News
News
X

Kantara Movie: ‘కాంతార’ సినిమా చూస్తూ ప్రేక్షకుడు మృతి

కన్నడ సినిమా ‘కాంతార’ సైలెంట్ గా విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ సినిమా రూ. 200 కోట్ల క్లబ్బులో చేరబోతుంది. ఈ నేపథ్యంలో ఓ కన్నడ ప్రేక్షకుడు ‘కాంతార’ చూస్తూ థియేటర్ లోనే చనిపోయాడు.

FOLLOW US: 

న్నడ సినిమా 'కాంతార'(Kantara)కు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.  తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఓ రేంజిలో వసూళ్లు రాబడుతోంది. కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి నటించి, తెరకెక్కించి ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. కన్నడ నాట రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తెలుగుతో పాటు హిందీలోనూ మంచి కలెక్షన్లు వసూలు చేసింది. ఓవర్సీస్ లోనూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. మొత్తంగా ఈ సినిమా రూ. 200 కోట్లు వసూలు చేసే దిశగా దూసుకెళ్తోంది.

'KGF' వంటి పాన్ ఇండియా హిట్ చిత్రాన్నినిర్మించిన విజయ్ కిరగందూర్ 'కాంతార' చిత్రాన్ని నిర్మించారు. మరోసారి ఆయన పాన్ ఇండియా స్థాయిలో విజయం అందుకున్నారు. 'కాంతార' (Kantara Movie)లో కథానాయకుడిగా నటించిన రిషబ్ శెట్టి, సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. ఆయన నటనకు, దర్శకత్వానికి తెలుగులో కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు ఆయనను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. కర్నాటక కల్చర్ ను చక్కగా చూపించాడు రిషబ్. భూతకోలా సంప్రదాయం గురించి సినిమాలో చూపించిన విధానం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.

త్వరలో ‘కాంతార’ సీక్వెల్!

'కాంతార' (Kantara) సాధించిన విజయంతో దీనికి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ చేసే అంశాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే సీక్వెల్ పై రిషబ్ శెట్టి స్పందించాడు కూడా. సీక్వెల్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయని ఆయన వెల్లడించాడు. అయితే, తను మరో సినిమా చేయడానికి ముందు రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోబోతున్నట్లు చెప్పాడు. కుటుంబంతో కలిసి ఈ సమాయాన్ని గడపనున్నట్లు వివరించాడు.  ఆయన మాటలు బట్టి చూస్తే తప్పకుండా ‘కాంతారా’ సీక్వెల్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. ‘కేజీఎఫ్’ బ్లాక్ బస్టర్ కావడంతో ఆ సినిమాకు సీక్వెల్ నిర్మించాడు విజయ్ కిరగందూర్. ఇప్పుడు ‘కాంతారా’ మంచి విజయాన్ని అందుకోవడంతో దానికి కూడా సీక్వెల్ తీస్తాడని సినీ పండితులు అంటున్నారు.

‘కాంతార’ సినిమా చూస్తూ వ్యక్తి మృతి

తాజాగా ‘కాంతారా’ సినిమా చూస్తూ ఓ కన్నడ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కర్నాటకకు చెందిన 45 ఏండ్ల రాజశేఖర్ అనే వ్యక్తి ఈ సినిమా చూసేందుకు థియేటర్ కు వెళ్లాడు. సినిమా చూస్తూ, చూస్తూనే కుప్పకూలిపోయాడు. వెంటనే థియేటర్ యాజమాన్యం స్పందించి అతడిని హాస్పిటల్ కు తరలించింది. హాస్పిటల్ కు వెళ్లగానే పరిశీలించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు ధృవీకరించారు. గుండెపోటు వల్లే రాజశేఖర్ చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన కన్నడ సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ కన్నడ మూవీని తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద అల్లు అరవింద్ అక్టోబర్ 15న రిలీజ్ చేశారు. ఈ చిత్రంలోని ఉత్కంఠభరిత సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. అందుకే, ఆ సినిమాకు అంత పాజిటివ్ టాక్ వస్తోంది. అయితే, చనిపోయిన వ్యక్తి ఆ సన్నివేశాలను చూస్తూ చనిపోయాడా? లేదా ఇదివరకే అతడికి గుండె సమస్యలు ఉన్నాయా? అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

News Reels

Also read: కన్నింగ్ ఆటతో గెలుద్దామని ప్లానేసి ఓడిపోయిన గీతూ,వెక్కి వెక్కి ఏడుపు- చేపల టాస్కు అదిరిపోయింది

Published at : 26 Oct 2022 01:34 PM (IST) Tags: karnataka Kantara Movie Rishab Shetty Man dead

సంబంధిత కథనాలు

YS Jagan: అలీ కూతురు మ్యారేజ్ రిసెప్షన్‌ - నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్‌

YS Jagan: అలీ కూతురు మ్యారేజ్ రిసెప్షన్‌ - నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్‌

Ram Gopal Varma Tweet పుట్టినరోజు ఆయనదైతే నాకు దండేశారేంటి : వైరల్ అవుతోన్న ఆర్జీవి ట్వీట్

Ram Gopal Varma Tweet పుట్టినరోజు ఆయనదైతే నాకు దండేశారేంటి : వైరల్ అవుతోన్న ఆర్జీవి ట్వీట్

Bigg Boss 6 Telugu: ఇనయాతో శ్రీహాన్ రొమాన్స్, శ్రీసత్యకు ఊహించని షాక్ - టాస్క్ ఇలా కూడా ఆడొచ్చా?

Bigg Boss 6 Telugu: ఇనయాతో శ్రీహాన్ రొమాన్స్, శ్రీసత్యకు ఊహించని షాక్ - టాస్క్ ఇలా కూడా ఆడొచ్చా?

Dejavu - Repeat : 'రిపీట్' రిలీజుకు ముందు 'డెజావు' సక్సెస్ - ప్రైమ్‌లో పెరిగిన క్లిక్స్

Dejavu - Repeat  : 'రిపీట్' రిలీజుకు ముందు 'డెజావు' సక్సెస్ - ప్రైమ్‌లో పెరిగిన క్లిక్స్

Ram Charan NTR : ఎన్టీఆర్, చరణ్ మధ్య నో గొడవ, నథింగ్ - ముందే అంతా మాట్లాడుకుని

Ram Charan NTR : ఎన్టీఆర్, చరణ్ మధ్య నో గొడవ, నథింగ్ - ముందే అంతా మాట్లాడుకుని

టాప్ స్టోరీస్

Bandi Sanjay : భైంసా పేరు మహిషాగా మారుస్తాం, పీడీయాక్ట్ లు ఎత్తేసి ఉద్యోగాలిస్తాం - బండి సంజయ్

Bandi Sanjay :  భైంసా పేరు మహిషాగా మారుస్తాం, పీడీయాక్ట్ లు ఎత్తేసి ఉద్యోగాలిస్తాం - బండి సంజయ్

Ys Vijayamma Comments : ఆ రాష్ట్రంతో మనకేంటి ? - ఏపీ గురించి వైఎస్ విజయమ్మ సంచలన కామెంట్స్ !

Ys Vijayamma Comments : ఆ రాష్ట్రంతో మనకేంటి ? - ఏపీ గురించి వైఎస్ విజయమ్మ  సంచలన కామెంట్స్ !

Tirumala Update: భక్తులకు టీటీడీ అలర్ట్ - డిసెంబర్ 1 నుంచి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

Tirumala Update: భక్తులకు టీటీడీ అలర్ట్ - డిసెంబర్ 1 నుంచి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు