By: ABP Desam | Updated at : 07 Jul 2022 02:31 PM (IST)
బాలయ్య సినిమాలో సిస్టర్ సెంటిమెంట్
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్ ను, టీజర్ ను విడుదల చేశారు. ఇందులో బాలయ్య మాస్ అవతార్ కి అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ సినిమాతో బాలయ్య మరో హిట్ అందుకోవడం ఖాయమని నమ్ముతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే టర్కీలో ఓ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త వెలుగులోకి వచ్చింది. దర్శకుడు గోపీచంద్ ఈ సినిమాను పూర్తి స్థాయి యాక్షన్ సినిమాగా తెరకెక్కిస్తున్నారని అందరూ భావించారు. కానీ ఇందులో సిస్టర్ సెంటిమెంట్ పుష్కలంగా ఉంటుందని తెలుస్తోంది. బాలయ్య చెల్లెలుగా వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది. ఇద్దరి మధ్య బలమైన సన్నివేశాలు రాశాడట దర్శకుడు. సిస్టర్ సెంటిమెంట్ పీక్స్ లో చూపించబోతున్నట్లు టాక్. యాక్షన్ తో పాటు ఎమోషన్ ను కూడా అదే స్థాయిలో క్యారీ చేయబోతున్నారని సమాచారం.
ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. దునియా విజయ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇంకా లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి దసరా కానుకగా విడుదల చేయాలని చూస్తున్నారు నిర్మాతలు.
Skanda Overseas Reviews : ఓవర్సీస్ ఫేక్ రివ్యూలకు చెక్ పెట్టిన 'స్కంద' టీమ్
Harish Shankar: విడాకులపై స్వాతి జవాబుకు హరీష్ శంకర్ ఫిదా - శభాష్ అంటూ ప్రశంసలు
మరో మూవీ నుంచి శ్రీలీలా ఔట్? ప్రభాస్ సినిమాలో హీరోయిన్‌పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్
‘మాయ మశ్చింద్ర’ ట్రైలర్ వచ్చేసింది, ‘ఈగల్’ వాలేది అప్పుడే - ఈ రోజు టాప్ 5 మూవీ న్యూస్ ఇదే!
Aishwarya Rai: ఓ మై గాడ్ - ఐశ్వర్యరాయ్ కూతురి స్కూల్ ఫీజ్ తెలిస్తే షాకే, బచ్చన్ ఫ్యామిలీకి అది జుజుబీ!
Khalistani terrorist Gurpatwant Singh Warning : నరేంద్రమోదీ స్టేడియంలో వరల్డ్ కప్ మ్యాచ్‌పై ఖలీస్థానీ ఉగ్రవాదుల కన్ను - వైరల్ అవుతున్న పన్నూన్ ఆడియో !
ACB Court Case : అక్టోబర్ నాలుగో తేదీకి ఏసీబీ కోర్టులో విచారణలు వాయిదా - కస్టడీ, బెయిల్ పిటిషన్లూ అప్పుడే !
SBI PO Recruitment: ఎస్బీఐలో 2000 పీవో పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
Telangana Group 1 : గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు ఖాయం - ప్రభుత్వ అప్పీల్‌ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు !
/body>