Pawan Kalyan: డాగ్ స్క్వాడ్‌తో పవర్ స్టార్ ఆటలు, నెట్టింట్లో వీడియో వైరల్
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా తన ఇన్ స్టాలో పోస్టు చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇందులో ఆయన ఓ డాగ్ స్క్వాడ్ తో ఆటలాడుతూ కనిపించారు.
Pawan Kalyan Instagram Video: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ వైపు సినిమాలతో, మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, బీజేపీ అభ్యర్థలు తరఫున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూనే, ఏపీలో రాబోయే శాసనసభ ఎన్నికలకు రెడీ అవుతున్నారు. మరోవైపు వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. రాజకీయ సంబంధ విషయాలను ఆయన ట్విట్టర్ వేదికగా ప్రస్తావిస్తుంటారు. విమర్శలు, ప్రతి విమర్శలు అన్నీ ట్విట్టర్ నుంచే కొనసాగుతాయి. కొద్ది నెలల క్రితం ఇన్ స్టాలోకి పవన్ అడుగు పెట్టారు. ఇందులో పెద్దగా పోస్టులు పెట్టకపోయినప్పటికీ 2.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
డాగ్ స్క్వాడ్ బిందుతో పవన్ ఆటలు
ఎప్పుడూ రాజకీయాల గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే పవన్ కల్యాణ్ తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేశారు. ఇందులో ఓ కుక్కతో ఆయన సరదాగా గడుపుతూ కనిపించారు. బేగంపేట ఎయిర్ పోర్టులో ఆయన ఈ డాగ్ తో ఆడుకున్నారు. నిజానికి ఆ డాగ్ పవన్ కల్యాణ్ ది కాదు. పోలీసు డాగ్ స్క్వాడ్. తాజాగా పవన్ కల్యాణ్ ఫ్లైట్ ఎక్కేందుకు బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లారు. అక్కడే తనకు పోలీస్ డాగ్ స్క్వాడ్ బిందు కలిసినట్లు చెప్పారు. “నేను బేగంపేట ఎయిర్ పోర్ట్ లో ఫ్లైట్ ఎక్కేందుకు వెళ్లాను. విమానం కోసం ఎదురు చూస్తుండగా నా దగ్గరికి ఓ సర్ ప్రైజ్ విజిటర్ వచ్చింది. అది ఎవరో కాదు పోలీస్ డాగ్ స్క్వాడ్ బిందు. నాతో చాలా ఫ్రెండ్లీగా ఆడుకుంది. తోకని ఆడిస్తూ నా చూట్టూనే తిరిగింది. నాతో కాసేపు సరదాగా గడిపింది. నేను విమానం ఎక్కేముందు చక్కటి అనుభూతిని కలిగించింది" అంటూ తన ఇన్ స్టాలో రాసుకొచ్చారు పవన్. పవన్ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసి ఆయన అభిమానులతో పాటు, నెటిజన్స్ ఖుషీ అవుతున్నారు. ఇద్దరూ భలే ఆడుకుంటున్నారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
View this post on Instagram
సినిమా షూటింగులకు బ్రేక్!
ప్రస్తుతం పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘OG’, ‘హరిహర వీరమల్లు’ సినిమాల్లో నటిస్తున్నారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కొంత షూట్ కంప్లీట్ చేసుకుంది. రీసెంట్ గా మరో షెడ్యూల్ మొదలు అయ్యింది. పవన్ రాజకీయ పర్యటనల కారణంగా ఆ షెడ్యూల్ పోస్ట్ పోన్ అయ్యింది. దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇద్దరి కాంబోలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ సినిమా వస్తుండటంతో భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే, షూటింగ్ ఇప్పటికే చాలాసార్లు పోస్టుపోన్ కావడం పట్ల అభిమానులు నిరాశగా ఉన్నారు. ఎన్నికల సమయం కావడంతో ఆయన సినిమాలకంటే రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన సినిమా షూటింగులు నిలిచిపోయాయి. ఎలక్షన్స్ తర్వాత పవన్ మళ్లీ సినిమాలతో బిజీ అయ్యే అవకాశం ఉంది.
Read Also: అనసూయ షాకింగ్ డెసిషన్ - ఎడబాటే అగౌరవానికి సమాధానమంటూ!