Sundarakanda OTT: సుందరకాండ ఓటీటీ రిలీజ్... ఐదు భాషల్లో నారా రోహిత్ సినిమా స్ట్రీమింగ్... ఎప్పట్నించి అంటే?
Sundarakanda OTT Release Date: నారా రోహిత్ హీరోగా నటించిన రొమాంటిక్ లవ్ ఫిల్మ్ 'సుందరకాండ'. పెళ్లి కష్టాలపై తీసిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యింది. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Nara Rohith's Sundarakanda OTT Release Date Platform Details: రొమాంటిక్ కామెడీ సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడు ఉంటుందని నిరూపించిన సినిమా 'సుందరకాండ'. విక్టరీ వెంకటేష్ హీరోగా ఈ టైటిల్‌తో వచ్చిన సినిమా సూపర్ హిట్. నారా రోహిత్ హీరోగా ఈ టైటిల్‌తో ఈ ఏడాది వచ్చిన సినిమా కూడా సూపర్ హిట్. థియేటర్లలో విడుదలైన సమయంలో మంచి పేరు వచ్చింది. కానీ, వసూళ్లు రాలేదు. ఇప్పుడు ఆ సినిమా ఓటీటీలోకి వస్తుంది. 'సుందరకాండ 2025' ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది? అనే వివరాల్లోకి వెళితే...
సెప్టెంబర్ 23 నుంచి ఐదు భాషల్లో...
జియో హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్!
'సుందరకాండ 2025' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జియో హాట్‌స్టార్ ఓటీటీ వేదిక సొంతం చేసుకుంది. ఈ నెల (సెప్టెంబర్) 23వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది.
'సుందరకాండ 2025'ను తెలుగులో విడుదల చేశారు. అయితే ఈ సినిమాను మిగతా భాషలలో కూడా అనువదించారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు జియో హాట్‌స్టార్ ఓటీటీ తెలిపింది.
View this post on Instagram
30 ఏళ్లు దాటిన పెళ్లి కొడుకు...
వయసులో చిన్న అమ్మాయిని ప్రేమిస్తే!?
నారా రోహిత్ కథానాయకుడిగా నటించిన 'సుందరకాండ' సినిమాలో శ్రీదేవి విజయ్ కుమార్, వృతి వాఘానీ హీరోయిన్లు. ఈ సినిమా కథ విషయానికి వస్తే...
Also Read: ఆ హీరోకి 'మిరాయ్'లో విలన్ ఛాన్స్ మిస్... మనోజ్ మంచుకు ముందు ఆప్షన్ ఎవరో తెలుసా?
సిద్ధార్థ్ (నారా రోహిత్) వయస్సు 30 సంవత్సరాలు దాటుతుంది. తెల్ల జుట్టు రావడంతో రంగు వేసుకోవడం కూడా మొదలు పెడతాడు. పెళ్లి సంబంధాలు రావడం కష్టం అనుకుంటున్న తరుణంలో తనకు కాబోయే భార్యలో ఐదు లక్షణాలు తప్పనిసరిగా ఉండాలని పట్టుబడతాడు. పెళ్లి చూపులకు వెళ్లిన ప్రతిసారీ అమ్మాయిలను పరీక్షించడం మొదలు పెడతాడు. ఇక కొడుక్కి పెళ్లి కాదని తండ్రి చేతులు ఎత్తేస్తాడు. సిద్ధార్థ్ కూడా పెళ్లి విషయం వదిలేసి విదేశాల్లో ఉద్యోగం చేయడానికి వెళ్లాలని నిర్ణయం తీసుకుంటాడు. ఈలోపు స్నేహితుడి పెళ్లి కోసం విశాఖ వెళుతున్న తరుణంలో ఎయిర్ పోర్టులో ఒక అమ్మాయి నచ్చుతుంది. కానీ, అతడి కంటే వయసులో చాలా చిన్నదని, ప్రస్తుతం కాలేజీలో చదువుతుందని తెలుస్తుంది. సిద్ధార్థ్ ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే వాళ్ళిద్దరి పెళ్ళికి ఎటువంటి అడ్డంకులు వచ్చాయి? వాటిని సిద్ధార్థ్ ఎలా అధిగమించాడు? అనేది సినిమా.
Also Read: లోకేష్‌ను పక్కన పెట్టిన రజనీకాంత్...? చెన్నైలో సస్పెన్స్ పెంచిన సూపర్ స్టార్!
'సుందరకాండ' సినిమా ద్వారా వెంకటేష్ నిమ్మలపూడి దర్శకుడుగా పరిచయం అయ్యారు. హీరో తండ్రిగా నరేష్ విజయ్ కృష్ణ నటించిన ఈ సినిమాలో హీరో సోదరిగా వాసుకి ఆనంద్ కనిపించారు. సత్య, అజయ్, వీటీవీ గణేష్, అభినవ్ గోమఠం తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి, సంతోష్ చిన్నపొల్ల ప్రొడ్యూస్ చేశారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు.





















