అన్వేషించండి

Mahira Khan: డబ్బుల్లేక ఎన్నో కష్టాలు పడ్డా, చివరికి టాయిలెట్లు కడిగా- నటి మ‌హీరా

'ర‌యీస్' మూవీతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన అందాల తార మ‌హీరాఖాన్. తాజాగా తన జీవితంలో పడ్డ కష్టాల గురించి వివరించింది. డబ్బుల కోసం హౌస్ కీపింగ్ చేసినట్లు వెల్లడించింది.

మహీరా ఖాన్. పాకిస్తాన్ నటి. 'ర‌యీస్' మూవీతో బాలీవుడ్ కు పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత హిందీ చిత్రపరిశ్రమలో పలు అవకాశాలు వచ్చాయి. నిర్మాణ సంస్థలు మంచి రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశాయి. కానీ, ‘ఉరి’ దాడుల నేపథ్యంలో ఆమెపై బాలీవుడ్ నిషేధం విధించింది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ పాకిస్తాన్ వెళ్లిపోయింది. అక్కడే సినిమాలు చేసుకుంటుంది. తాజాగా మహీరా రెండో పెళ్లి చేసుకోవడంతో వార్తల్లోకి వచ్చింది. ఓ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో పడ్డ కష్టాల గురించి వివరించింది.   

అమెరికాలో టాయిలెట్లు కడిగిన పాక్ నటి

మహీరా డిసెంబర్ 21, 1984న కరాచీలో జన్మించింది. ఉన్నత చదువుల కోసం 17 ఏళ్ల వయస్సులో అమెరికాకు వెళ్లింది.  కాలిఫోర్నియాలోని శాంటా మోనికా కాలేజీలో జాయిన్ అయ్యింది. ఆ తర్వాత యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో చేరింది. యుఎస్‌లో ఉన్న సమయంలో డబ్బులు లేక చాలా ఇబ్బంది పడినట్లు చెప్పింది. తన ఖర్చుల కోసం చాలా పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసినట్లు తెలిపింది. అయినా, తనకు డబ్బులు సరిపోకపోవడంతో  టాయిలెట్లు కూడా కడిగినట్లు వివరించింది. 17 సంవత్సరాల వయసులో చదువు కోసం అమెరికాకు వెళ్లాను. అక్కడ చాలా ఇబ్బందులు పడ్డాను. చేతిలో డబ్బులు లేక అవస్థలు ఎదుర్కొన్నాను. చేతి ఖర్చుల కోసం చాలా పనులు చేశాను. చివరకు హౌస్ కీపింగ్ చేశాను. ఫ్లోర్లు తుడిచేది. టాయిలెట్లు కూడా కడిగేది. కష్టాలు మనిషిని ఎలాంటి పనులైనా చేయిస్తానని అప్పుడు నాకు అర్థం అయ్యింది” అని మహీరా చెప్పుకొచ్చింది.

2017లో బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన మహీరా

అమెరికా నుంచి పాకిస్తాన్ కు వెళ్లిన తర్వాత MTV పాకిస్తాన్‌లో వీడియో జాకీగా కెరీర్ మొదలు పెట్టింది మహీరా. అనంతరం పాకిస్థానీ చిత్రం ‘బోల్’ ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టింది.  2017లో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘రయీస్‌’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.  ఉరి దాడుల నేపథ్యంలో రెండు దేశాల నడుమ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పాక్ నటీనటులను ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేశారు. ఆ తర్వాత మహీరా పాక్ సినిమాల్లో నటిస్తుంది.   

పాక్ బిజినెస్ మ్యాన్ తో మహీరాకు రెండో పెళ్లి

తాజాగా మహీరా రెండో పెళ్లి చేసుకుంది. స‌లీమ్ అనే పాకిస్తానీ బిజినెస్ మ్యాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొంత కాలం పాటు డేటింగ్ చేసిన వీరిద్దరు తాజాగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు.  మ‌హీరాకు గతంలోనే ఓసారి పెళ్లి అయ్యింది. భర్తతో గొడవల కారణంగా విడిపోయింది. ఆ తర్వాత కొంత కాలం పాటు ఒంటరి జీవితాన్ని గడిపింది. తర్వాత సలీమ్ పరియయం కావడంతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. మహీరా గత ఏడాది మూడు సినిమాలు చేసింది. పలు టీవీ షోలతో బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం మరికొన్ని సినిమాలకు సంతకం చేసినట్లు తెలుస్తోంది.     

Read Also: ‘లియో‘ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ, స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 14th: నారాయణ కుటుంబం గుడికి రాకుండా తాయారు ఏం చేసింది..? మహాలక్ష్మీ ఎలా దీటుగా జవాబిచ్చింది.
పొదరిల్లు: నారాయణ కుటుంబం గుడికి రాకుండా తాయారు ఏం చేసింది..? మహాలక్ష్మీ ఎలా దీటుగా జవాబిచ్చింది.
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 14th:సుందరి గురించి నిజం తెలుసుకున్న రాధ...విక్కీకి దగ్గరయ్యేందుకు దొంగచిట్టి ప్లాన్‌ ఏంటి..?
నువ్వులేక నేను లేను:సుందరి గురించి నిజం తెలుసుకున్న రాధ...విక్కీకి దగ్గరయ్యేందుకు దొంగచిట్టి ప్లాన్‌ ఏంటి..?
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Jabardasth Varsha: బుల్లితెర గ్లామర్ క్వీన్.. జబర్దస్త్ వర్ష రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
బుల్లితెర గ్లామర్ క్వీన్.. జబర్దస్త్ వర్ష రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
Embed widget