Kalki 2898 AD: 'కల్కి 2898 AD'లో నటి శోభన పాత్ర పేరు ఇదే - ఆకట్టుకుంటున్న కొత్త పోస్టర్
Shobhana Look From Kalki: రిలీజ్‌కు ఇంకా వారం రోజులు ఉందనగా కల్కి మూవీ మరో సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఇచ్చింది. ఈ చిత్రంలోనే అలనాటి తార శోభన పాత్ర పరిచయం చేస్తూ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్
Actress Shobana Role and Look Release From Kalki 2898 AD: మరో వారం రోజుల్లో మోస్ట్ అవైయిటెడ్ మూవీ 'కల్కి 2898 AD' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జూన్ 27న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో మూవీ నుంచి రోజుకో అప్‌డేట్ వదులుతూ హైప్ పెంచుతున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్,భైరవ అంథిమ్ సాంగ్‌లు బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు సినిమా నుంచి మరో ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చారు. ఇందులో మరో కొత్త పాత్రను పరిచయం చేసి మూవీపై క్యూరియసిటీ పెంచారు. కల్కిలో అలనాటి తార, పద్మ శ్రీ అవార్డు గ్రహిత శోభన నటిస్తున్నసంగతి తెలిసిందే.
ఈ మేరకు ఆమె పాత్రను పరిచయం చేస్తూ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. దీనికి 'మరో 8 రోజుల్లో మరియమ్‌ను కలుసుకోబోతున్నారు' అంటూ అప్‌డేట్ ఇచ్చారు. ఇందులో శోభన లుక్ బాగా ఆకట్టుకుంటుంది. ఎమోషనల్ కనిపించిన శోభనను చూసి ఆమెది కీలక పాత్ర అయ్యింటుందంటున్నారు. కాగా ఒకప్పుడు తనదైన నటన, గ్లామర్‌తో వెండితెరపై హీరోయిన్‌గా అలరించిన ఆమె ఆ తర్వాత సపోర్టింగ్స్ రోల్స్ చేశారు. చివరిగా ఆమె 2006లో వచ్చిన ‘గేమ్’ సినిమాలో నటించారు. ఆ తర్వాత ఆమె మరే సినిమాలో నటించలేదు. ఇప్పుడు 18 ఏళ్ల తర్వాత ఆమె రీఎంట్రీ ఇస్తుండటంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుష్ అవుతున్నారు.
Her ancestors waited too, just like her…
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) June 19, 2024
8 days to go for #Kalki2898AD.@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani #Shobana @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth #Kalki2898ADonJune27 pic.twitter.com/xEnJZRuPQ3
ఇదిలా ఉంటే కల్కి సినిమాలో శోభనతో పాటు దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండలు కీ రోల్లో కనిపించనున్నారని టాక్. సైన్స్ ఫిక్షన్‌గా వస్తున్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్ల బడ్జెట్‌తో వైజయంతి మూవీస్ పతాకంపై నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో విశ్వనటుడు కమల్ హాసన్, బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె వంటి భారీ తారాగణం నటించడం విశేషం. అయితే మూవీ రిలీజ్‌కు ఇంకా వారంలే ఉన్న ఇంకా కల్కి మూవీ ప్రమోషన్స్ జోరు కనిపించడం లేదు. దీంతో ఫ్యాన్స్ అంతా మూవీ టీం విషయంలో అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల విడుదలైన ట్రైలర్ అన్ని వర్గాల ఆడియన్స్‌ని ఆకట్టుకోలేకపోయింది. దీంతో ప్రమోషన్స్‌తో అయినా ఆడియన్స్‌లో జోష్ నింపుతారనుకుంటే అదీ లేదంటూ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కల్కి మూవీ ట్రైలర్ 2 కూడా ఉంటుందంటున్నారు. అంటే ట్రైలర్ వన్‌లో చేసిన పోరపాట్లు లేకుండా సెకండ్ ట్రైలర్‌ను భారీగా ప్లాన్ చేస్తున్నారట. ఇది మూవీ కలెక్షన్స్, ప్రమోషన్స్‌కి మరింత ప్లస్ అయ్యేలా మూవీ టీం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read: ‘కల్కి 2898 AD’పై నెగిటివిటీ - యూట్యూబర్‌తో విశ్వక్ సేన్ వార్, బూతులు తిడుతూ పోస్టులు