

RRR: 'ఆర్ఆర్ఆర్' థియేట్రికల్ బిజినెస్.. అంత తక్కువకి అమ్మేస్తున్నారా..?

RRR: 'ఆర్ఆర్ఆర్' థియేట్రికల్ బిజినెస్.. అంత తక్కువకి అమ్మేస్తున్నారా..?

Romantic Badass Trailer: దుమ్మురేపుతున్న ‘రొమాంటిక్’ బదాస్ ట్రైలర్.. ఊపిచ్చే డైలాగులతో రచ్చ!

Romantic Badass Trailer: దుమ్మురేపుతున్న ‘రొమాంటిక్’ బదాస్ ట్రైలర్.. ఊపిచ్చే డైలాగులతో రచ్చ!

Prabhas: మళ్లీ ముంబైకు ప్రభాస్... రాముడికి టాటా చెప్పిన తర్వాతే!

Prabhas: మళ్లీ ముంబైకు ప్రభాస్... రాముడికి టాటా చెప్పిన తర్వాతే!
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Chandra Babu : దొరకని మోడీ, షా అపాయింట్‌మెంట్లు.. ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన!

Chandra Babu : దొరకని మోడీ, షా అపాయింట్‌మెంట్లు.. ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన!

Covid 19 Vaccine For Children: చిన్నారులకు కరోనా వ్యాక్సిన్‌పై అపోలో శుభవార్త.. వారికి ఉచితంగా టీకాలపై ప్రకటన

Covid 19 Vaccine For Children: చిన్నారులకు కరోనా వ్యాక్సిన్‌పై అపోలో శుభవార్త.. వారికి ఉచితంగా టీకాలపై ప్రకటన

Divi Vadthya Photos: ‘దివి’ నుంచి భువికొచ్చిన యాపిల్ బ్యూటీ

Divi Vadthya Photos: ‘దివి’ నుంచి భువికొచ్చిన యాపిల్ బ్యూటీ

AP HighCourt : పోలీసు శాఖలో వారిని విలీనం చేయడంపై పిటిషన్ ! ఎలా చేశారో చెప్పాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం !

AP HighCourt :  పోలీసు శాఖలో వారిని విలీనం చేయడంపై పిటిషన్ ! ఎలా చేశారో చెప్పాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం !