Parampara Season 2: నాయకుడు అధికారాన్ని కోరుకోవడం కాదు, నాయకుడినే అధికారం వెతుక్కుంటూ రావాలి - ‘పరంపర సీజన్ 2’ ట్రైలర్ అదుర్స్!
'పరంపర' సీజన్ 2 ను డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు.
ఓటీటీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న పరంపర సీజన్ 2 వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ లాంఛ్ అయ్యింది. పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సిరీస్ ను రూపొందించారు. కొన్ని నెలల క్రితం డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో ప్రసారమైన సీజన్ 1 కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా సీజన్ 2 తీశారు.
ఈ యుద్ధం ఎవరికోసం మొదలు పెట్టావో గుర్తుంది కానీ, ఎందుకోసం మొదలుపెట్టావో గుర్తులేదు” అనే డైలాగ్ తో మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. “స్వేచ్ఛ కోసం మా నాన్న దగ్గర లాక్కున్న అధికారం, పోగొట్టుకకున్న పేరు, కోల్పోయిన జీవితం అన్నీ తిరిగి కావాలి”, “నాయకుడి అధికారాన్ని కోరుకోవడం కాదు, నాయకుడినే అధికారం వెతుక్కుంటూ వస్తుంది” అని నవీన్ చంద్ర చెప్పే డైలాగ్ అదిరిపోయింది.
మూడు జనరేషన్స్ కి సంబంధించిన కథతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. పరంపర అనేది వారసత్వానికి, అర్హతకి మధ్య జరిగే ఘర్షణ. యాక్షన్, డ్రామా, లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్నీ ఎలివెంట్స్ ఈ సిరీస్ లో ఉంటాయి. పర్సనల్ ఎక్స్ పీరియన్స్ తో రాశానని రైటర్ హరి ఏలేటి గతంలోనే వెల్లడించారు. ఇందులో జగపతి బాబు, శరత్ కుమార్, నవీన్ చంద్ర, కస్తూరి కీలక పాత్రలు పోషించారు. ఎల్ కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ ని నిర్మించారు. జులై 21 వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. స్ట్రాంగ్ ఎమోషన్స్ తో సెకండ్ సీజన్ ప్రేక్షకులని మరింతగా ఆకట్టుకుంటుందని నిర్మాణ సంస్థ వెల్లడించింది.