(Source: ECI/ABP News/ABP Majha)
Sita Ramam: ఒకే వేదికపై దుల్కర్, ప్రభాస్ - ఇక ఫ్యాన్స్‌కు పండుగే!
'సీతారామం' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా ప్రభాస్ రాబోతున్నారు.
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) కథానాయకుడిగా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రూపొందుతున్న సినిమా 'సీతా రామం'. యుద్ధంతో రాసిన ప్రేమకథ... అనేది ఉపశీర్షిక. ఆగస్టు 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకు విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. రేపు ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు.
దీనికి ముఖ్య అతిథిగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) రాబోతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని కాసేపట్లో అధికారికంగా ప్రకటించనుంది చిత్రబృందం. ఈ సినిమాను నిర్మించిన వైజయంతీ మూవీస్ బ్యానర్ లోనే ప్రభాస్ 'ప్రాజెక్ట్ K'(Project K) అనే సినిమా చేస్తున్నారు. అందుకే ఇప్పుడు దుల్కర్ సినిమాను సపోర్ట్ చేస్తూ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. మొత్తానికి ప్రభాస్ రాకతో ఈ ఈవెంట్ కి కల రావడం ఖాయం.
'అందాల రాక్షసి', 'పడి పడి లేచె మనసు' చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి(Hanu Raghavapudi) తెరకెక్కిస్తున్న తాజా చిత్రమిది. రష్మికా మందన్న (Rashmika Mandanna) కీలక పాత్రలో కనిపించనున్నారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్. సుమంత్, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read: కొరటాల, బుచ్చిబాబు సినిమాలు - ఎన్టీఆర్ ప్లాన్ ఇదే!
Also Read: జగపతిబాబు వల్ల డబ్బులు పోగొట్టుకున్నా - త్రివిక్రమ్ సినిమా అందుకే వద్దన్నా: వేణు తొట్టెంపూడి
View this post on Instagram