అన్వేషించండి

Kisi Ka Bhai Kisi Ki Jaan Teaser: సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ టీజర్: బతుకమ్మతో వెంకటేష్, విలన్‌గా జగపతిబాబు

సల్మాన్ లేటెస్ట్ మూవీ ‘కిసి కా భాయ్, కిసి కా జాన్’ టీజర్ విడుదలైంది. సల్మాన్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి. ఈ సినిమాలో వెంకటేష్, జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు.

బాలీవుడ్ ను ఏండ్ల తరబడి మకుటలం లేని మహారాజులా ఏలిన సల్మాన్ ఖాన్, గత కొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతున్నారు. 2022లో సల్మాన్ కు సంబంధించిన ఏ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. 2021లో రెండు సినిమాలు విడుదలైనా అనుకున్న స్థాయిలో ఆడలేదు. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన రెండు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో ‘కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్‌’ ఒకటి. ఈద్ సందర్భంగా ఏప్రిల్‌ 4న ఈ మూవీ రిలీజ్‌ కానుంది. ఈ సినిమా నుంచి తాజాగా అదిరిపోయే అప్ డేట్ వచ్చింది.

ఒప్పు ఒప్పే, తప్పు తప్పే” అంటూ టీజర్ ప్రారంభం

‘కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్‌’ సినిమా టీజర్‌ను రిపబ్లిక్‌ డే కానుకగా ఇవాళ విడుదల చేశారు. “ఒప్పు ఒప్పే, తప్పు తప్పే” అంటూ మొదలయ్యే టీజర్ అదిరిపోయే యాక్షన్ సీన్లతో ఆకట్టుకుంది. టీజర్ లో ఎక్కువ భాగం ఫైట్ సీన్లతోనే నిండిపోయింది. ఇందులో వెంకటేష్ సంప్రదాయ లుక్ లో కనిపించారు. బతుకమ్మ పట్టుకుని వస్తూ దర్శనం ఇచ్చారు. అటు జగపతి బాబు విలన్ గా పవర్ ఫుల్ లుక్ లో కనిపించాడు.  

View this post on Instagram
 
A post shared by Salman Khan (@beingsalmankhan)

తమిళ సూపర్‌ హిట్ ‘వీరమ్‌’కు రీమేక్‌ 

ఫర్హాద్‌ సమ్‌జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా తమిళంలో సూపర్‌ హిట్టయిన ‘వీరమ్‌’కు రీమేక్‌గా తెరకెక్కుతోంది. తెలుగులో ‘వీరుడొక్కడే’ పేరుతో డబ్బింగ్ అయింది. సల్మాన్‌ ఖాన్‌ తన సొంత బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవి ప్రసాద్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

తొలుత ‘కభీ ఈద్‌ కభీ దివాళి’ ఇప్పుడు ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’

ఈ సినిమాకు తొలుత ‘కభీ ఈద్‌ కభీ దివాళి’ అనే టైటిల్ పెట్టారు. ఆ తర్వాత ‘భాయిజాన్’ అనే పేరు పెట్టాలి అనుకున్నారు. కానీ, చివరకు ఈ రెండు కాదని..  ‘కిసి కా భాయ్, కిసి కా జాన్’ అనే పేరును ఖరారు చేశారు.

28 ఏళ్ల తర్వాత బాలీవుడ్ మూవీ చేస్తున్న వెంకీ

1993లో ‘అనారి’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన వెంకీ.. ఆ తర్వాత ‘తక్‌దీర్‌’ వాలా (1995) అనే మరో హిందీ సినిమాలో నటించారు. అనంతరం తెలుగు సినిమాల్లో బిజీ స్టార్‌గా మారిపోవడం వల్ల బాలీవుడ్ వైపు చూడలేదు. సుమారు 28 ఏళ్ల తర్వాత సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కిసి కా భాయ్ కిసి కా జాన్’ సినిమాతో మరో మారు బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. పూజ అన్న పాత్రలో వెంకటేష్  కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. సల్మాన్ ఇటీవల ‘గాడ్‌ఫాదర్’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సల్మాన్ తన సొంత బ్యానర్‌లో తెలుగు సాంప్రదాయాలకు ప్రాధాన్యమివ్వడం గమనార్హం. 

Read Also: ఏవండోయ్, సల్మాన్, వెంకటేష్‌ల సినిమా పేరు మారింది!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Government Banned OTT Apps: 18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Embed widget