Leo OTT Release: ‘లియో‘ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ, స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
దళపతి విజయ్, త్రిష జంటగా నటించిన చిత్రం ‘లియో‘. లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది.
తమిళ స్టార్ హీరో విజయ్ దళపతికి దేశ వ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన నటించిన పలు చిత్రాలు సౌత్ తో పాటు నార్త్ లోనూ బాగానే ఆడుతున్నాయి. ఇంకా చెప్పాలంటే గత కొద్ది సంవత్సరాలుగా నార్త్ లోనూ విజయ్ మార్కెట్ బాగా పెరిగింది. ఆయన సినిమాలను ఉత్తరాది అభిమానులు కూడా బాగానే ఆదరిస్తున్నారు. తాజాగా ‘లియో‘ సినిమాతో మరోసారి ఆడియెన్స్ ముందుకు వచ్చారు విజయ్. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాపై అభిమానులలో భారీగా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఏమాత్రం తగ్గకుండా ‘లియో‘ ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ (అక్టోబర్ 19న) విడుదల అయ్యింది. అన్నిచోట్లా ఈ సినిమాకు సంబంధించి పాజిటివ్ గా రివ్యూలు వస్తున్నాయి. విజయ్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ పడిందంటున్నారు అభిమానులు.
పాజిటివ్ టాక్ తెచ్చుకుంటున్న ‘లియో’
సక్సెస్ ఫుల్ తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను తెరకెక్కించారు. పూర్తి స్థాయి యాక్షన్ మూవీగా ‘లియో‘ రూపొందింది. ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు సినిమా చాలా బాగుందని చెప్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. దీంతో సినిమా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇక ఈ సినిమా విజయ్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా గుర్తింపు పొందే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఎటూ లేదన్నా, తొలి రోజు రూ. 100 కోట్లకుపైగా గ్రాస్ వసూళు చేసే అవకాశం ఉందంటున్నారు.
ఓటీటీ రైట్స్ దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్
అటు ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్స్ రైట్స్ గురించి కీలక విషయాలు వెల్లడి అయ్యాయి. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ విషయాన్ని ‘లియో‘ టైటిల్ కార్డులోనే వెల్లడించారు. ఈ డిజిటల్ రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్ నిర్మాణ సంస్థకు భారీ మొత్తంలో డబ్బు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పటి నుంచే అనే విషయంపైనా క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. అంటే, అక్టోబర్ 19న ‘లియో‘ థియేటర్లలో అడుగు పెట్టగా, నవంబర్ 3వ వారంలో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ సినిమా శాటిలైట్స్ రైట్స్ ను ప్రముఖ ఎంటర్ టైన్మెంట్ చానెల్ జెమిని కొనుగోలు చేసింది. ఈ సినిమా కోసం సదరు చానెల్ పెద్దమొత్తంలో డబ్బును వెచ్చించినట్లు తెలుస్తోంది.
ఇక, 'లియో' చిత్రాన్ని సెవెన్ స్కీన్స్ పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళనిసామి నిర్మించారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది. సుమారు 14 ఏళ్ళ తర్వాత విజయ్, త్రిష కలిసి నటించారు. త్రిషతో పాటు హీరోయిన్ ప్రియా ఆనంద్ కీలక పాత్ర పోషించింది. 'లియో' సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ముఖ్యమైన పాత్రలో కనిపించారు. యాక్షన్ కింగ్ అర్జున్, తమిళ దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, నటుడు మన్సూర్ అలీ ఖాన్, మలయాళ నటుడు మాథ్యూ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.
Read Also: ‘జవాన్‘ స్టైల్లో షారుఖ్ యాడ్ - రైల్లో బందీలుగా అలియా, రణబీర్ జంట!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial