Nirupam Paritala Actor Property: డాక్టర్ బాబు ఆస్తుల విలువెంతో తెలుసా..?
బుల్లితెరపై నెంబర్ వన్ స్టార్ గా దూసుకుపోతున్న ఈ నటుడికి ఎంత ఆస్తి కూడబెట్టాడనే విషయంలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
నిరుపమ్ పరిటాల అంటే ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ డాక్టర్ బాబు అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. అంతగా తన పాత్రతో ప్రభావం చూపగలిగాడు. 'కార్తీకదీపం' సీరియల్ లో హీరోగా నటిస్తోన్న నిరుపమ్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ సీరియల్ లో వంటలక్క తరువాత ప్రేక్షకులు అభిమానించే రోల్ డాక్టర్ బాబుదే. ఇక నిరుపమ్ విషయానికొస్తే.. దివంగత నటుడు, రచయిత ఓంకార్ గారి తనయుడే ఈ బుల్లితెర స్టార్.
వీరి ఫ్యామిలీ చెన్నైలో ఉన్నప్పుడే నిరుపమ్ నటుడిగా మారాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఇంట్లో వాళ్లు మాత్రం చదువు పూర్తి చేసి, ఉద్యోగం చేయమని చెప్పారట. కానీ నిరుపమ్ మాత్రం నటుడిగా మారాలని నిర్ణయించుకోవడంతో ఫ్యామిలీ హైదరాబాద్ కు షిఫ్ట్ అయింది. అదే సమయంలో ఓంకార్ గారు మరణించడంతో నిరుపమ్ కి ఏం చేయాలో అర్ధం కాలేదు. ముందుగా సినిమాల్లో నటించాలనుకున్నాడు కానీ సీరియల్ అవకాశం వచ్చింది.
గతంలో నిరుపమ్ తండ్రి ఓంకార్ 'ఇది కథ కాదు', 'పవిత్ర బంధం' వంటి సీరియల్స్ లో నటించారు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని నిరుపమ్ కూడా సీరియల్స్ లో సత్తా చాటాడు. వరుస సీరియల్స్ ఒప్పుకుంటూ నటుడిగా చాలా బిజీగా మారాడు. మధ్యలో ఒకట్రెండు సినిమా అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారాయని గతంలో నిరుపమ్ చెప్పాడు. కానీ ఎప్పటికైనా వెండితెరపై కనిపించాలని కోరిక అని చెబుతుంటారు.
బుల్లితెరపై నెంబర్ వన్ స్టార్ గా దూసుకుపోతున్న ఈ నటుడికి ఎంత ఆస్తి కూడబెట్టాడనే విషయంలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 'కార్తీకదీపం' సీరియల్ కు గాను.. నిరుపమ్ రోజుకి పాతిక వేల నుండి నలభై వేల వరకు రెమ్యునరేషన్ గా తీసుకుంటాడట. ఈ సీరియల్ తో పాటు ఆయన మరో రెండు, మూడు సీరియల్స్ లో నటిస్తున్నాడు. వాటికి ఎంత ఛార్జ్ చేస్తారనే విషయంలో స్పష్టత లేదు.
ఇక ఆస్తుల విషయానికొస్తే.. నిరుపమ్ కి వైజాగ్ లో రూ.5 కోట్ల విలువైన ప్రాపర్టీ ఉందని సమాచారం. అలానే హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో భువన అపార్ట్మెంట్స్ లో రూ.80 లక్షలు విలువ చేసే ఖరీదైన ఫ్లాట్ ఉంది. వీటితో పాటు రూ.11 లక్షల విలువ గల కారు కూడా ఉంది. నిరుపమ్ భార్య మంజుల కూడా సీరియల్స్ లో నటిస్తూ ఉంటుంది. ఆమె కూడా బాగానే ఆస్తులు సంపాదించిందని టాక్. వీరిద్దరికీ ఓ కొడుకు ఉన్నాడు. మంజుల తరచూ తన ఫ్యామిలీతో కలిసి తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.
Also Read : నెట్ ఫ్లిక్స్ లో వంటలక్క.. ఈ మీమ్స్ చూసేయండి ఎంచక్కా!