News
News
X

3 roses: రియల్‌‌లైఫ్‌‌లో బాయ్‌‌ఫ్రెండ్‌‌తో రీల్ లైఫ్ కోసం రొమాన్స్

‘3 రోజెస్’ వెబ్ సిరీస్‌‌లో పాయల్ రాజ్‌‌పుత్, సౌరభ్ ధింగ్రా జంటగా నటించారు. రియల్ లైఫ్‌‌లో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోనున్న సంగతి తెలిసిందే.

FOLLOW US: 
 
ఫిల్మ్ ఇండస్ట్రీకి వారసులు రావడం కామన్! బట్, ఫర్ ఏ ఛేంజ్... ఓ బాయ్‌‌ఫ్రెండ్ వస్తున్నాడు. ‘ఆర్‌‌ఎక్స్‌‌ 100’తో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పాయల్ రాజ్‌‌పుత్ హీరోయిన్‌‌గా ఇంట్రడ్యూస్ అయ్యారు. అంతకు ముందు పంజాబీలో సినిమాలు చేశారు. హిందీ సీరియళ్లలో నటించారు. అయితే, అక్కడ రాని గుర్తింపు... తెలుగులో ఒక్క సినిమాతో వచ్చింది. ‘ఆర్ఎక్స్ 100’ విడుదలైన తర్వాత పాయల్ రాజ్‌‌పుత్‌‌కు ఓవర్ నైట్‌‌లో స్టార్‌‌డమ్ వచ్చింది. అక్కడ నుంచి తెలుగులో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పడు తన బాయ్‌‌ఫ్రెండ్‌ను ఇండస్ట్రీకి తీసుకొస్తున్నారు.

Also Read: అక్కినేని ఫ్యామిలీ ఫ్రెండ్‌తో... సమంత ఆధ్యాత్మిక యాత్ర

పాయల్ రాజ్‌‌పుత్ సోషల్ మీడియా ఖాతాలను రెగ్యులర్‌‌గా ఫాలో అయ్యేవాళ్లకు సౌరభ్ ధింగ్రా తెలిసే ఉంటారు. మొదట్లో అతడు తన ఫ్రెండ్ మాత్రమే అని పాయల్ చెప్పేవారు. సౌరభ్ తల్లి మరణించిన తర్వత... సౌరభ్, తాను పెళ్లి చేసుకుంటే చూడాలని అతడి తల్లి కోరుకున్నారని, ఆ కోరిక తీరకుండా మరణించారని పాయల్ ఆవేదన చెందారు. సౌరభ్‌‌ను తాను పెళ్లి చేసుకోనున్నట్టు తెలిపారు. ఇప్పడు అతడిని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి తీసుకొస్తున్నారు. 

‘ఆహా’ ఓటీటీ కోసం దర్శకుడు మారుతి ఆధ్వర్యంలో రూపొందిన వెబ్ సిరీస్ ‘3 రోజెస్’. దీనికి మ్యాగీ దర్శకత్వం వహించారు. ఎస్.కె.ఎన్ నిర్మించారు. పాయల్ రాజ్‌‌పుత్, ఈషా రెబ్బా, పూర్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. త్వరలో రిలీజ్ కానుంది. ఈ వెబ్ సిరీస్‌‌లో రియల్ లైఫ్‌‌లో బాయ్‌‌ఫ్రెండ్ అయినటువంటి సౌరభ్ ధింగ్రాకు పాయల్ రాజ్‌‌పుత్ జంటగా నటించారు. తామిద్దరి మధ్య రొమాంటిక్ సీన్ ఉందని ఆమె తెలిపారు. ‘3 రోజెస్’ దర్శక నిర్మాతలే తనను సౌరభ్ నటిస్తాడా? అని అడిగారని, సంతోషంగా యాక్సెప్ట్ చేశానని పాయల్ చెప్పుకొచ్చారు. రీసెంట్‌‌గా వీళ్లిద్దరూ ఓ మ్యూజిక్ వీడియోలో కూడా నటించారు. పాయల్ నిదానంగా తన జీవిత భాగస్వామిని సైతం సినిమాల్లో సెటిల్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారమ్మాట. వారసులు వచ్చే ఇండస్ట్రీకి ఓ హీరోయిన్ తన బాయ్‌‌ఫ్రెండ్‌‌ను తీసుకురావడం విశేషమే.

News Reels

Also Read: 'భీమ్లా నాయక్' కొత్త స్టిల్.. పవన్, రానా పోజు చూశారా..?

Also Read: ‘లైగర్’ హీరోయిన్ ఇంట్లో NCB సోదాలు.. ఎవరీ అనన్యా పాండే? ఈమె ఎవరి కూతురు?

Also Read: బిగ్ బాస్ హౌస్ లోకి లోబో రీ-ఎంట్రీ ..యదవనయ్యా అన్న షణ్ముక్-కన్నీళ్లు పెట్టుకున్న సిరి…!

Also Read: అనారోగ్యం వల్ల కొద్దిసేపే చూస్తానన్న ఉప రాష్ట్రపతి ..సినిమా మొత్తం అయ్యేవరకూ కదల్లేదట

Also Read: ‘నాట్యం’ హీరోయిన్ సంధ్యా రాజు ఎవరి కూతురో తెలుసా?

Also Read: తమన్నా ఔట్-అనసూయ ఇన్..హాట్ యాంకర్ అంతకుమించి అనిపిస్తుందా..!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at : 21 Oct 2021 06:04 PM (IST) Tags: Payal rajput Payal Rajput boy friend aha app 3 roses web series 3 roses

సంబంధిత కథనాలు

SDT 15 Title : కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్లనున్న సాయి తేజ్ - థ్రిల్లర్ వరల్డ్ టైటిల్ రెడీ 

SDT 15 Title : కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్లనున్న సాయి తేజ్ - థ్రిల్లర్ వరల్డ్ టైటిల్ రెడీ 

Varisu Second Single : విజయ్ 'వారసుడు' సాంగ్ వచ్చేసింది - డ్యాన్స్ ఇరగదీసిన శింబు

Varisu Second Single : విజయ్ 'వారసుడు' సాంగ్ వచ్చేసింది - డ్యాన్స్ ఇరగదీసిన శింబు

Baba New Trailer: రజినీకాంత్ ‘బాబా’ మూవీ రి-రిలీజ్, కొత్త ట్రైలర్ చూశారా?

Baba New Trailer: రజినీకాంత్ ‘బాబా’ మూవీ రి-రిలీజ్, కొత్త ట్రైలర్ చూశారా?

Keerthy Suresh New Movie : కీర్తి సురేష్‌తో 'కేజీఎఫ్', 'కాంతార' నిర్మాత సినిమా - 'రఘు తాత'

Keerthy Suresh New Movie : కీర్తి సురేష్‌తో 'కేజీఎఫ్', 'కాంతార' నిర్మాత సినిమా - 'రఘు తాత'

Pawan Kalyan Next Movie : పవన్‌తో హరీష్ శంకర్ సినిమా ఆగలేదు - వచ్చే వారమే పూజ, సంక్రాంతి తర్వాత

Pawan Kalyan Next Movie : పవన్‌తో హరీష్ శంకర్ సినిమా ఆగలేదు - వచ్చే వారమే పూజ, సంక్రాంతి తర్వాత

టాప్ స్టోరీస్

Minister Jogi Ramesh: చంద్రబాబు, లోకేష్ కూడా జైలుకి పోవటం ఖాయం: మంత్రి జోగి రమేష్

Minister Jogi Ramesh: చంద్రబాబు, లోకేష్ కూడా జైలుకి పోవటం ఖాయం: మంత్రి జోగి రమేష్

పాతికేళ్ల కిందటే రాజమండ్రి నుంచి సికింద్రాబాద్ కు వందే భారత్ ఎక్స్ ప్రెస్ !

పాతికేళ్ల కిందటే రాజమండ్రి నుంచి సికింద్రాబాద్ కు వందే భారత్ ఎక్స్ ప్రెస్ !

YS Sharmila: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ గూండాల నుంచి ప్రాణహాని ఉందంటూ షర్మిల సంచలన ఆరోపణలు

YS Sharmila: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ గూండాల నుంచి ప్రాణహాని ఉందంటూ షర్మిల సంచలన ఆరోపణలు

Hyderabad Trail Fest: ప్రపంచంలోనే అతిపెద్ద మియావాకీ అడవిలో దివ్యాంగుల ట్రయల్ ఫెస్ట్

Hyderabad Trail Fest: ప్రపంచంలోనే అతిపెద్ద మియావాకీ అడవిలో దివ్యాంగుల ట్రయల్ ఫెస్ట్