BheemlaNayak: పవన్ సినిమా రన్ టైం ఎంతో తెలుసా..?
'భీమ్లానాయక్' సినిమా లెంగ్త్ 130 నిమిషాలని తెలుస్తోంది. మొదట 2 గంటల 20 నిమిషాల వరకు ఫస్ట్ కాపీ వచ్చిందట.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'భీమ్లానాయక్'. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే-మాటలు అందిస్తున్నారు. నిజానికి ఈ సినిమా సంక్రాంతికి రావాల్సింది కానీ 'ఆర్ఆర్ఆర్' కోసం వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ ఫిబ్రవరి 25న అని అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఆరోజున కూడా సినిమా వచ్చే ఛాన్స్ లేదు. రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. చాలా చోట్లా కర్ఫ్యూలు పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా రాదనే అంటున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాకి సంబంధించిన ఓ విషయం బయటకొచ్చింది. అందుతున్న సమాచారం ప్రకారం.. 'భీమ్లానాయక్' లెంగ్త్ 130 నిమిషాలని తెలుస్తోంది. మొదట 2 గంటల 20 నిమిషాల వరకు ఫస్ట్ కాపీ వచ్చిందట. కానీ ఇలాంటి ఎమోషనల్ డ్రామా రేసీ స్క్రీన్ ప్లేతో ఉంటేనే కరెక్ట్ అని భావించి మరో పది నిమిషాల సన్నివేశాలను ఎడిట్ చేశారట. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు స్క్రీన్ ప్లే ఓ రేంజ్ లో ఉంటుందని చెబుతున్నారు.
మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' సినిమాకి రీమేక్ గా 'భీమ్లానాయక్' సినిమాను తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఇప్పటికే సినిమాలో పవన్ కళ్యాణ్, రానా క్యారెక్టర్లు ఎలా ఉండబోతున్నాయనే విషయాలను టీజర్ ద్వారా చెప్పకనే చెప్పారు. ఇప్పటివరకు విడుదలైన పాటలు యూట్యూబ్ లో ట్రెండ్ అయ్యాయి. త్వరలోనే ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు.
View this post on Instagram
Also Read: గ్లామర్ షో ఓకే కానీ.. ఛాన్స్ లు దొరుకుతాయా..?
Also Read: అల్లు అర్జున్, యష్ లకు కంగనా సలహా.. బాలీవుడ్ వలలో పడొద్దంటూ రిక్వెస్ట్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి