అన్వేషించండి

Raj And DK: ఈసారి సరికొత్త వెబ్‌ సిరీస్‌తో రాబోతోన్న దర్శక ద్వయం రాజ్‌ అండ్‌ డీకే - ఓ కీలక పాత్రలో సమంత?

Raj and DK New Web Series: దర్శక ద్వయం రాజ్‌ అండ్‌ డీకే నుంచి మరో సరికొత్త వెబ్‌ సిరీస్‌ రాబోతుంది. దాని పేరు 'రక్త్‌ బ్రహ్మాండ్‌'. మొదటిసారి యాక్షన్-ఫాంటసీగా ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించబోతున్నారు.

Netflix Announced New Web Series Rakt Bramhand: దర్శక ద్వయం రాజ్‌ అండ్‌ డీకే మరో కొత్త వెబ్‌ సిరీస్‌ను ప్రకటించారు. ఫ్యామిలీ మ్యాన్‌ లాంటి వెబ్‌ సిరీస్‌తో ఓటీటీలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేశారు. ఈ వెబ్‌ సిరీస్‌ని మూడు సీక్వెల్‌గా తీసి భారీ వీజయం సాధించారు. వీరికి సినిమాకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ బేస్‌ ఉంది. రాజ్‌ అండ్‌ డీకే తెరకెక్కించే సినిమాలకు ప్రత్యేకమైన శైలి ఉంటుంది. వీరి వెబ్‌ సిరీస్‌ ఎక్కువ హాలీవుడ్‌ నుంచి ఇన్‌స్పైర్‌ అవుతాయి. వాటిని మన ఇండియన్‌ ఆడియన్స్‌ టెస్ట్‌కి తగ్గట్టుగా తెరకెక్కించి ఆడియన్స్‌కి మంచి థ్రీల్‌ ఇస్తంటారు.

అలా ఫ్యామిలీ మ్యాన్‌, ఫర్జీ, గన్స్ అండ్ గులాబ్స్ వంటి పాపులర్‌ వెబ్ సిరీస్‌లను తెరకెక్కించారు. అయితే తాజాగా వారు మరో సరికొత్త వెబ్‌ సిరీస్‌తో రెడీ అయ్యారు. మొదటి సారి  ఓ యాక్షన్ ఫ్యాంటసీ సిరీస్ నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం వారు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి ఈ వెబ్‌ సిరీస్‌ని రూపొందించేందుకు రెడీ అయ్యారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్‌ ఓ ప్రకటన ఇచ్చింది. ఈ సందర్భంగా ఈ వెబ్‌ సిరీస్‌కి సంబంధించి కాన్సెప్ట్‌ పోస్టర్‌ వదిలింది నెట్‌ఫ్లిక్స్‌.

ఈ వెబ్‌ సిరీస్‌  పేరు 'రక్త్‌ బ్రహ్మాండ్‌'..ది బ్లడీ కింగ్‌డమ్‌' అనేది ఉపశీర్షిక. ఈ కాన్సెప్ట్‌ పోస్టర్‌తో వెబ్‌ సిరీస్‌ ఆసక్తి పెంచింది నెట్‌ఫ్లిక్స్‌. ఇది రాజ్‌ అండ్‌ డీకే నుంచి రానున్న మొదటి యాక్షన్‌ వెబ్‌ సిరీస్‌ కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ పోస్టర్‌లో కిరీటాన్ని ప్రముఖంగా చూపించారు. దాని చూట్టూ రక్తం కారుతున్నట్లుగా ఉండి ఆసక్తిని కలిగిసతుంది. ఈ కాన్సెప్ట్‌ పోస్టర్‌ను చూస్తుంటే ఈ సిరీస్‌లో భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఉన్నట్లు అర్థమైపోతుంది. అయితే దర్శకుడు అనిల్‌ బర్వే కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ వెబ్‌ సిరీస్‌లో టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత కూడా నటించనున్నట్టు తెలుస్తోంది.

రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంతో ఇప్పటికే సమంత రెండు భారీ వెబ్‌ సిరీస్‌లు చేసింది. అందులో ది ఫ్యామిలీ మ్యాన్‌ 2తో పాటు హాలీవుడ్‌ రీమేక్‌గా వస్తున్న యాక్షన్‌ వెడ్‌ సరీస్‌ 'సిటాడెల్: హనీ-బన్నీ'. ఇంకా ఈ వెబ సిరీస్‌ రిలీజ్‌ కావాల్సి ఉంది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ వెబ్‌ సిరీస్‌లో సమంత, వరుణ్‌ ధావన్‌లు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ వెబ్‌ సిరీస్‌ త్వరలో అమెజాన్‌ ప్రైం వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ప్రస్తుతం ఓటీటీ ప్రియులంతా ఈ వెబ్‌ సిరీస్‌ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే బాలీవుడ్‌ స్టార్స్‌, ఆడయన్స్‌ అంతా ఎంతో ఇష్టపడే రాజ్‌ అండ్‌ డీకే మన తెలుగు వారే అనే విషయం తెలుసా. ఆంధ్రప్రదేశ్‌ చిత్తూరు జిల్లాకు చెందిన వీళ్లిద్దరు డి2ఆర్ ఫిలిమ్స్ బ్యానర్‌ను స్థాపించింది దానిపై పలు సినిమాలు నిర్మించారు. వీరి అసలు పేరు రాజ్‌ నిడిమోరు, కృష్ణ దాసరి కొత్తపల్లి. 

Also Read: అర్జున్-మలైకా విడిపోయారా? నిజమే అంటున్న తాజా వీడియో.. ఇంతకీ ఏం జరిగిందంటే?

టాప్ హెడ్ లైన్స్

Romantic Drama OTT : రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
Revenge Thriller OTT : తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Vishwanath And Sons : త్రివిక్రమ్ ఎలాంటి కట్స్ చెప్పలేదు - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ సక్సెస్‌పై వెంకీ అట్లూరి రియాక్షన్
త్రివిక్రమ్ ఎలాంటి కట్స్ చెప్పలేదు - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ సక్సెస్‌పై వెంకీ అట్లూరి రియాక్షన్
Irumudi OTT : ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Gachibowli Building Collapse: అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Embed widget