అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Vedika: వేదిక ఈజ్ బ్యాక్... అప్పుడు 'ముని', ఇప్పుడు 'యక్షిణి'... హారర్‌తో హిట్స్

Yakshini Web Series: ఇప్పుడు వేదిక పేరు తెలుగులో మళ్ళీ వినబడుతోంది. అటు ఇండస్ట్రీలో, ఇటు ప్రేక్షకుల్లో 'యక్షిణి'తో ఆవిడ బౌన్స్ బ్యాక్ అయ్యింది. ఆమెకు ఆఫర్లు క్యూ కడుతున్నాయని టాక్.

Yakshini Web Series Cast 2024: డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న కొత్త సిరీస్ 'యక్షిణి'. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ, బెంగాలీ, మరాఠీ భాషల్లోనూ అందుబాటులో ఉంది. ఇండియా వైడ్ ట్రెండ్ అవుతున్న తెలుగు ప్రాజెక్టుల్లో అది టాప్ ప్లేసులో ఉంది. అన్నట్టు... ఈ సిరీస్ టైటిల్ రోల్ చేసిన హీరోయిన్ వేదిక పేరు అటు ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఇటు ప్రేక్షకుల్లో కూడా ట్రెండ్ అవుతోంది. 

వేదిక ఈజ్ బ్యాక్... హారర్ అంటే తిరుగులేదు!
హీరోయిన్ వేదిక (Actress Vedhika) పూర్తిస్థాయి కథానాయికగా తెలుగు తెరపైకి కనిపించి ఎన్నో రోజులు అయ్యింది. ఈ ఏడాది 'రజాకార్' సినిమాలో పవర్ ఫుల్ రోల్ చేశారు. గత ఏడాది కింగ్ అక్కినేని నాగార్జున, ఆయన కుమారుడు నాగ చైతన్య నటించిన 'బంగార్రాజు'లోని ఓ పాటలో మెరిశారు. కంప్లీట్ హీరోయిన్ అంటే కరోనా కంటే ముందు వచ్చిన 'కాంచన 3' అనే చెప్పాలి. 

వేదికకు అసలు తెలుగు, తమిళ భాషల్లో గుర్తింపు తీసుకు వచ్చిన ఫ్రాంచైజీ అంటే 'కాంచన'. కథానాయికగా 'ముని' ఆమెకు రెండో సినిమా. తెలుగు, తమిళ భాషల్లో ఆ సినిమాకు వచ్చిన స్పందన ఆవిడ క్రేజీ హీరోయిన్ అయ్యేలా చేసింది. అది హారర్ జానర్ ఫిల్మ్. ఇప్పుడు మరోసారి ఆవిడకు క్రేజ్ తెచ్చిన 'యక్షిణి' వెబ్ సిరీస్ కూడా హారర్ జానరే. చూస్తుంటే... హారర్ జానర్ ఆవిడకు హిట్ సెంటిమెంట్ అయ్యేలా ఉంది.

'యక్షిణి'గా వేదిక విశ్వరూపం!
Vedhika Role In Yakshini Web Series: 'ముని' నుంచి 'కాంచన 3' వరకు... రాఘవ లారెన్స్ తీసిన హారర్ ఫ్రాంచైజీలో వేదిక గ్లామర్ రోల్స్ చేశారు. నటనతోనూ ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే... 'యక్షిణి' వెబ్ సిరీస్ ఆ ఫ్రాంచైజీకి పూర్తిగా భిన్నం. దీంతో వేదిక తన నట విశ్వరూపం చూపించారు.

Vedika: వేదిక ఈజ్ బ్యాక్... అప్పుడు 'ముని', ఇప్పుడు 'యక్షిణి'... హారర్‌తో హిట్స్
అటు గ్లామర్... ఇటు పెర్ఫార్మన్స్... 'యక్షిణి'లో రెండు చూపించే అవకాశం వేదికకు లభించింది. ప్రవీణ్, రాహుల్ విజయ్... ఇద్దరితో చేసిన సన్నివేశాల్లో ఆయా వ్యక్తులను ప్రేమలో పడేయడానికి ప్రయత్నించే అమ్మాయిగా అందంతో ఆకట్టుకున్నారు. లక్ష్మీ మంచుతో సన్నివేశాల్లో యాక్షన్ సీన్లు కూడా చేశారు. ఈ సిరీస్ వేదికను ఒక్కసారిగా మళ్లీ లైమ్ లైట్‌లోకి తీసుకొచ్చింది.

Also Read: ప్రెగ్నెంట్ దీపికకు ప్రభాస్ హెల్ప్... డార్లింగ్ అనేది ఇందుకే, 'కల్కి' ప్రీ రిలీజ్‌లో క్యూట్ మూమెంట్!

తెలుగులో నారా రోహిత్ సరసన నటించిన 'బాణం' వేదికకు మంచి విజయంతో పాటు పేరు తెచ్చింది. అయితే, ఆవిడ ఆశించిన అవకాశాలు రాలేదు. గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణతో 'రూలర్' చేశారు. ఇప్పుడు ఆమెకు ఆఫర్లు క్యూ కడుతున్నాయని టాక్.

Also Readకల్కి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... మూవీ సెన్సార్ పూర్తి... ప్రభాస్ సినిమాకు ముంబై నుంచి షాకింగ్ రిపోర్ట్స్!


'యక్షిణి' వెబ్ సిరీస్ విషయానికి వస్తే... 'బాహుబలి' వంటి పాన్ ఇండియా ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ తీసిన శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ప్రొడ్యూస్ చేశారు. ఆహా ఓటీటీ ఫిల్మ్ 'జోహార్', శ్రీవిష్ణు 'అర్జున ఫల్గుణ', శ్రీకాంత్ 'కోట బొమ్మాలి పీఎస్' ఫేమ్ తేజ మార్ని దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు వచ్చిన సోషియో ఫాంటసీ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లకు భిన్నంగా ఉండటంతో 'యక్షిణి'కి మంచి ఆదరణ లభిస్తోంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi Comments: రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
AUS vs IND: ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Comments: రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
AUS vs IND: ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Sonia Akula Engagement: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
AR Rahman Legal Notice: వారికి ఏఆర్ రెహమాన్ లీగల్ నోటీసులు, కంటెంట్ తొలగించాలని 24 గంటలు డెడ్‌లైన్
వారికి ఏఆర్ రెహమాన్ లీగల్ నోటీసులు, కంటెంట్ తొలగించాలని 24 గంటలు డెడ్‌లైన్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Embed widget