అన్వేషించండి

Viral Video: అర్జున్-మలైకా విడిపోయారా? నిజమే అంటున్న తాజా వీడియో.. ఇంతకీ ఏం జరిగిందంటే?

గత కొద్ది రోజులుగా అర్జున్ కపూర్, మలైకా అరోరా బ్రేకప్ చెప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వీరిద్దరు కలిసి ఓ పార్టీలో పాల్గొన్నారు. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే..

Malaika Arora And Arjun Kapoor Cross Paths At An Event: బాలీవుడ్ లవ్ బర్డ్స్ మలైకా అరోరా, అర్జున్ కపూర్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. సుమారు ఐదు సంవత్సరాల పాటు పీకల్లోతు ప్రేమలో మునిగితేలారు. ఇద్దరి మధ్య 12 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్నా, పట్టించుకోకుండా చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగారు. దేశ విదేశాల్లోనూ హ్యాపీగా, జాలీగా గడుపుతూ ఎంజాయ్ చేశారు. పార్టీలు, పబ్బులు, షికార్లు అంటూ సరదాగా గడిపారు. ఒకానొక సమయంలో ఇద్దరూ పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా వచ్చాయి.

పార్టీలో పాల్గొన్న అర్జున్, మలైకా

మొన్నటి వరకు జంటగా ముంబై రోడ్లపై చట్టపట్టాలేసుకుని తిరిగిన వీరిద్దరు ఈ మధ్య ఎడమోహం పెడమోహంగా ఉంటున్నారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని,  బ్రేకప్ చెప్పుకున్నట్లు బీ టౌన్ లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తూ తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. రీసెంట్ గా జరిగిన అర్జున్ కపూర్ బర్త్ డే వేడుకల్లోనూ మలైకా పాల్గొనలేదు. కనీసం బర్త్ డే విషెస్ కూడా చెప్పలేదు. ఈ నేపథ్యంలో వీరిద్దరి బ్రేకప్ వార్తలకు మరింత బలం చేకూరినట్లు అయ్యింది. తాజాగా ఢిల్లీలో జరిగిన ఇండియా కోచర్ వీక్ 2024 వేడుకల్లో మలైకా, అర్జున్ పాల్గొన్నారు. అయితే, ఇద్దరు వేర్వేరుగా ఈ ఈవెంట్ కు వచ్చారు. ఇద్దరు ముందు వరుసలోనే కూర్చున్నా, దూరంగానే ఉన్నారు. అదే సమయలో అభిమానులు అర్జున్ తో సెల్ఫీలు తీసుకుంటుండగా, మలైకా అక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించింది. అప్పుడు అర్జున్ కలుగజేసుకుని, అభిమానులను పక్కకు జరగమని  చెప్పడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. కనీసం ఆమె అర్జున్ వైపు చూడకపోవడంతో బ్రేకప్ వార్తలు నిజమేనని అర్థం అవుతోంది.

View this post on Instagram
 
A post shared by Viral Bhayani (@viralbhayani)

బ్రేకప్ గురించి నో రియాక్షన్

ఇద్దరి ప్రేమ వ్యవహారం గురించి అధికారికంగా ప్రకటించిన అర్జున్ కపూర్, మలైకా అరోరా బ్రేకప్ గురించి ఎలాంటి కామెంట్స్ చేయలేదు. ఇద్దరూ విడిపోయారంటూ మీడియాలో వస్తున్న వార్తలపైనా స్పందించలేదు. కానీ, కొంత కాలంగా ఇద్దరూ కలిసి కనిపించడకపోవడం ఈ వార్తలకు బలాన్ని ఇస్తున్నా, తాజాగా ఢిల్లీ ఈవెంట్ తో క్లియర్ కట్ గా బ్రేకప్ అయినట్లు తేలిపోయింది.  

2017లో విడాకులు.. 2018 నుంచి డేటింగ్

మలైకా, అర్జున్ చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారు. 2018లో ఈ విషయాన్ని వెల్లడించారు. అర్జున్ బర్త్ డే సందర్భంగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఇక మలైకా, అర్జున్ మధ్యన సుమారు 12 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉంది. ఆమె గతంలో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కొంతకాలానికి ఇద్దరి మధ్య మనస్పర్థులు రావడంతో 2017లో విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికి అప్పటికే  అబ్బాయి అర్హాన్ జన్మించాడు. ప్రస్తుతం ఆయన వయసు 21 సంవత్సరాలు. అర్బాజ్ తో విడాకుల తర్వాత అర్జున్ తో డేటింగ్ మొదలు పెట్టింది.  

Read Also: ఫస్ట్‌ టైం 'యానిమల్‌' వివాదంపై స్పందించిన రణ్‌బీర్‌ - మరోసారి ఇలాంటి సినిమా చేయనన్నాను..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget