By: ABP Desam | Updated at : 26 Jan 2023 04:25 PM (IST)
Edited By: Mani kumar
Image Credit: Shah Rukh Khan/twitter
బాలీవుడ్ స్టార్ యాక్టర్ షారుఖ్ ఖాన్ ఇటీవల నటించిన సినిమా ‘పఠాన్’. ఈ మూవీకు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. దీపికా పదుకోణ్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. దాదాపు నాలుగేళ్ళ గ్యాప్ తర్వాత షారుఖ్ ఖాన్ లీడ్ రోల్ లో చేసిన సినిమా కావడంతో మూవీపై భారీగానే అంచనాలు ఉన్నాయి. అయితే అనుకున్న అంచనాలకు తగ్గట్టుగానే ‘పఠాన్’ సినిమాతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చారు షారుఖ్. ఇండియన్ స్పై బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమా కావడం, భారీ యాక్షన్ సీన్స్ తో సినిమాకు మొదటి రోజు నుంచే మంచి టాక్ వచ్చింది. ‘పఠాన్’ సినిమా రిలీజ్ కి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రూ.50 కోట్లు రాబట్టింది. వరుసగా సెలవలు కూడా ఉండటంతో ఈ సినిమా భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ కు సంబంధించి లేటెస్ట్ వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘పఠాన్’ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడంతో అప్పుడే ఈ సినిమా ఓటీటీ హక్కుల గురించి కూడా వార్తలు వస్తున్నాయి. ఈ మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో హక్కులను సొంతం చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏకంగా రూ.వంద కోట్లతో ఈ సినిమా రైట్స్ ను తీసుకుందట ప్రైమ్ వీడియో. మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదట. సినిమా విడుదలైన మూడు నెలల తర్వాత ఓటీటీ రిలీజ్ ఉంటుందని అంటున్నారు. అంటే ఏప్రిల్ లో ‘పఠాన్’ ను ఓటీటీ వేదికగా చూడొచ్చు. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.
‘పఠాన్’ సినిమా విడుదలకు ముందు నుంచీ వివాదాల్లోనే ఉంది. మూవీ ట్రైలర్, ‘భేషరమ్ రంగ్’ పాట రిలీజ్ అయినప్పుడు నిరసనలు కూడా జరిగాయి. ఈ సినిమాను బాలీవుడ్ నుంచి బాయ్ కాట్ చేయాలని కూడా నినాదాలు వినిపించాయి. అయితే బాయ్ కాట్ బాలీవుడ్ ట్రెండ్ ను తట్టుకొని మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది ‘పఠాన్’ మూవీ. మొదటి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.100 కోట్లు వసూళ్లు రాబట్టినట్టు తెలుస్తోంది. దీంతో ఈ మూవీ తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది.
ప్రపంచ వ్యాప్తంగా 7700 స్క్రీన్ లలో విడుదలైంది షారుఖ్ మూవీ. ఇండియాలో 5200 స్క్రీన్స్ కాగా ఓవర్సీస్ లో మరో 2500 స్క్రీన్స్ లో రిలీజైంది. ఈ మూవీ ఇండియన్ మార్కెట్ లోనే రూ.67 కోట్ల వసూళ్లు రాబట్టింది. అంతే కాకుండా విదేశాల్లో రూ.35 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తంగా ఒక్కరోజే వంద కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిందీ సినిమా. రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన కేజీఎఫ్ -2 తొలి రోజు రూ.53 కోట్ల కలెక్షన్స్ తో రికార్డు సృష్టించింది. అయితే ఇప్పుడా రికార్డును షారుఖ్ ‘పఠాన్’ మూవీ బద్దలు కొట్టింది.
Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!
Ram Pothineni: దసరా రేసులో రామ్, బోయపాటి - పాన్ ఇండియా మాస్ మోతకు రెడీ!
BRS - Keerthi Suresh: నేనేమీ గుజరాత్ నుంచి రాలేదు కదా - కీర్తి సురేష్ కామెంట్స్ను వాడేసుకుంటున్న బీఆర్ఎస్
Bommarillu Bhaskar: అప్పుడు విమర్శలు, ఇప్పుడు విజిల్స్ - థియేటర్లో ‘ఆరెంజ్’ మూవీ చూసి బొమ్మరిల్లు భాస్కర్ భావోద్వేగం
G20 Summit 2023: సిగ్గు, శరంలేని జాతి - విశాఖ జీ20 సదస్సులో తమిళ బ్యానర్లపై నటి సంచలన వ్యాఖ్యలు
Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!
Vishwak Sen: ‘దాస్ కా ధమ్కీ’ కలెక్షన్స్ - విశ్వక్ సేన్ కెరీర్లో సరికొత్త రికార్డ్!
KKR New Captain: కేకేఆర్కు కెప్టెన్సీ కష్టాలు! గంభీర్ తర్వాత మూడో కెప్టెన్!