Vishwak Sen:‘కల్కి 2898 AD’పై నెగిటివిటీ - యూట్యూబర్‌తో విశ్వక్ సేన్ వార్, బూతులు తిడుతూ పోస్టులు
Vishwak Sen: ఏ సినిమాను అయినా తక్కువ చేసి మాట్లాడితే విశ్వక్ సేన్‌కు ఎక్కడాలేని కోపం వస్తుంది. తాజాగా ‘కల్కి 2898 AD’ గురించి నెగిటివ్‌గా మాట్లాడిన యూట్యూబర్‌తో వార్ మొదలుపెట్టాడు ఈ యంగ్ హీరో.
Vishwak Sen Vs YouTuber: యంగ్ హీరో విశ్వక్ సేన్‌కు ఏదైనా విషయం నచ్చకపోతే వెంటనే దానిపై ఓపెన్‌గా స్పందించడం తనకు అలవాటు. అలా తను ఇచ్చిన చాలావరకు ఓపెన్ స్టేట్‌మెంట్స్.. అప్పుడప్పుడు కాంట్రవర్సీలకు కూడా దారితీశాయి. ఇటీవల తన సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’పై వచ్చిన నెగిటివ్ రివ్యూలపై కూడా ఇలాగే ఘాటుగా స్పందించాడు. ఇక తాజాగా ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 AD’ చిత్రంపై కూడా అనవసరంగా నెగిటివిటీ క్రియేట్ చేస్తున్న ఒక యూట్యూబర్‌పై ఓపెన్‌గా ఫైర్ అయ్యాడు విశ్వక్. ఆ యూట్యూబర్ కూడా విశ్వక్‌కు ఎదురు సమాధానం చెప్తూ స్టోరీని షేర్ చేశాడు.
చెంబు పట్టుకొని బయల్దేరుతున్నారు..
‘కల్కి 2898 AD’ను ఇతర హాలీవుడ్ సినిమాలతో పోలుస్తూ వీడియో షేర్ చేశాడు యూట్యూబర్. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ దానిపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యాడు విశ్వక్ సేన్. ‘సినిమాలు రిలీజ్ కూడా అవ్వకముందే చెంబు పట్టుకొని బయల్దేరుతున్నారు. యూట్యూబ్‌లో మీ సంపాదన కోసం వేలమంది ఆధారపడి బ్రతుకుతున్న ఇండస్ట్రీ అంటే మీకు మజాక్ అయిపోయింది. ఇలాంటి అభిప్రాయాలు బయట బజార్‌లో పెట్టి తిరిగేవాళ్లు అందరూ 10 నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీసి చూపించండి. కొందరు మనుషులు పైరసీ కంటే దారుణంగా ఉన్నారు. ఒక ఫిల్మ్ సెట్‌పై ఎంతమంది కష్టం ఉంటుందో వారికి అర్థమయితే బాగుంటుంది’ అంటూ ఆ యూట్యూబర్‌ను బూతులు తిట్టాడు విశ్వక్ సేన్. దీనికి ఆ యూట్యూబర్ సైలెంట్‌గా ఉండకుండా విశ్వక్‌పై రివర్స్ కౌంటర్లు వేశాడు.
ఓపెన్ కిడ్నీ మీటింగ్..
‘సినిమా సూపర్, బంపర్ అన్నవాళ్ల అభిప్రాయం మాత్రమే అభిప్రాయమా? వాళ్లందరూ షార్ట్ ఫిల్మ్స్ తీశారా? నేను ఇలా వంద చెప్తా. నీకు ఒపినీయన్ స్పెల్లింగ్ కూడా రాదు. నువ్వు ఒపినీయన్ గురించి మాట్లాడుతున్నావా’ అంటూ తిరిగి ఫైర్ అయ్యాడు యూట్యూబర్. అంతే కాకుండా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నిర్మించిన నాగవంశీ గురించి కూడా తను ప్రస్తావించాడు. ‘కావాలంటే మనం లైవ్‌లో అభిప్రాయాల గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఒకసారి నాగవంశీ గారితో ఓపెన్ కిడ్నీ మీటింగ్ అయ్యింది’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. ఈ విషయంలో విశ్వక్ సేన్‌కు, ఆ యూట్యూబర్‌కు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల్లో పెద్ద వారే జరిగింది.
ఆశకి హద్దుండాలి..
‘ముందు వెళ్లి షార్ట్ ఫిల్మ్ తీయి. ఇంగ్లీష్ బాగా వస్తే క్లాస్ పెట్టుకో. లైవ్‌లో కూర్చోవాలా? ఆశకి హద్దుండాలి’ అంటూ తన స్టైల్‌లో బూతులు తిడుతూ స్పందించాడు విశ్వక్ సేన్. తాను ఒక కంటెంట్ క్రియేటర్ కావడంతో సినిమా ప్రమోషన్స్‌కు కంటెంట్ క్రియేటర్స్‌ను ఎలా ఉపయోగించుకుంటారో చెప్తూ.. రివర్స్ అయ్యాడు యూట్యూబర్. ‘ఆశకు హద్దు ఉండాలి మరి. మీరు సినిమా ప్రమోషన్స్ కోసం కంటెంట్ క్రియేటర్స్ దగ్గరకు వెళ్తారు. అప్పుడు ఈ ఆశలు గుర్తుంటాయా? టీవీ 9 కాంట్రవర్సీ అప్పుడు నాతో పాటు ఎంతోమంది మీమర్స్ మిమ్మల్ని సపోర్ట్ చేశాం. నాగవంశీ గారు కూడా టిల్లు 2 ప్రమోషన్స్ కోసం అడిగితే వీడియో చేశాం’ అన్నాడు యూట్యూబర్. ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరుగుతున్న వార్.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Vamoo adakii pothudhee raa ee controversy..🫨
— 𝗡𝗔𝗡𝗜 👀 (@Melophile_adm) June 18, 2024
Vishwak anna nee right ahh? 🤔#KALKI2898AD #vishwaksen pic.twitter.com/QMZF4UaHAS
Also Read: కల్కి సెన్సార్ పూర్తి... ప్రభాస్ సినిమాకు ముంబై నుంచి షాకింగ్ రివ్యూ!