ఒకప్పటి స్టార్ కమెడియన్, ఇప్పుడిలా! - గుర్తుపట్టలేనంతగా మారిపోయిన చిరంజీవి మూవీ నటుడు..
ఒకప్పుడు స్టార్ హీరో, డైరెక్టర్ల సినిమాల్లో విలన్‌గా, కమెడియన్ నటించిన ఈయన ప్రస్తుతం గుర్తపట్టలేని స్థితిలో ఉన్నారు. తమిళ్, తెలుగులో స్టార్ నటుడిగా గుర్తింపు పొందిన ఈయన లేటెస్ట్ లుక్ షాకిస్తుంది.
Chiranjeevi Jagadeka Veerudu Athiloka Sundari Actor Shocking Look: సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఒకప్పుడు వెండితెరపై వెలుగు వెలిగిన నటీనటులు కాలక్రమేణా కనుమరుగైపోతున్నారు. అందులో ఎంతోమంది తెలుగు, తమిళ్ నటీనటులు ఉన్నారు. కొందరు ఆఫర్స్ లేక ఆర్థిక పరిస్థితులు బాగా లేక పూట గడవలేని స్థితిలో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎందరో ఉన్నారు. తమదైన నటన, కామెడీతో స్టార్ నటుడిగా ఆకట్టుకున్న మరికొందరు నటులు ఆఫర్స్ లేక వెండితెరపై కనుమరుగయ్యారు. తాజాగా కోవలోకి చేరారు స్టార్ నటుడు, కమెడియన్ జనగరాజ్. ఎంతోమంది స్టార్ హీరో చిత్రాల్లో తనదైన కామెడీతో నవ్వించారు.
క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, హీరోలకు స్నేహితుడిగా కనిపించారు. అలా తమిళం, తెలుగులో ఓ వెలుగు వెలిగిన జనగరాజ్.. తెలుగులో చిరంజీవి, శ్రీదేవిల 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమాలో పోలీసు కానిస్టేబుల్ పాత్రలో ఆకట్టుకున్నారు. తమిళంలో ఎన్నో చిత్రాలు చేసి స్టార్ యాక్టర్‌గా గుర్తింపు పొందారు. సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్ వంటి అగ్ర హీరోల పక్కన నటించిన ఆయన మొదట తమిళ డైరెక్టర్ భారతీరాజ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేశారు. అదే సమయంలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి నటుడిగా గుర్తింపు పొందారు. మెల్లిగా కామెడీ రోల్స్‌లో నటించి ఆడియన్స్‌ని కడుపుబ్బా నవ్వించారు.
విజయ్ సేతుపతి 96తో రీఎంట్రీ
దాంతో ఇండస్ట్రీలో హాస్యనటుడిగా మంచి గుర్తింపు పొందారు. అలా దాదాపు తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో కలిపి మొత్తం 240కిపైగా చిత్రాల్లో నటించిన ఆయన తెలుగులో చివరిగా 'దాడి' సినిమాలో నటించారు. ఆ తర్వాత తమిళంలో ఎందరో స్టార్ హీరో సినిమాలు, సహాయ పాత్రలు చేశారు. ఆ తర్వాత క్రమంగా ఆఫర్స్ తగ్గడంతో సినిమాలకు దూరమయ్యారు. లాంగ్ గ్యాప్ తర్వాత విజయ్ సేతపుతి, త్రిషల '96' సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఆ మధ్య జనగరాజ్ మూవీస్‌కి బై చెప్పి అమెరికా వెళ్లిపోయారంటూ వార్తలు వచ్చాయి. కానీ అవన్ని ఉట్టి పుకార్లేనని ఆయనే స్వయంగా ఓ ఇంటర్య్వూలో వెల్లడించారు. ప్రస్తుతం ఆఫర్స్ లేక సినిమాలకు దూరమైన ఆయన తాత అనే షార్ట్ ఫిలింలో నటించారు.
తాత షార్ట్ ఫిలింతో..
అయితే ఈ షార్ట్ ఫిలింకు సంబంధించి ఆయన లుక్ బయటకు రాగా.. ప్రస్తుతం అతడి లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో ఆయనను చూసి అంతా షాక్ అవుతున్నారు. ఒకప్పుడు బోద్దుగా, హుందాగా కనిపించిన ఆయన ఈ ఫోటోలో బక్కచిక్కిపోయి బలహీనంగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం 68 ఏళ్ల వయసు ఉన్న ఆయన ముఖంలో వృద్ధాప్య ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జనగరాజ్‌ను ఇలా చూసి ఫ్యాన్స్, ఆడియన్స్ అంతా అవాక్క్ అవుతున్నారు. మరి ఇంతలా మారిపోయారేంటి? అంటూ నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారంటూ అంతా ఆరా తీస్తున్నారు. మరి ఆయనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఆఫర్స్ లేక మాత్రం ఆయన ఆర్థిక పరిస్థితి మాత్రం బాగా లేదని ఆయన సన్నిహిత వర్గాల నుంచి సమాచారం.