అన్వేషించండి

Venu Thottempudi: జగపతిబాబు వల్ల డబ్బులు పోగొట్టుకున్నా - త్రివిక్రమ్ సినిమా అందుకే వద్దన్నా: వేణు తొట్టెంపూడి

నటుడు జగపతిబాబు కారణంగా డబ్బులు పోగొట్టుకున్నానని, త్రివిక్రమ్ సినిమా ఛాన్స్ వద్దన్నానని ఇలా చాలా విషయాలను చెప్పుకొచ్చారు వేణు.

ఒకప్పుడు టాలీవుడ్ లో హీరోగా సినిమాలు చేశారు వేణు తొట్టెంపూడి(Venu Thottempudi). ఆయన కెరీర్ లో చాలా హిట్స్ ఉన్నాయి. అయితే కొన్నాళ్లుగా ఆయన ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. చాలా కాలం తరువాత ఇప్పుడు మళ్లీ 'రామారావు ఆన్ డ్యూటీ'(Ramarao On Duty) అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో ఆయన పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు వేణు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నటుడు జగపతిబాబు(Jagapathi Babu) కారణంగా డబ్బులు పోగొట్టుకున్నానని, త్రివిక్రమ్(Trivikram) సినిమా ఛాన్స్ వద్దన్నానని ఇలా చాలా విషయాలను చెప్పుకొచ్చారు. 

జగపతిబాబు వల్ల డబ్బులు పోగొట్టుకున్నా:  
''జగపతిబాబు గారితో మంచి రిలేషన్ ఉండేది. ఆయనతో కలిసి 'హనుమాన్ జంక్షన్', 'ఖుషీ ఖుషీగా' ఇలా కొన్ని సినిమాలు చేశారు. ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అయితే మా ఇద్దరి మధ్య చిన్న ఇన్సిడెంట్ జరిగింది. దాని కారణంగా నేను ఆర్థికంగా నష్టపోయాను. ఆ విషయాన్ని చర్చించడం నాకిష్టం లేదు. కానీ ఆరోజుల్లో అది నాకు చాలా పెద్ద అమౌంట్. ఒక వ్యక్తిని హామీ ఇచ్చి డబ్బిలిప్పించారు జగపతి బాబు. ఆయన మధ్యలో ఎంటర్ అయి.. నాది హామీ అని గ్యారెంటీ ఇవ్వడంతోనే నేను డబ్బులిచ్చా. కానీ ఆ వ్యక్తి డబ్బు తిరిగివ్వలేదు. డబ్బు వెనక్కిచ్చారా లేదా..? అని జగపతిబాబు కూడా అడగలేదు. నాకు బాదైతే కలిగింది. మొత్తం రూ.14 లక్షలు'' అంటూ చెప్పుకొచ్చారు. 

త్రివిక్రమ్ సినిమా అందుకే వద్దన్నా:
''త్రివిక్రమ్ తో కలిసి కొన్ని సినిమాలకు పని చేశాను. నా సినిమాలకు రైటర్ గా పని చేశారాయన. 'అతడు' సినిమాలో సోనూసూద్ రోల్ లో నటించమని ముందుగా త్రివిక్రమ్ నన్నే అడిగారు. నేను వెంటనే ఎడిటర్ మోహన్ గారి దగ్గరకి వెళ్లి విషయం చెప్పాను. ఇండస్ట్రీలో ఆయన నాకు బాగా క్లోజ్. అప్పా(నాన్న) అని పిలుస్తుంటాను. అతడికి విషయం చెప్పినప్పుడు.. హీరోగా చేస్తున్నప్పుడు విలన్ గా అంటే తరువాత ఇబ్బంది పడతావేమో అని అన్నారు. దీంతో నేను ఆ సినిమా రిజెక్ట్ చేశాను. ఆ తరువాత రెండు, మూడు సార్లు త్రివిక్రమ్ ను సినిమా అవకాశాల కోసం సంప్రదించాను. కానీ కుదరలేదు. ఆయన హెల్ప్ చేస్తారనే నమ్మకమైతే ఉంది'' అంటూ తెలిపారు.  

Also Read : స్టార్స్ సెక్స్ లైఫ్ గురించి అడిగితే మీ అమ్మ ఏమీ అనుకోరా? - కరణ్ జోహార్‌ను ఆటాడుకున్న ఆమిర్ ఖాన్

Also Read :సిగ్గు లేకుండా వెళ్ళి తులసిని బతిమలాడుకోమంటున్న లాస్య- శ్రుతి కోసం కౌసల్యకి ఫోన్ చేసిన తులసికి ప్రేమ్ విషయం తెలిసిపోతుందా?

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్లలో అల్లాడించిన ఆపిల్! అపూర్వని వాయించేశారుగా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్లలో అల్లాడించిన ఆపిల్! అపూర్వని వాయించేశారుగా!
Jagadhatri Serial Today October 5: రాగిణిని బెదిరించి సాక్ష్యాలు తీసుకోవాలని యువరాజు ప్రయత్నం..నిషికకు గట్టిగా బుద్ధి చెప్పిన ధాత్రి
జగద్ధాత్రి సీరియల్: రాగిణిని బెదిరించి సాక్ష్యాలు తీసుకోవాలని యువరాజు ప్రయత్నం..నిషికకు గట్టిగా బుద్ధి చెప్పిన ధాత్రి
Jailer 2 Trailer : యాక్షన్ అదిరింది తలైవా - అవెయిటెడ్ జైలర్ 2 ట్రైలర్ వచ్చేసింది
యాక్షన్ అదిరింది తలైవా - అవెయిటెడ్ జైలర్ 2 ట్రైలర్ వచ్చేసింది
Bigg Boss Season 10 Today Promo 2: బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: త్రిగుణ్ అంత పెద్ద మాట అనేశాడేంటి? రోహిత్‌, వర్షిణిల గొడవలే రేగిపోయిన త్రిగుణ్!
బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: త్రిగుణ్ అంత పెద్ద మాట అనేశాడేంటి? రోహిత్‌, వర్షిణిల గొడవలే రేగిపోయిన త్రిగుణ్!

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
CM Chandrababu: వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
Medicine Nobel Prize: మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Kiran Abbavaram Reality : కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Toyota Cheapest Car: టయోటా అతి తక్కువ ధర కారు ఇదే! రూ.6.73 లక్షలే.. ఫీచర్లు మాత్రం అదుర్స్!
6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా ఉన్నా కూడా ధర తక్కువే!.. టయోటా చీపెస్ట్ కార్ ఇదే!
Sivakarthikeyan : నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
Embed widget