Pawan Kalyan: పవన్ కళ్యాణ్ 'ఓజీ' గురించి తమన్ క్రేజీ అప్డేట్
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్. ఆయన హీరోగా రూపొందుతున్న 'ఓజీ' గురించి తమన్ ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. అది ఏమిటో చూడండి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్. ప్రజెంట్ పాలిటిక్స్ మీద ఆయన ఫుల్ కాన్సంట్రేట్ చేశారు. అందువల్ల, షూటింగులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఆయన షూటింగ్ చేయడం లేదు గానీ... ఆయనతో సినిమాలు చేస్తున్న దర్శక నిర్మాతలు సినిమా మీద వర్క్ చేయడం ఆపలేదు. పవన్ నటిస్తున్న క్రేజీ సినిమాల్లో 'ఓజీ' ఒకటి. దీని గురించి సంగీత దర్శకుడు తమన్ ఓ అప్డేట్ ఇచ్చారు. అది ఏమిటంటే?
'ఓజీ'లో ఓ పాటను పవన్ కళ్యాణ్ పాడితే?
పవన్ కళ్యాణ్ స్టార్ హీరో. ఆయన హీరో మాత్రమే కాదు... ఆయనలో ఓ సింగర్ కూడా ఉన్నారు. ఆయనతో పాట పాడించాలని తమన్ ప్లాన్ చేస్తున్నారు. 'సాహో' ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమా 'ఓజీ'. ఆ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ''ఓజీ' స్క్రిప్ట్ లో పవన్ గారి చేత పాడించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మేం ఆ అవకాశాలను పరిశీలిస్తున్నాం'' అని చెప్పారు.
పవన్ కళ్యాణ్ గనుక ఓకే అంటే... 'ఓజీ'లో ఆయన పాటను మనం వినొచ్చు. ఈ సినిమా కోసం ఆల్రెడీ తమన్ కొన్ని ట్యూన్స్ ఇచ్చారు. అందులో ఓ పాటను పుణెలో షూటింగ్ కూడా చేశారు. 'ఓజీ'లో పవన్ సరసన యంగ్ హీరోయిన్ ప్రియాంకా అరుల్ మోహన్ నటిస్తున్నారు. వాళ్లిద్దరిపై ఆ పాట తీశారు.
Also Read: కనుమ రోజూ కింగ్ జోరు - మూడు రోజుల్లో 'నా సామి రంగ' కలెక్షన్స్ ఎంతంటే?
ఇంతకు ముందు 'తమ్ముడు' సినిమాలో 'ఏం పిల్ల మాటాడవా' పాటతో మొదలు పెడితే... అందులోనే 'తాటి చెట్టు' నుంచి 'ఖుషి' సినిమాలో 'బై బయ్యే బంగారు రవణమ్మ...', 'జానీ' సినిమాలో 'నువ్వు సారా తాగకు', 'రావోయి మా ఇంటికి', 'పంజా'లో 'పాపారాయుడు', 'అత్తారింటికి దారేది'లో 'కామటరాయుడు', 'అజ్ఞాతవాసి' సినిమాలో 'కొడకా కోటేశ్వర్ రావు' పాటలు పాడారు.
Also Read: కంగువా కథలో ట్విస్ట్ - సెకండ్ లుక్‌తో కాన్సెప్ట్ రివీల్ చేశారుగా
'ఓజీ' సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శ్రీమతి పార్వతి సమర్పణలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' తర్వాత ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. ఇటీవల ఈ సినిమాను వేరొక నిర్మాణ సంస్థకు ఇచ్చేస్తున్నట్లు వార్తలు రాగా... వాటిని ఆయన ఖండించారు. 'ఓజీ'లో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేస్తున్నారు. ఇంకా ప్రకాష్ రాజ్, వెంకట్, హరీష్ ఉత్తమన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
అంచనాలు పెంచిన 'హంగ్రీ చీతా
'ఆల్రెడీ విడుదలైన సినిమా వీడియో గ్లింప్స్ అభిమానులకు విపరీతంగా నచ్చింది. 'హంగ్రీ చీతా'కు తమన్ ఎక్స్ట్రాడినరీ ట్యూన్ ఇచ్చారు. అంతకు ముందు షూటింగ్ మొదలైన సందర్భంగా మరో వీడియో విడుదల చేశారు. ఆ రెండు అంచనాలు సినిమాపై పెంచాయి. మొదటి వీడియోలో క్లైమాక్స్ గురించి సుజీత్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. నోటితో నేరుగా ఏదీ చెప్పలేదు. కానీ, వీడియో మీద ఓ లుక్ వేస్తే... క్లైమాక్స్ కోసం చాలా డ్రాఫ్ట్స్ రాసినట్టు ఈజీగా అర్థమైంది. 'క్లైమాక్స్ 15' అని రాసి, చివరకు దాన్ని చెత్తబుట్టలో పడేశారు. అంటే... 15 సార్లు క్లైమాక్స్ చేంజ్ చేశారన్నమాట. చివరకు, 16వ క్లైమాక్స్ ఓకే చేసినట్టు తెలుస్తోంది.