అన్వేషించండి

Ranbir Kapoor: ఫస్ట్‌టైం 'యానిమల్‌' వివాదంపై స్పందించిన రణ్‌బీర్‌ - మరోసారి ఇలాంటి సినిమా చేయనన్నాను..

Animal Controversy: 'యానిమల్‌' మూవీ వివాదంపై బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ ఫస్ట్‌టైం స్పందించాడు. ఈ సినిమా ఎందుకు చేశావని తనని విమర్శించిన వారికి క్షమాపలు చెప్పానంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. 

Ranbir Kapoor Reacts on Animal Movie: బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్ కపూర్‌-రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం 'యానిమల్‌'. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా హిట్‌ కొట్టింది. వరల్డ్‌ వైడ్‌గా రూ. 900 కోట్ల గ్రాస్‌ వసూళ్లు చేసింది. అర్జున్‌ డైరెక్టర్‌ ఫేం సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా ముందు నుంచి విమర్శలు ఎదుర్కొంది. అయినా కూడా ఈ యానిమల్‌ మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

ఓ పక్క వివాదాలు, విమర్శలు చూట్టుముట్టిన మరో పక్కా థియేటర్లో ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోయింది.  అయితే యానిమల్ రిలీజ్‌ అనంతరం సినీ, రాజకీయ ప్రముఖులు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. సినిమాలో హింస ఎక్కువగా ఉందని, ముఖ్యంగా ఆడవాళ్లను కించపరిచే విధంగా సీన్స్ ఉన్నాయంటూ బాలీవుడ్ లిరిక్ రైట‌ర్ జావేద్ అక్తర్ అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు ఇలాంటి సినిమాతో ప్రక్షకులకు ఏలాంటి సందేశాలు ఇస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఆయన కామెంట్స్‌ సంచలనం రేపాయి. జావేద్‌ అక్తర్‌ కామెంట్స్‌పై స్పందిస్తూ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా ఆయనకు కౌంటర్‌ కూడా ఇచ్చారు.

అప్పట్లో ఇందరి మధ్య పెద్ద మాటల యుద్దమే నడిచింది. అయితే మూవీపై అంత పెద్ద రచ్చ అవుతున్న హీరో రణ్‌బీర్‌ కపూర్‌ మాత్రం ఎప్పుడు నోరు విప్పలేదు. ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఎనాడు 'యానిమల్‌' వివాదంపై స్పందించలేదు. ఇక మూవీ రిలీజైన ఏడు నెలలకు రణ్‌బీర్‌ కపూర్‌ తొలిసారి యానిమల్‌ వివాదంపై స్పందించాడు.  ఇటీవల ఓ బాలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో విమర్శలపై అతడికి ప్రశ్న ఎదురైంది. దీనికి రణ్‌బీర్‌ స్పందిస్తూ.. యానిమల్‌ మూవీ కథ వినగానే మొదట భయపడ్డాను. కానీ అప్పటి వరకు ఉన్న లవర్‌బాయ్‌, చాక్లేట్‌ బాయ్‌ ఇమేజ్‌ నుంచి బయట పడాలని ఈ సినిమా ఒకే చేశాను.

కానీ యానిమల్‌ విడుదల అయ్యాక చాలా మంది ఈ సినిమా ఎలా చేశావని తిట్టారు. అందుకు ఇండస్ట్రీ పర్సన్స్‌తో పాటు మా రిలేటివ్స్‌ కూడా ఉన్నారు. ఈ సినిమా నువ్వు చేయకుండ ఉండాల్సింది అన్నారు. ఈ సినిమాలో నువ్వు నటించడం మమ్మల్ని బాధ కలిగించిందన్నారు" అంటూ చెప్పకొచ్చారు. అయితే "వాళ్లందరికి తాను ఒక్కటే సమాధానం ఇచ్చానని. క్షమించి మరోసారి ఇలాంటి సినిమా చేయను" అని బుదలిచ్చానని చెప్పాను. అయితే వారి అభిప్రాయాలను తాను ఏకిభవించనన్నాడు.  ప్రస్తుతం తాను వాదించే పరిస్థితిలో లేనని, తన వర్క్‌ నచ్చలేదు అని చెబుతే.. నెక్ట్స్‌ సినిమాలో అలాంటి పొరపాట్లు జరగకుండ చూసుకుంటానని, వర్క్‌ బాగా చేస్తానని చెబుతానని పేర్కొన్నాడు. 

అయితే ఇప్పటి వరకు రొమాంటిక్‌, ప్రేమకథ చిత్రాల్లోనే నటించాను. దాంతో నాకు గుడ్‌బాయ్‌ ఇమేజ్‌ పడిపోయింది. మొదట ఈ కథ విన్నప్పుడు ఇందులో బోల్డ్‌, అడల్ట్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉందనిపించింది. దాంతో మొదట ఈ సినిమా చేయడానికి భయపడ్డాను. ఈ సినిమాను ఆడియన్స్‌ రిసీవ్‌ చేసుకుంటారా? లేదా అని టెన్షన్‌ పడ్డాను. కానీ, మూవీ విడుదలయ్యాక బాక్సాఫీసు వద్ద విశేష స్పందన అందుకుంది. ఒక్క వసూళ్లు రాబట్టడమే కాదు, ఆడియన్స్‌ నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ కూడా వచ్చింది. అయితే కొందరికి ఈ సినిమా నచ్చలేదు.. అదే వేరే విషయం. కానీ, యానిమల్‌తో నేను కొందరు ఆడియన్స్‌ నుంచి విశేషమైన అభిమానాన్ని పొందాను" అంటూ రణ్‌బీర్‌ చెప్పుకొచ్చాడు. 

Also Read: ఆ దేశంలో హనుమాన్‌ రిలీజ్‌ - ఎప్పుడో చెప్పిన ప్రశాంత్‌ వర్మ, పోస్ట్‌ వైరల్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget