అన్వేషించండి

Chiranjeevi : ఓటీటీలోకి మెగాస్టార్ ఎంట్రీ - వెబ్ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి డిజిటల్ ఎంట్రీ కి రెడీ అయినట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన ఓ వెబ్ సిరీస్ కు సైన్ చేసినట్లు సమాచారం.

ప్రస్తుత కాలంలో ఓటీటీ కంటెంట్ కు ఎంతలా డిమాండ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కోవిడ్ టైంలో డిజిటల్ ప్లాట్ ఫామ్స్ కి ఆడియన్స్ నుంచి భారీ ఆదరణ లభించింది. అక్కడి నుంచి ఆడియన్స్ ఓటీటీ కంటెంట్ కి అలవాటు పడిపోయారు. మేకర్స్ కూడా అందుకు తగ్గట్లే మంచి మంచి కంటెంట్ తో సినిమాలు, వెబ్ సిరీస్ లు, డాక్యుమెంటరీలు ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా మన తెలుగులో వెబ్ సిరీస్ లకు మంచి ఆదరణ ఉంది. అందుకే యంగ్ స్టార్స్ తో పాటు సీనియర్ స్టార్స్ కూడా వెబ్ సిరీస్ లు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి పలువురు సీనియర్ హీరోలు డిజిటల్ ఎంట్రీ ఇవ్వగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం ఓటీటీ ఎంట్రీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

వెబ్ సిరీస్ కి సైన్ చేసిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి డిజిటల్ ఎంట్రీకి సంబంధించి ఓ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతుంది. తాజాగా ఆయన ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. చాలాకాలంగా చిరు ఓటీటీ అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నాడు. తన ఇమేజ్ కి సూట్ అయ్యే కంటెంట్ దొరికితే ఖచ్చితంగా వెబ్ సిరీస్ చేస్తానని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. చెప్పినట్లుగానే తాజాగా ఓ ప్రముఖ ఓటీటీ సంస్థలో వెబ్ సిరీస్ చేసేందుకు మెగాస్టార్ ఒప్పందం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే అది ఎలాంటి సిరీస్, ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో చేస్తున్నారనే విషయం ఇంకా తెలీదు. కానీ సోషల్ మీడియాలో మెగాస్టార్ డిజిటల్ ఎంట్రీకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. త్వరలోనే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

'విశ్వంభర' షూటింగ్ తో బిజీగా

చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'విశ్వంభర' షూటింగ్ ఇటీవల హైదరాబాద్లో మొదలైంది. ఇప్పటికే సినిమా కోసం చిరంజీవి భారీ వర్కౌట్స్ చేసిన వీడియో మెగా ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక లేటెస్ట్ షెడ్యూల్లో చిరంజీవితో పాటు త్రిష కూడా జాయిన్ అయ్యింది. వీళ్ళిద్దరిపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇందుకోసం హైదరాబాద్లోని ప్రముఖ స్టూడియోలో కొన్ని సెట్స్ కూడా వేసినట్లు సమాచారం. సోషియో ఫాంటసీ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సుమారు 100 కోట్ల బడ్జెట్ ని కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది.

గోదావరి యాసలో చిరంజీవి డైలాగ్స్

'విశ్వంభర' సినిమాలో చిరంజీవి గోదావరి జిల్లాకు చెందిన వాడిలా కనిపించబోతున్నాడనే టాక్ నడుస్తోంది. ‘ఆపద్బాంధవుడు’ మూవీ తర్వాత చిరంజీవి మళ్లీ ఏ సినిమాలోనూ గోదావరి జిల్లాకు చెందినవాడిగా కనిపించలేదు. ఈ సినిమాతో మరోసారి గోదావరి యాసలో మాట్లాడుతూ రచ్చ చేయబోతున్నారట. అలాగే ఈ సినిమాలో చిరంజీవి పేరు 'దొరబాబు' అని ఫిక్స్ అయినట్లు కూడా తెలుస్తోంది. ఇందులో ఎంత వరకు నిజం ఉందనేది తెలియదు కానీ ఈ వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి.

Also Read : పవన్, త్రివిక్రమ్ కాంబోలో మూవీ, హాలీవుడ్ మేకింగ్ స్టైల్ లో ఈగల్: నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Embed widget