Chiranjeevi: బాగా నటించావు నాగబాబు, చాలా గర్వంగా ఉంది సుష్మితా - మెగాస్టార్ ప్రశంసల జల్లు
మెగా డాటర్ సుష్మిత కొణిదెల నిర్మించి తాజా వెబ్ సిరీస్ ‘పరువు‘. ఈ మధ్యే ఓటీటీలో విడుదలై మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి చిత్రబృందంపై ప్రశంసల జల్లు కురిపించారు.
Chiranjeevi On ‘Paruvu’ Web Series: చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత కొణెదెల నిర్మించిన ‘పరువు’ వెబ్ సిరీస్ జూన్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జీ5 ఓటీటీ వేదికగా రిలీజై మంచి ఆదరణ దక్కించుకుంది. నివేదా పేతురాజ్, నరేష్ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ను సిద్దార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ కలిసి తెరకెక్కించారు. మెగా బ్రదర్ నాగబాబు, ప్రణీత పట్నాయక్, బిందు మాధవి, అమిత్ తివారి సహా పలువురు కీలక పాత్రలు పోషించారు.
‘పరువు’ టీమ్ పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు
ప్రస్తుతం ‘పరువు’ వెబ్ సిరీస్ ఓ రేంజిలో వ్యూస్ సాధిస్తోంది. ఇప్పటికే 50 మిలియన్లకు పైగా వ్యూయింగ్ మినట్స్ తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో మెగా స్టార్ చిరంజీవి స్పందించారు. ‘పరువు’ చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. “అద్భుత విజయాన్ని అందుకున్న ‘పరువు’ టీమ్ కు శుభాకాంక్షలు. అద్భుతమైన వెబ్ సిరీస్ ను నిర్మించిన సుష్మితను చూసి గర్వంగా ఫీలవుతున్నాను. సోదరుడు నాగబాబు బ్రిలియంట్ పర్ఫర్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఒక చక్కటి ప్లాన్ తో చందు బాడీ మాయం చేసి, ఆ జంట పడే తిప్పలు, ఆ ఘటనతో ప్రమేయం లేని MLA పాట్లు. లాస్ట్ కి ఈ జంట తప్పించుకుందా? లేదా? అని సీజన్2 లోనే చూడాలనుకుంటా!” అంటూ రాసుకొచ్చారు. పనిలో పనిగా ‘పరువు’ సీజన్ 2 ఉంటుందని చెప్పేశారు మెగాస్టార్.
View this post on Instagram
ఇంతక ‘పరువు’ వెబ్ సిరీస్ కథ ఏంటంటే?
‘పరువు’ వెబ్ సిరీస్ పరువు హత్యను బేస్ చేసుకుని తెరకెక్కించిన వెబ్ సిరీస్. ఈ సిరీస్ లో పల్లవి(నివేదా పేతురాజ్) పెద్దలను కాదని సుధీర్(నరేష్ అగస్త్య)ను లవ్ మ్యారేజ్ చేసుకుంటుంది. తక్కువ కులం వాడిని చేసుకుందని తల్లిదండ్రులు ఆమెను దూరం పెడతారు. తన పెదనాన్న చనిపోవడంతో చూసేందుకు భర్తతో కలిసి సొంతూరుకు వెళ్లాలి అనుకుంటుంది. పల్లవి బావ చందు కారులో సుధీర్ తో కలిసి ఊరికి బయల్దేరుతుంది. ప్రయాణంలో పల్లవి, సుధీర్ పెళ్లి గురించి చందు చీప్ గా మాట్లాడుతాడు. పల్లవి అతడితో గొడవపడుతుంది. అదే సమయంలో చందు ఓ తుపాకీ కొంటాడు. తమను చంపేందుకే చందు ఆ గన్ కొన్నాడని పల్లవి భావిస్తుంది. అదే విషయాన్ని సుధీర్ కు చెప్తుంది. సుధీర్ కోపంలో చందును చంపేస్తాడు. చందు బాడీని మాయం చేయాలని భావిస్తారు. అదే సమయంలో చందు కోసం అతడి ప్రియురాలు స్వాతి(ప్రణీత) వెతుకుతుంది. స్థానిక ఎమ్మెల్యే రామయ్య(నాగబాబు) చందును కిడ్నాప్ చేశాడని భావిస్తుంది. ఇంతకీ చందు డెడ్ బాడీని ఎలా మాయం చేశారు? చందుకు, రామయ్యకు ఉన్న వైరం ఏంటి? రామయ్యపై స్వాతి ఎలా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటుంది? అనేది ఈ వెబ్ సిరీస్ లో చూపించారు.
మొత్తంగా గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైనర్‌మెంట్ పతాకంపై సుష్మిత కొణిదెల నిర్మించిన ‘పరువు’ వెబ్ సిరీస్ ఆడియెన్స్ ను బాగానే మెప్పిస్తోంది. పరువు హత్య చుట్టూ తిరిగే మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మంచి వ్యూస్ దక్కించుకుంటోంది.
Read Also: కోట్ల విలువైన బంగళా, విలాసవంతమైన కార్లు- ‘యానిమల్’ బ్యూటీ నికర ఆస్తుల విలువెంతో తెలుసా?