Deepika Padukone Prabhas: ప్రెగ్నెంట్ దీపికకు ప్రభాస్ హెల్ప్... డార్లింగ్ అనేది ఇందుకే, 'కల్కి' ప్రీ రిలీజ్‌లో క్యూట్ మూమెంట్!
Prabhas - Deepika Padukone: 'కల్కి 2898 ఏడీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబైలో ఈ రోజు జరిగింది. అందులో ప్రభాస్, దీపికా పదుకోన్ మధ్య జరిగిన క్యూట్ మూమెంట్ ప్రేక్షకుల మనసు దోచింది.
![Deepika Padukone Prabhas: ప్రెగ్నెంట్ దీపికకు ప్రభాస్ హెల్ప్... డార్లింగ్ అనేది ఇందుకే, 'కల్కి' ప్రీ రిలీజ్‌లో క్యూట్ మూమెంట్! Prabhas helps pregnant Deepika Padukone at Kalki 2898 AD pre release event Watch Cute Video Deepika Padukone Prabhas: ప్రెగ్నెంట్ దీపికకు ప్రభాస్ హెల్ప్... డార్లింగ్ అనేది ఇందుకే, 'కల్కి' ప్రీ రిలీజ్‌లో క్యూట్ మూమెంట్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/19/8f4de7d4de55c4986df81cba78f2afb61718813480792313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Cute Moments In Kalki 2898 AD Pre Release Event: ప్రభాస్... పాన్ ఇండియా స్టార్. 'బాహుబలి'తో ఆయనకు జపాన్ వంటి దేశాల్లో ఫాలోయింగ్ పెరిగింది. అభిమానులు, చిత్రసీమ ప్రముఖులు ఆయన్ను రెబల్ స్టార్ అంటారు. అయితే... అభిమానులను ఆయన ముద్దుగా 'డార్లింగ్' అంటారు. ప్రభాస్ (Prabhas)నూ 'డార్లింగ్' అని కొందరు ముద్దుగా పిలుస్తారు. ముంబైలో జరిగిన 'కల్కి 2898 ఏడీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తే... నిజంగానే ప్రభాస్ డార్లింగ్ అని అందరూ ఒప్పుకోక తప్పదు. అక్కడ జరిగిన క్యూట్ మూమెంట్ అటువంటిది.
దీపిక స్టేజి దిగేటప్పుడు ప్రభాస్ హెల్ప్!
Deepika Padukone Baby Bump: 'కల్కి 2898 ఏడీ'లో దీపికా పదుకోన్ కథానాయిక. ఆల్రెడీ రిలీజైన ట్రైలర్ చూస్తే... ఆవిడ గర్భవతిగా కనిపించారు. ట్రైలర్‌లో చెప్పిన ఫస్ట్ డైలాగ్ ఏంటో తెలుసా? 'ప్రాణంలో ఇంకో ప్రాణం' అని! ప్రెగ్నెంట్ అన్నట్టు! విశేషం ఏమిటంటే... ఇప్పుడు నిజ జీవితంలోనూ దీపికా పదుకోన్ గర్భవతి.
'కల్కి 2898 ఏడీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (Kalki 2898 AD Pre Release Event)కు బేబీ బంప్‌తో దీపికా పదుకోన్ హాజరు అయ్యారు. ఆవిడ స్టేజి మీద నుంచి కిందకు దిగుతున్న సమయంలో ప్రభాస్ చెయ్యి అందించి సహాయం చేశారు. ఆ వెంటనే అతడిని అమితాబ్ బచ్చన్ సరదాగా ఆట పట్టించారు. ప్రభాస్ భుజం తట్టి నైస్ అన్నట్టు ప్రోత్సహించారు.
Cutest between #Amitabh ji and #Prabhas ❤️#KALKI2898ADpic.twitter.com/YoNgvxmpya
— R a J i V (@RajivAluri) June 19, 2024
'కల్కి' కోసం వ్యాఖ్యాతగా భల్లాలదేవ
హిందీ చిత్రసీమలో ప్రభాస్ స్టార్ కావడం వెనుక, అతని ఫాలోయింగ్ వెనుక దర్శక ధీరుడు రాజమౌళి తీసిన 'బాహుబలి' ఉంది. అందులో ప్రభాస్ టైటిల్ రోల్ చేయగా... భల్లాలదేవ పాత్రలో మైటీ రానా దగ్గుబాటి నటించారు. ఇప్పుడు 'కల్కి 2898 ఏడీ' ప్రచారం కోసం ఆయన మరోసారి ముందుకు వచ్చారు. ముంబైలో ప్రీ రిలీజ్ వేడుకలో వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
Also Read: 'కల్కి 2898 AD'లో నటి శోభన పాత్ర పేరు ఇదే - ఆకట్టుకుంటున్న కొత్త పోస్టర్
Cutest moment of the day! 🤩❤️#Kalki2898AD @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth #Kalki2898ADonJune27 pic.twitter.com/B7JBc2tWpG
— Kalki 2898 AD (@Kalki2898AD) June 19, 2024
జూన్ 27న 'కల్కి 2898 ఏడీ' తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో అందుకు తగ్గట్టు వీలైనన్ని థియేటర్లలో విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. దీపికా పదుకోన్ కాకుండా దిశా పటానీ మరొక కథానాయికగా నటించిన ఈ సినిమాలో లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, తమిళ నటుడు పశుపతి, సీనియర్ హీరోయిన్ శోభన కీలకమైన ప్రధాన పాత్రలు పోషించారు. 'మహానటి' తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రమిది. సైన్ ఫిక్షన్ జానర్‌లో తీసిన టైమ్ ట్రావెల్ ఫిల్మ్ ఇది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)