Brahmanandam: డబ్బింగ్ స్టేజ్‍లో 'రంగమార్తాండ' - బ్రహ్మీ స్టయిలే వేరు!
కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగమార్తాండ' సినిమా డబ్బింగ్ పనులు మొదలుపెట్టారు బ్రహ్మీ.
ఎన్నో దశాబ్దాలుగా టాలీవుడ్ లో తిరుగులేని కమెడియన్ గా దూసుకుపోతున్నారు బ్రహ్మానందం. ఆయనకు పోటీగా చాలా మంది కమెడియన్స్ పుట్టుకొచ్చారు. కానీ బ్రహ్మీను ఎవరూ బీట్ చేయలేకపోయారు. సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత బ్రహ్మీ పాపులారిటీ మరింత పెరిగింది. ఆయన ఎక్స్ ప్రెషన్స్ మీద లక్షల మీమ్స్ ను క్రియేట్ చేశారు. అయితే కొన్నేళ్లుగా బ్రహ్మీ సినిమాలు చేయడం బాగా తగ్గించారు. ఇప్పట్లో మళ్లీ ఆయన్ను సినిమాల్లో చూడలేమేమో అనే పరిస్థితి వచ్చింది.
ఈ మధ్యకాలంలో మళ్లీ ఆయన సినిమాలు చేయడం మొదలుపెట్టారు. ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్స్ కాకపోయినా.. కొన్ని సినిమాలు చేస్తున్నారు. తాజాగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగమార్తాండ' సినిమా డబ్బింగ్ పనులు మొదలుపెట్టారు బ్రహ్మీ. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో అందరినీ ఆకర్షిస్తున్నాయి.
Brahmi Style Of Dubbing: మాములుగా అయితే అందరూ నిలబడి డబ్బింగ్ చెబుతుంటారు. కొందరు తమ కంఫర్ట్ ను బట్టి చైర్ లో కూర్చొని చెబుతారు. బ్రహ్మానందం కూడా చక్కగా కుర్చీలో కూర్చొని.. కాళ్లు మడిచి ఫన్నీ గెటప్ లో డబ్బింగ్ చెబుతూ కనిపించారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు.. డబ్బింగ్ ఇలా కూడా చెప్పొచ్చా..? బ్రహ్మీ స్టయిలే వేరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక 'రంగమార్తాండ' విషయానికొస్తే.. మరాఠీలో విడుదలైన 'నట సామ్రాట్' సినిమాకి ఇది రీమేక్. సాధారణంగా అయితే దర్శకుడు కృష్ణవంశీ రీమేక్ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపరు. సొంత కథలతోనే సినిమాలను రూపొందిస్తారు. కానీ 'నట సామ్రాట్' సినిమాను చూసిన ఆయన రీమేక్ చేయాలని ఫిక్సయిపోయారు. అంతగా అతడిని కదిలించిన సినిమా అది.
చాలా కాలంగా ఫ్లాప్ లతో డీలా పడ్డ వంశీ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు. 'నట సామ్రాట్' సినిమాలో నానా పటేకర్ ప్రధాన పాత్ర పోషించారు. ఆయన పాత్రను తెలుగులో ప్రకాష్ రాజ్ పోషిస్తున్నారు. అలానే సినిమాలో మరో ముఖ్య పాత్ర ఒకటి ఉంటుంది. నానా పటేకర్ స్నేహితుడిగా మరాఠీలో విక్రమ్ గోఖలే నటించారు. సీరియస్ గా ఎమోషనల్ గా సాగే ఆ పాత్ర కోసం బ్రహ్మానందాన్ని తీసుకున్నారు.
నిజానికి ఈపాటికే సినిమా రిలీజ్ కావాల్సింది కానీ ఆలస్యం జరుగుతోంది. ఆగస్టులో సినిమా కచ్చితంగా రిలీజ్ అవుతుందన్నారు. కానీ అలా జరగలేదు. దీపావళిని టార్గెట్ చేసినట్లు వార్తలొచ్చాయి. అందులో కూడా నిజం లేదు. మరెప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. ఈ సినిమాకి ఓటీటీ నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. కానీ థియేటర్లోనే విడుదల చేయాలని భావిస్తున్నారు దర్శకుడు కృష్ణవంశీ. ఇక ఈ సినిమాకి ఇళయరాజా సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ సినిమాకి సంబంధించిన ఇప్పటివరకు ఒక్క పోస్టర్ కానీ, టీజర్ కానీ రిలీజ్ కాలేదు. అయినప్పటికీ ఈ రేంజ్ బజ్ రావడమంటే విశేషమనే చెప్పాలి.
Also Read: ‘కాంతార’ సినిమా చూస్తూ ప్రేక్షకుడు మృతి
View this post on Instagram