Viduthalai Part 2 OTT Release : ఓటీటీలోకి విజయ్ సేతుపతి 'విడుదల 2'ఎక్స్టెండెడ్ వెర్షన్... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Viduthalai Part 2 OTT Release : విజయ్ సేతుపతి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'విడుదల 2' ఎక్స్టెండెడ్ వెర్షన్ ఓటీటీ రిలీజ్ డేట్ అప్డేట్ ఏంటంటే?
Viduthalai Part 2 : తమిళ స్టార్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి - ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ 'విడుదల 2'. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా ఓటీటీలో థియేటర్ వెర్షన్ కాకుండా ఎక్స్టెండెడ్ వెర్షన్ రిలీజ్ కాబోతోందని తెలుస్తోంది. మరి ఈ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఆ యాడ్ కాబోతున్న సన్నివేశాలు ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది.
'విడుదల 2' ఓటీటీ రిలీజ్ డేట్
గత ఏడాది థియేటర్లలోకి వచ్చి ప్రశంసలు అందుకున్న తమిళ మూవీ 'విడుదల'. దానికి సీక్వెల్ గా విజయ్ సేతుపతి హీరోగా డిసెంబర్ లో రిలీజ్ అయిన మూవీ 'విడుదల 2'. ఈ మూవీ తమిళంతో పాటు తెలుగులో కూడా డిసెంబర్ 20న 'విడుదల 2' పేరుతో రిలీజ్ అయింది. ఈ పొలిటికల్ యాక్షన్ క్రైం థ్రిల్లర్ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యింది. కానీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తాజా బజ్ ప్రకారం ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ ఎప్పుడు అనే విషయం బయటకు వచ్చింది.
'విడుదలై 2' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను జీ5 అనే ఓటీటీ సంస్థ సొంతం చేసుకోండి. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీని జీ5 2025 జనవరి 17న ఓటీటీలో స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా ఎక్స్టెండెడ్ వెర్షన్ ఓటీటీలోకి అడుగు పెట్టబోతోందని అంటున్నారు. అయితే దీనిపై ఇంకా జీ5 ఓటీటీ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
ఓటీటిలోకి ఎక్స్టెంటెడ్ వెర్షన్...
నిజానికి 'విడుదల' మూవీ రన్ టైం 2 గంటల 40 నిమిషాలు ఉంది. కానీ దానికి సీక్వెల్ గా వచ్చిన 'విడుదల 2' మాత్రం 2 గంటల 50 నిమిషాల రన్ టైంతో ఉంది. అంటే 10 నిమిషాలు ఎక్కువ. అయితే ఈ రెండు సినిమాల పూర్తి రన్ టైమ్ సుమారు 8 గంటలు ఉంటుందని రీసెంట్ గా డైరెక్టర్ వెట్రిమారన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే. కానీ తను ప్రేక్షకులకు మాత్రం కేవలం 5 గంటల 30 నిమిషాల సినిమానే చూపించానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే 'విడుదల 2' ఎక్స్టెంటెడ్ వెర్షన్ ను ఓటిటిలో రిలీజ్ చేస్తామని ఆయన అధికారికంగా ప్రకటించారు.
ఏకంగా 'విడుదల 2' సినిమాకు సంబంధించిన గంట నిడివి ఉన్న ఫుటేజ్ ను ఓటీటీ వెర్షన్ కు యాడ్ చేస్తామని పేర్కొనడంతో, ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా... 'విడుదల'లో సూరి తన సహజ నటనతో మెప్పించగా, కథ మొత్తం ఆయన చుట్టూనే సాగింది. కానీ రెండో పార్ట్ లో పెరుమాళ్ గా నటించిన విజయ్ సేతుపతి పాత్ర చుట్టూనే సీక్వెల్ తిరుగుతుంది. అంతేకాకుండా మూవీ మొత్తం ఉద్యమ ప్రయాణం నేపథ్యంలో నడుస్తుంది. మరి ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వెలువడుతుందో చూడాలి.
Also Read : బాబాయ్ - అబ్బాయ్ బాండింగ్ చూశారా... 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్‌లో హైలైట్ మిస్ అవ్వొద్దు