Dasara Movie: నాని సినిమాలో లేడీ విలన్ - పవర్ఫుల్ క్యారెక్టర్ లో పూర్ణ
పూర్ణ తన కెరీర్ లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసింది. కానీ టాప్ హీరోయిన్ రేంజ్ కి రీచ్ అవ్వలేకపోయింది.
నేచురల్ స్టార్ నాని ఇటీవల 'అంటే సుందరానికి' సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పెద్దగా వర్కవుట్ కాలేదు. కానీ ఓటీటీలో మాత్రం ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ హీరో 'దసరా' అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించనుంది.
గోదావరిఖని బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో నాని రగ్డ్ లుక్ లో కనిపించబోతున్నారు. తొలిసారి ఈ సినిమాలో తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పబోతున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ బయటకొచ్చింది. ఇందులో మలయాళ ముద్దుగుమ్మ పూర్ణ పూర్తి స్థాయి విలన్ రోల్ లో కనిపించబోతుందట. ఇప్పటికే ఆమె సెట్స్ లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది.
పూర్ణ తన కెరీర్ లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసింది. కానీ టాప్ హీరోయిన్ రేంజ్ కి రీచ్ అవ్వలేకపోయింది. ప్రస్తుతం ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు, టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు ఆమెని విలన్ గా చూపించడానికి రెడీ అవుతున్నారు. 'దసరా'లో మెయిన్ విలన్ కానప్పటికీ పూర్ణ రోల్ మాత్రం చాలా క్రూయల్ గా ఉంటుందని చెబుతున్నారు.
ఇక ఈ సినిమాలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహబ్ లాంటి తారలు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. నాని నటించిన తొలి పాన్ ఇండియా చిత్రంగా రాబోతుంది. ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించనున్నారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్, నవీన్ నూలి ఎడిటర్.
Also Read : 'ఆర్ఆర్ఆర్'లో పులితో ఎన్టీఆర్ ఫైట్ - వీఎఫ్ఎక్స్‌కు ముందు, తర్వాత
Also Read : అది పాస్తా వల్ల వచ్చిన కడుపు, ప్రెగ్నన్సీ కాదు - రూమర్లకు చెక్ పెట్టిన కరీనా కపూర్
View this post on Instagram