News
News
X

Puli Meka Web Series Glimpse : లావణ్యా త్రిపాఠికి 72 గంటలు టైమ్ ఇచ్చిన సుమన్, 'పులి - మేక' ఫస్ట్ గ్లింప్స్ చూశారా?

Zee5's Puli Meka Web Series teaser : లావణ్యా త్రిపాఠి, ఆది సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'పులి - మేక'. రామ్ చరణ్ ఈ రోజు టీజర్ విడుదల చేశారు.

FOLLOW US: 
Share:

అనగనగా ఓ నగరం... రాత్రి సుమారు పది పదకొండు గంటల ప్రాంతంలో ఓ మర్డర్ జరిగింది. జంతువు లాంటి మనిషి నడుచుకుంటూ వచ్చి చంపేశాడు. ఆ కేసును ఫిమేల్ పోలీస్ ఆఫీసర్ కిరణ్ ఎలా పట్టుకుంది? తెలుసుకోవాలంటే... 'పులి - మేక' సిరీస్ వచ్చే వరకు వెయిట్ చేయాలి!

పోలీస్ అధికారి కిరణ్ పాత్రలో లావణ్యా త్రిపాఠి (Lavanya Tripathi) నటించిన వెబ్ సిరీస్ 'పులి - మేక' (Puli Meka Web Series). ఆమె ఖాకీ చొక్కా వేయడం తొలిసారి. ఇందులో యువ హీరో ఆది సాయి కుమార్ (Aadi Sai Kumar) ఫోరెన్సిక్ డాక్టర్ / అధికారి పాత్రలో నటించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఈ రోజు 'పులి - మేక' ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. 

జస్ట్ 72 గంటల్లో...
హంతకుడు దొరికాడా?
హత్య చేసిన వ్యక్తిని పట్టుకోవడానికి కిరణ్ (లావణ్యా త్రిపాఠి)కి పై అధికారి (సుమన్) 72 గంటలు టైమ్ ఇస్తాడు. ఈలోపు ఆమె పట్టుకుందా? లేదా? సేమ్ కిల్లర్ మరో మర్డర్ చేశాడని ఆది సాయి కుమార్ డైలాగ్స్ బట్టి అర్థం అవుతోంది. ఆ కిల్లర్ ఎవరు? అనేది సిరీస్ చూస్తే తెలుస్తుంది. ఒకరి తర్వాత మరొకరు... పోలీస్ శాఖలో వ్యక్తులను టార్గెట్ చేస్తూ సీరియల్ కిల్లర్ చంపేస్తుంటాడు. అతడిని ఎలా, ఎవరు పట్టుకున్నారు? అనేది కథ. 

Also Read : 'సార్' రివ్యూ : ధనుష్ పాఠాలు బోర్ కొట్టించాయా? ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయా?

Puli Meka Web Series First Glimpse Review : 'మీకు పెళ్ళైందా మేడమ్?' ఆది సాయి కుమార్ అడగటం... 'ఆర్ యు సీరియస్?' అని లావణ్యా త్రిపాఠి అనడం చూస్తే... ఇద్దరి మధ్యలో ఏమైనా లవ్ ట్రాక్ లాంటిది ఏమైనా ఉందేమో అనిపిస్తోంది. పోలీస్ గా లావణ్యా త్రిపాఠి డ్రస్సింగ్, యాటిట్యూడ్ సెట్ అయ్యింది. సిరీస్ చూస్తే ఆమె ఎలా చేశారో తెలుస్తుంది.  

పోలీస్ శాఖతో పాటు ఆస్ట్రాలజీతో మిళితమైన కథతో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌గా 'పులి - మేక'ను తెరకెక్కించారని తెలిసింది. ఈ నెల 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 'జీ 5' ఓటీటీ కోసం ఎక్స్‌క్లూజివ్‌గా రూపొందిన సిరీస్ ఇది. 

Also Read : యాంట్‌ మ్యాన్ మూడో సినిమా ఎలా ఉంది? కొత్త సూపర్ విలన్ ఆకట్టుకున్నాడా?

గోపీచంద్ 'పంతం' తీసిన దర్శకుడే!
'పులి - మేక'కు కె. చక్రవర్తి రెడ్డి దర్శకత్వం వహించారు. మ్యాచో స్టార్ గోపీచంద్ కథానాయకుడిగా 'పంతం' సినిమాకు దర్శకత్వం వహించినది ఆయనే. చక్రవర్తి రెడ్డికీ ఇదే తొలి వెబ్ సిరీస్. ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ (Kona Venkat) కు చెందిన కోన ఫిలిం కార్పోరేషన్ సంస్థతో కలిసి జీ 5 ఓటీటీ ఈ సిరీస్ నిర్మించింది.

సుమన్, 'బిగ్ బాస్' సిరి హనుమంతు, 'ముక్కు' అవినాష్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న 'పులి - మేక' వెబ్ సిరీస్‌కు ఛాయాగ్రహణం : సూర్య కళా, కూర్పు : చోటా కె. ప్రసాద్, కళా దర్శకత్వం : బ్రహ్మ కడలి, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు : గిరిధర్ మామిడిపల్లి, కౌముది నేమాని, సంగీతం : ప్రవీణ్ లక్కరాజు, రచన : కోన వెంకట్, వెంకటేష్ కిలారు, దర్శకత్వం : కె. చక్రవర్తి రెడ్డి.

Published at : 17 Feb 2023 12:02 PM (IST) Tags: Lavanya Tripathi aadi sai kumar Ram Charan Puli Meka Web Series Glimpse Zee5's Puli Meka Series

సంబంధిత కథనాలు

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Citadel Web Series Telugu: తెలుగులోనూ ప్రియాంక చోప్రా ‘సిటాడెల్’ - స్ట్రీమింగ్ డేట్, టైమ్ ఇదే!

Citadel Web Series Telugu: తెలుగులోనూ ప్రియాంక చోప్రా ‘సిటాడెల్’ -  స్ట్రీమింగ్ డేట్, టైమ్ ఇదే!

Rana Naidu Web Series: నెట్ ఫ్లిక్స్ షాక్, స్ట్రీమింగ్ నుంచి ‘రానా నాయుడు’ తొలగింపు, కారణం అదేనా?

Rana Naidu Web Series: నెట్ ఫ్లిక్స్ షాక్, స్ట్రీమింగ్ నుంచి ‘రానా నాయుడు’ తొలగింపు, కారణం అదేనా?

మాధురీ దీక్షిత్‌పై అస‌భ్య వ్యాఖ్య‌లు - ‘నెట్‌ఫ్లిక్స్’కు లీగ‌ల్ నోటీసులు జారీ

మాధురీ దీక్షిత్‌పై అస‌భ్య వ్యాఖ్య‌లు - ‘నెట్‌ఫ్లిక్స్’కు లీగ‌ల్ నోటీసులు జారీ

Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్‌ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!

Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్‌ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!

టాప్ స్టోరీస్

BRSలో చేరిన మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు, తన జీవితమంతా పోరాటాలేనన్న కేసీఆర్

BRSలో చేరిన మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు, తన జీవితమంతా పోరాటాలేనన్న కేసీఆర్

Nellore Adala : టీడీపీకి అభ్యర్థులు లేకనే ఫిరాయింపులు - నెల్లూరు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ లాజిక్ వేరే...

Nellore Adala : టీడీపీకి అభ్యర్థులు లేకనే ఫిరాయింపులు - నెల్లూరు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ లాజిక్ వేరే...

NTR30 Shoot Begins : అదిగో భయం - కొరటాల సెట్స్‌కు ఎన్టీఆర్ వచ్చేశాడు

NTR30 Shoot Begins : అదిగో భయం - కొరటాల సెట్స్‌కు ఎన్టీఆర్ వచ్చేశాడు

AP News : ప్రొబేషన్ కోసం పడిగాపులు - ఏపీలో 17వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్ని కష్టాలో ...

AP News  :  ప్రొబేషన్ కోసం పడిగాపులు - ఏపీలో 17వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్ని కష్టాలో ...