Prabhas Sukumar: పాన్ ఇండియా స్టార్‌తో లెక్కల మాస్టార్ - టాలీవుడ్‌లో కొత్త కాంబోపై రూమర్లు!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్... లెక్కల మాస్టారు సుకుమార్‌తో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం టాలీవుడ్‌లో చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈయన దగ్గర ఉన్న సినిమాలు, ఈయన మీద పెడుతున్న పెట్టుబడి దేశంలో మరే హీరో మీదా లేదు. ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కే’, మారుతి దర్శకత్వంలో ‘రాజా డీలక్స్ (రూమర్ టైటిల్)’ సెట్స్‌పై ఉన్నాయి.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ను ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ సిద్థార్థ్ ఆనంద్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఒక సినిమా ఎప్పట్నుంచో ప్లానింగ్‌లో ఉంది. ఇప్పుడు కొత్తగా సుకుమార్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ఒక సినిమాకు కమిటైనట్లు వార్తలు వస్తున్నాయి. అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మించనున్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం సుకుమార్ చేతిలో ‘పుష్ప-2’ సినిమా ఉంది. ఇది అయ్యాక వెంటనే ప్రభాస్ సినిమా మొదలవుతుందని సమాచారం. అయితే విజయ్ దేవరకొండతో ఒక సినిమాను సుకుమార్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. దీంతోపాటు రామ్‌చరణ్‌తో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది. మరి వీటి సంగతేంటో చూడాలి.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న లైనప్ చూస్తే సంవత్సరానికి రెండు సినిమాలు విడుదల అయినా కనీసం మూడు నాలుగేళ్ల వరకు సరిపడా ప్రాజెక్టులు ఉన్నాయి. ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కే’ షూటింగ్‌లు చివరి దశలో ఉన్నాయి. ఒకసారి ప్రభాస్ పూర్తిగా దొరికితే మారుతి ఎంత స్పీడ్‌గా సినిమా కంప్లీట్ చేస్తాడో అందరికీ తెలిసిందే.
‘స్పిరిట్’ మొదలవ్వాలంటే ముందుగా సందీప్ రెడ్డి వంగా ముందుగా ‘యానిమల్’ పూర్తి చేయాల్సిందే. మరి సుకుమార్ సినిమా ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు. ప్రభాస్ అభిమానుల్లో కూడా ఈ ప్రాజెక్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ‘ముందు షూటింగ్‌లో ఉన్న సినిమాలు రిలీజ్ చేయన్నా...’ అని అడుగుతుండగా, మరికొందరు మాత్రం ‘మాకు 1 నేనొక్కడినే లాంటి యాక్షన్ థ్రిల్లర్ కావాలి.’ అని అడుగుతున్నారు.
View this post on Instagram