OTT Romantic Movie: లైగర్ బ్యూటీ నటించిన రొమాంటిక్ మూవీ... ఏ ఓటీటీలో, ఎప్పుడు విడుదలవుతుందో తెలుసా?
Tu Meri Main Tera Main Tera Tu Meri OTT: విజయ్ దేవరకొండ 'లైగర్' హీరోయిన్ అనన్యా పాండే గుర్తుందా? ఆవిడ నటించిన లేటెస్ట్ హిందీ సినిమా 'తూ మేరీ మైన్ తేరా మైన్ తేరా తూ మేరీ'. దీని ఓటీటీ డీటెయిల్స్...

కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే జంటగా నటించిన మోస్ట్ అవైటెడ్ బాలీవుడ్ రొమాంటిక్ సినిమా 'తూ మేరీ మైన్ తేరా మైన్ తేరా తూ మేరీ' (Tu Meri Main Tera Main Tera Tu Meri Movie). హిందీ ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ బజ్ నెలకొంది. ఇద్దరి ఫ్రెష్ కెమిస్ట్రీ, సంగీతం, ఈ మూవీ టైటిల్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచాయి. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుందీ సినిమా. దీని OTT వేదిక, విడుదల గురించి తెలుసా?
క్రిస్మస్‌కు థియేటర్లలోకి వస్తున్న హిందీ సినిమాల్లో 'తూ మేరీ మైన్ తేరా మైన్ తేరా తూ మేరీ' ముఖ్యమైనది. మంచి బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్ ఆశిస్తున్నారు. థియేటర్లలో విడుదలైన తర్వాత పాపులర్ OTT ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే, ప్లాట్‌ఫామ్ పేరు అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ సినిమా ఓటీటీ విడుదలపై సంచలన వార్త బయటకు వచ్చింది.
View this post on Instagram
అమెజాన్ ప్రైమ్ వీడియోలో కార్తీక్ ఆర్యన్ - అనన్యా పాండే సినిమా
కార్తీక్ ఆర్యన్, అనన్య పాండేల 'తూ మేరీ మైన్ తేరా మైన్ తేరా తూ మేరీ' థియేటర్లలో విడుదలైన తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో త్వరలో స్ట్రీమింగ్ అవుతుందని తెలిసింది. థియేటర్లలో విడుదలైన సుమారు ఆరు వారాల తర్వాత... అంటే ఫిబ్రవరి 5 నుండి డిజిటల్ రెంటల్స్ ప్రారంభం అవుతాయి. ఆ తర్వాత మీరు ప్రైమ్ వీడియో ప్లాట్‌ఫామ్ సబ్‌స్క్రైబర్ అయితే, ఫిబ్రవరి 19 నుండి ఎటువంటి రెంట్ లేకుండా సినిమాను ఉచితంగా చూడవచ్చు.
View this post on Instagram
కార్తీక్ ఆర్యన్‌తో అనన్య పాండే రెండో సినిమా ఇది
'తూ మేరీ మైన్ తేరా మైన్ తేరా తూ మేరీ' చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మించారు. ఈ చిత్రానికి సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్, అనన్య పాండేతో పాటు నీనా గుప్తా, జాకీ ష్రాఫ్, అరుణా ఇరాని వంటి అనేక మంది నటీనటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో కార్తీక్‌తో అనన్య రెండోసారి రొమాన్స్ చేయనుంది. అంతకు ముందు ఈ జంట 'పతి పత్నీ ఔర్ వో' చిత్రంలో కలిసి కనిపించింది. తెలుగులోనూ ఈ సినిమాకు కాస్త క్రేజ్ నెలకొంది. అయితే క్రిస్మస్ బరిలో ఎక్కువ తెలుగు సినిమాలు వస్తున్న తరుణంలో ఎంత మంది ప్రేక్షకులు ఈ సినిమా చూస్తారు? అనేది చూడాలి.





















