(Source: ECI/ABP News/ABP Majha)
Romeo OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ‘రోమియో’ - ఏకంగా రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్
Romeo OTT: ఎప్పుడూ సీరియస్ పాత్రల్లో మాత్రమే కనిపించే విజయ్ ఆంటోనీ.. మొదటిసారి లవ్ గురు పాత్రలో నటించిన సినిమా ‘రోమియో’. ఈ మూవీ థియేటర్లలో విడుదలయ్యి నెలరోజులు అవ్వడంతో ఓటీటీ రిలీజ్‌ను లాక్ చేసుకుంది.
Romeo OTT Release Date: థియేటర్లలో సినిమా సందడి డల్‌గా ఉన్నా.. ఓటీటీలో మాత్రం ఫుల్‌గా కనిపిస్తోంది. ప్రతీ వారం కొన్ని కొత్త సినిమాలు కచ్చితంగా ఓటీటీ ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. విజయ్ ఆంటోనీ, మృణాలిని రవి జంటగా నటించిన ‘రోమియో’ కూడా త్వరలోనే తమిళంతో పాటు తెలుగులో కూడా ప్రేక్షకులను అలరించడానికి రెండు వేర్వేరు ఓటీటీల్లో విడుదలకు సిద్ధమయ్యింది. తమిళంలో ‘రోమియో’గా విడుదలయిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘లవ్ గురు’ టైటిల్‌తో డబ్ చేశారు మేకర్స్. ఈ సినిమా థియేటర్లలో విడుదలయిన నెలరోజులకే ఓటీటీలోకి రానుందని విజయ్ ఆంటోనీ స్వయంగా ప్రకటించాడు.
రెండు ఓటీటీల్లో..
ఎప్పుడూ డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను అలరించే విజయ్ ఆంటోనీ.. మొదటిసారి ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్‌తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అదే ‘రోమియో’. ఒక రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా పాజిటివ్ రివ్యూలను సాధించింది. ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదలయ్యి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఇక మూవీ థియేటర్లలో విడుదలయిన నెలరోజులకే ఓటీటీలోకి వచ్చేస్తోంది. మే 9 అర్థరాత్రి 12 గంటల నుంచి ‘రోమియో’.. అమెజాన్ ప్రైమ్, ఆహా రెండిటిలో స్ట్రీమింగ్ ప్రారంభించుకోనుంది. ఈ విషయాన్ని ఒక స్పెషల్ పోస్టర్ ద్వారా విజయ్ ఆంటోనీ స్వయంగా ప్రకటించాడు.
View this post on Instagram
మొదటిసారి కామెడీ..
‘రోమియో’ అనే తమిళ వర్షన్.. ప్రైమ్ వీడియోలో, దీని తెలుగు వర్షన్ ‘లవ్ గురు’.. ఆహాలో స్ట్రీమింగ్ కానున్నాయి. వినాయక్ వైద్యనాథన్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. 2 గంటల 26 నిమిషాల నిడివితో ‘రోమియో’ తెరకెక్కింది. మనస్తత్వాలు అస్సలు కలవని ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఈ సినిమాలో స్పష్టంగా చూపించారు వినాయక్. ఇందులో విజయ్ ఆంటోనీ, మృణాలిని రవితో పాటు వీటీవీ గణేష్, యోగి బాబు వంటి నటులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. చాలావరకు తన సినిమాల్లో సీరియస్‌గా కనిపించే విజయ్ ఆంటోనీ.. ఇందులో ఒక కన్‌ఫ్యూజింగ్ భర్తగా ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశాడు.
డెబ్యూ సినిమా..
‘రోమియో’ సినిమాను విజయ్ ఆంటోనీ భార్య మీరా విజయ్ ఆంటోనీ స్వయంగా నిర్మించారు. తమ సొంత బ్యానర్ అయిన విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్.. ఈ మూవీని నిర్మించింది. ఈ సినిమాతోనే వినాయక్ వైద్యనాథన్ దర్శకుడిగా పరిచయమయ్యారు. విజయ్ ఆంటోనీ లాంటి సీరియస్ హీరోను ఒక ఫ్యామిలీ మ్యాన్‌గా చూపిస్తే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా అని చాలామంది సందేహపడినా కూడా ఆ క్యారెక్టర్‌లో హీరో అందరినీ మెప్పించాడు. ముఖ్యంగా ‘రోమియో’ ఫస్ట్ లుక్‌తోనే అందరిలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్‌లో హీరోయిన్ చేతిలో మందు బాటిల్‌ను చూసి ఇదొక రొమాంటిక్ కామెడీ అని ప్రేక్షకులు అప్పుడే ఫిక్స్ అయిపోయారు.
Also Read: ఒకప్పటి స్టార్ కమెడియన్, ఇప్పుడిలా! - గుర్తుపట్టలేనంతగా మారిపోయిన చిరంజీవి మూవీ నటుడు..