Prabhas: మొగల్తూరుకి వెళ్లనున్న ప్రభాస్ - 70 వేల మందికి భోజనం!
గత 12 ఏళ్లలో ప్రభాస్ తొలిసారి మొగల్తూరుకి వెళ్తున్నారు. 2010లో ప్రభాస్ తండ్రి మరణించినప్పుడు మొగల్తూరుకి వెళ్లారు.
రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించి కొన్ని రోజులు గడిచిపోయింది. ఆయన మరణాన్ని ప్రభాస్ అండ్ ఫ్యామిలీ తట్టుకోలేకపోతున్నారు. దీని నుంచి కోలుకోవడానికి వారికి మరింత సమయం పడుతుంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ప్రభాస్ సెప్టెంబర్ 28న మొగల్తూరుకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. అక్కడ కృష్ణంరాజు సంస్మరణ సభను ఏర్పాటు చేయబోతున్నారు. ప్రభాస్ తో పాటు కృష్ణంరాజు ఫ్యామిలీ కూడా మొగల్తూరుకి వెళ్లనుంది.
వీరంతా కొన్నిరోజులు పాటు అక్కడే ఉండనున్నారు. అందుకే అక్కడ ఉన్న వారి ఇంటిని రెన్నోవేట్ చేయిస్తున్నారు. దాదాపు 50 మంది పనివాళ్లు ఇంటి కోసం పని చేస్తున్నారు. గత 12 ఏళ్లలో ప్రభాస్ తొలిసారి మొగల్తూరుకి వెళ్తున్నారు. 2010లో ప్రభాస్ తండ్రి మరణించినప్పుడు మొగల్తూరుకి వెళ్లారు. కృష్ణంరాజు మాత్రం ఏడాది కనీసం రెండుసార్లైనా.. తన సొంతూరికి వెళ్లేవారు. కోవిడ్ సమయంలో మాత్రం వెళ్లడానికి కుదరలేదు.
ఇక మొగల్తూరులో కృష్ణంరాజు స్మారక సభ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించనున్నారు. దాదాపు 70 వేల మందికి భోజనం ఏర్పాట్లు చేయిస్తున్నారు. ద్రాక్షారామంకి చెందిన కొందరు చెఫ్ లను ఈ టాస్క్ కోసం నియమించారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కృష్ణంరాజు అంత్యక్రియల సమయంలో కూడా చివరిచూపు కోసం వచ్చిన అభిమానులందరికీ భోజనం పెట్టించి మరీ పంపించారు ప్రభాస్. ఇప్పుడు మరోసారి అభిమానుల కోసం భోజనం ఏర్పాట్లు చేయిస్తున్నారు.
ప్రభాస్ పెద్ద మనసుకి ఇది సాక్ష్యంగా నిలుస్తుంది. ఇక ప్రభాస్ ఇలా పెదనాన్న చనిపోయిన బాధలో ఉంటే.. నేషనల్ మీడియా మాత్రం అతడిపై రూమర్స్ క్రియేట్ చేస్తుంది. హిందీ హీరోయిన్ కృతి సనన్‌తో ప్రభాస్ డేటింగ్‌లో ఉన్నారనేది బాలీవుడ్ టాక్. వీళ్లిద్దరూ కలిసి 'ఆదిపురుష్' (Adipurush Movie) లో జంటగా నటించారు. ఆ సినిమా సెట్స్‌లో ప్రేమలో పడ్డారట. ఒకరిపై మరొకరికి స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నాయట. హిందీ చిత్రసీమలో సినిమా విడుదలకు ముందు హీరో హీరోయిన్లు డేటింగ్ చేస్తున్నారని పుకార్లు వినిపించడం సహజమే. ఈ పుకారు కూడా అందులో భాగంగా వచ్చినదే. అయితే, బాలీవుడ్ జనాలు ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళిద్దరూ సీరియస్ రిలేషన్షిప్‌లో ఉన్నారని చెప్పడం మొదలు పెట్టారు.
'కాఫీ విత్ కరణ్' కార్యక్రమానికి టైగర్ ష్రాఫ్, కృతి సనన్ వచ్చిన ఎపిసోడ్ ఇటీవల టెలికాస్ట్ అయ్యింది. ఆ ప్రోగ్రామ్‌లో ఒక సెలబ్రిటీకి ఫోన్ చేయమని కరణ్ జోహార్ అడుగుతారు. అప్పుడు ప్రభాస్‌కు కృతి సనన్ ఫోన్ చేశారు. ఫోన్ వెంటనే లిఫ్ట్ చేశారు మన బాహుబలి. రిలేషన్షిప్‌లో ఉన్నారు కాబట్టే అంత త్వరగా ఫోన్ లిఫ్ట్ చేశారని బాలీవుడ్ మీడియా కొత్త థియరీలు వినిపించడం ప్రారంభించింది.
ప్రభాస్ లవ్ లైఫ్, మీద పుకార్లు వినిపించడం ఇదేమీ కొత్త కాదు. గతంలో అనుష్క శెట్టి (Anushka Shetty) తో ఆయన ప్రేమలో ఉన్నారని వినిపించింది. ప్రభాస్ ఫ్యామిలీ, అనుష్క మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పైగా, ఇద్దరూ కలిసి నాలుగు సినిమాల్లో నటించడంతో పెళ్లి చేసుకుంటారనే వరకూ ఆ వార్తలు వెళ్లాయి. ఆ ప్రచారాన్ని వాళ్ళిద్దరూ ఖండించారనుకోండి.
ఇప్పుడు ప్రభాస్ కుటుంబం ఇంటి పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పుడు ఇటువంటి వార్తలు రావడం బాధాకరమని తెలుగు ప్రేక్షకులు, సినిమా జనాలు అభిప్రాయపడుతున్నారు. ఎంత సినిమా పబ్లిసిటీ అయినప్పటికీ... ఏ సమయంలో ఎటువంటి వార్తలు ప్రచారం చేయాలో తెలియదా? అంటూ మండి పడుతున్నారు. అసలు, కృతితో ప్రభాస్ డేటింగ్ అనేది పచ్చి అబద్ధమని ఆయన సన్నిహితులు తెలిపారు.
Also Read : ఈ వారం థియేట్రికల్ - ఓటీటీ రిలీజెస్ ఇవే!
Also Read : ‘జైలర్’ హీరోయిన్ షాకింగ్ నిర్ణయం! నిజంగానే రజనీ మూవీ నుంచి తప్పుకుందా?