అన్వేషించండి

Mohan Babu discharge: ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?

Manchu: ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ అయ్యారు. మీడియా ప్రతినిధిపై దాడి కేసులో హత్యాయత్నం కేసు నమోదు కావడంతో పోలీసులు ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Mohan Babu was discharged from the hospital: అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన మంచు మోహన్ బాబు పూర్తిగా కోలుకున్నారు. బుధవారం గచ్చిబౌలిలోని ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు మరో రెండు, మూడు రోజులు అబ్జర్వేషన్ లో ఉంచుతామని ప్రకటించారు. అయితే గురువారం ఉదయమే ఆయనను డిస్చార్జ్ చేయడంతో జల్ పల్లిలోని నివాసానికి వెళ్లిపోయారు. మోహన్ బాబు తన ఇంట్లో జరిగిన ఘర్షణ విషయంలో పోలీసులు జారీ చేసిన నోటీసులపై హైకోర్టును ఆశ్రయించడంతో 24వ తేదీ వరకూ పోలీసుల ఎదుట హాజరు కావాల్సిన అవసరం లేదని స్టే ఇచ్చింది. అయితే గురువారం ఉదయం ఆయనపై కొత్తగా భారతీయ న్యాయసంహిత చట్టం కింద హత్యాయత్నం కేసు నమోదు అయింది. 

టీవీ చానల్ రిపోర్టర్ ను చావబాదిన మోహన్ బాబు             

మోహన్ బాబు తన నివాసంలో ఓ టీవీ జర్నలిస్టుపై ఆయన మైక్ తీసుకుని ఆయననే కొట్టారు. మోహన్‌ బాబు దాడి ఘటనపై విచారణ జరిపిన పోలీసులు... తొలుత మోహన్‌ బాబుపై 118(1) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఇది అంత తీవ్రమైన కేసు కాదు. జర్నలిస్టుపై మోహన్ బాబు చేసింది హత్యాయత్నమేనని ఆయనకు ఆపరేషన్లు కూడా జరిగాయని జర్నలిస్టులు ఆందోళనలకు దిగారు.  దీంతో పోలీసులు జరిగిన ఘటనపై విచారణ జరిపి, ఆధారాలను పరిశీలించిన అనంతరం ఆయనపై హత్యాయత్నం కేసును నమోదు చేశారు. బీఎన్‌ఎస్ యాక్ట్‌ 109 సెక్షన్‌ కింద హత్యాయత్నం కేసును నమోదు చేశారు.    

Also Read:  రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?

హత్యాయత్నం కేసు నమోదుతో కలకలం                       

హత్యాయత్నం కేసు తీవ్రమైనది. ఈ కేసు విషయంలో పోలీసులు చర్యలు తీసుకోవాలనుంటే ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే విష్ణు, మనోజ్ ఇద్దరూ కూడా సీపీ ఎదుట విచారణకు హాజరయ్యారు.  తే శాంతిభద్రతలను విఘాతం కలిగేలా మరోసారి వ్యవహరించబోమని వారి వద్ద బాండ్లు తీసుకుని సీపీ పంపించారు.  కుటుంబసభ్యులు తప్ప ప్రైవేటు వ్యక్తులు ఎవరూ ఇంట్లో ఉండకూడదని సీపీ  స్పష్టం చేయడంతో  విష్ణు, మనోజ్‌కు చెందిన బౌన్సర్లు, ప్రైవేటు వ్యక్తులను అక్కడి నుంచి పంపించి వేశారు. మనోజ్ ఉదయమే తాను నటిస్తున్న భైరవం షూటింగ్ కు వెళ్లిపోయారు. 

Also Read:  మమతా బెనర్జీ నేతృత్వంలోకి ఇండియా కూటమి - చేరేందుకు వైఎస్ఆర్‌సీపీ సిద్దమని సంకేతాలు ?

ఇంట్లో సమస్య పరిష్కారమైనా వెంటాడనున్న హత్యాయత్నం కేసు                 

మోహన్ బాబు ఇప్పుడు తన ఇంట్లోని సమస్యను ఎలాగోలా పరిష్కరించుకున్న మీడియాపై దాడి కేసు మాత్రం ఆయనను వెంటాడే అవకాశం ఉంది. సాక్ష్యాలు స్పష్టంగా ఉండటంతో హత్యాయత్నం కేసులో ఆయనపై పోలీసులు చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి కనిపిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది  

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohan Babu discharge: ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
CM Revanth Reddy: లగచర్ల దాడి ఘటనలో రైతుకు బేడీలు - సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
లగచర్ల దాడి ఘటనలో రైతుకు బేడీలు - సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అయ్యప్ప దీక్ష తప్పా? స్కూల్ ప్రిన్సిపల్ ఘోర అవమానం!మోదీ పాటలు వింటారా? ప్రధాని నుంచి ఊహించని రిప్లైసీపీ ముందు విష్ణు, మనోజ్ - ఇదే లాస్ట్ వార్నింగ్!Sana Satish Babu TDP Rajyasabha | టీడీపీ రాజ్యసభకు పంపిస్తున్న ఈ వివాదాస్పద వ్యక్తి ఎవరంటే..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohan Babu discharge: ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
CM Revanth Reddy: లగచర్ల దాడి ఘటనలో రైతుకు బేడీలు - సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
లగచర్ల దాడి ఘటనలో రైతుకు బేడీలు - సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
Grandhi Srinivas: వైఎస్ఆర్‌సీపీకి  బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
వైఎస్ఆర్‌సీపీకి బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
Chattisgarh Encounter: దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
Maruti Suzuki Wagon R: 34 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే కారు - రూ.లక్ష కట్టి తీసుకెళ్లిపోవచ్చు!
34 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే కారు - రూ.లక్ష కట్టి తీసుకెళ్లిపోవచ్చు!
WhatsApp Stop Working: 2025 మే నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు - లిస్ట్‌లో ఏయే ఫోన్లు ఉన్నాయి?
2025 మే నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు - లిస్ట్‌లో ఏయే ఫోన్లు ఉన్నాయి?
Embed widget