Unstoppable Season 4: బాలకృష్ణ బ్రాండ్ న్యూ అవతార్‌తో 'అన్‌స్టాపబుల్ 4' - స్టార్ట్ చేసేది ఎప్పుడో తెలుసా?
Nandamuri Balakrishna Talk Show: గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ మీద ప్రేక్షకుల్లో అభిమానాన్ని మరింత పెంచిన షో 'అన్‌స్టాపబుల్'. నాలుగో సీజన్ స్టార్ట్ చేయడానికి ఆహా ఓటీటీ రెడీ అయ్యింది.
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)ను హోస్ట్ అవతారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన షో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికే' (Unstoppable With NBK). ఇప్పటికి మూడు సీజన్లు కంప్లీట్ అయ్యాయి. ఫస్ట్ రెండు సీజన్లలో ఎక్కువ ఎపిసోడ్స్ ఉన్నాయి. మూడోది లిమిటెడ్ ఎడిషన్. తక్కువ షో ఎపిసోడ్లతో ముగించారు. ఇప్పుడు ఆ లోటు నాలుగో సీజన్ (Unstoppable With NBK Season 4)తో తీర్చడానికి రెడీ అవుతోంది ఆహా ఓటీటీ (Aha OTT).
విజయ దశమి నుంచి 'అన్‌స్టాపబుల్ 4'!?
బాలకృష్ణకు తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆయన మాస్ క్రౌడ్ పుల్లర్. అయితే, ఆయన్ను అభిమానులతో పాటు ప్రేక్షకులకు మరింత దగ్గర చేసిన ఘనత ఆహా ఓటీటీ ఒరిజినల్ టాక్ షో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికే'కు దక్కుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. బాలకృష్ణ అంటే ఎప్పుడూ సీరియస్‌గా ఉంటారని అనుకునే ప్రజల అభిప్రాయాన్ని ఈ షో మార్చింది. ఆయన ఎంత సరదాగా ఉంటారో వీక్షకులకు చూపించింది. ఒక విధంగా ఈ షో సక్సెస్ మంత్ర అదే అనుకోవాలి.
Unstoppable With NBK Season 4 Launch Date: ఇప్పుడు 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికే' నాలుగో సీజన్ వీక్షకుల ముందుకు తీసుకు రావడానికి ఆహా ఓటీటీ సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది విజయ దశమి నుంచి ఈ షో స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. అక్టోబర్ నెలలో రెండో వారం నుంచి దేవి నవరాత్రులు ప్రారంభం అవుతాయి. మరి, నవరాత్రులు ప్రారంభమైన తొలి రోజుల్లో షో లాంచ్ చేస్తారా? లేదంటే చివరిలో లాంచ్ చేస్తారా? అనేది చూడాలి.
బాలకృష్ణ బ్రాండ్ న్యూ అవతార్!
Balakrishna Brand New Avatar For Unstoppable 4: అన్‌స్టాపబుల్ అంటే ఆడియన్స్‌కు గుర్తుకు వచ్చే మరొక విషయం... నందమూరి బాలకృష్ణ స్టైలిష్ అవతార్. ఆ సూటు బూటుతో పాటు మీసకట్టు అభిమానులకు భలే నచ్చేసింది. ఈసారి ఆయన అప్పియరెన్స్ మాత్రమే కాదు... స్టైలింగ్ కూడా చాలా కొత్తగా ఉండబోతుందని తెలిసింది. గెస్టులుగా టాలీవుడ్, బాలీవుడ్ టాప్ స్టార్లు హాజరు అయ్యే అవకాశం ఉంది.
Also Read: ఆహా... అప్పుడు విజయ్ దేవరకొండ, ఇప్పుడు నేషనల్ క్రష్ రష్మిక!
ఇప్పుడు బాలకృష్ణ చేస్తున్న సినిమాలు ఏమిటి?
Nandamuri Balakrishna Upcoming Telugu Movies: ఇప్పుడు బాలకృష్ణ రెండు సినిమాలు చేస్తున్నారు. బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో చేస్తున్న సినిమా చిత్రీకరణ ఎప్పుడో ప్రారంభమైంది. ఆల్రెడీ రెండు వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. టైటిల్ ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ, 'వీర మాస్' అనేది పరిశీలనలో ఉందట. 'సింహ', 'లెజెండ్', 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలకృష్ణ, మాస్ కమర్షియల్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరొక సినిమా రూపొందుతోంది. బాలయ్య కొన్ని కథలు వింటున్నారట. ఈ రెండిటి తర్వాత ఏ దర్శకుడి కథకు ఓకే చెబుతారో చూడాలి.
Also Read: హరీష్ శంకర్ vs టాలీవుడ్ మీడియా... స్టార్టింగ్ to 'మిస్టర్ బచ్చన్' వరకు - ఏం జరిగిందో తెల్సా?