ఓటీటీలోకి మలయాళం బ్లాక్‌బస్టర్ ‘మాలికపురం’ - డేట్ ఫిక్స్, తెలుగులోనూ చూసేయొచ్చు!
ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న మాలికాపురం సినిమా ఓటీటీలో విడుదల అవడానికి సిద్ధమైంది. చిత్ర యూనిట్ విడుదల తేదీలను ప్రకటించారు.
హంగు, ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్ గా సినిమాలను తెరకెక్కించే ఇండస్ట్రీగా మలయాళ ఇండస్ట్రీకి పేరుంది. తెలిసిన కథలనే కొత్తగా ఎలా చెప్పాలో కూడా వారి నుంచి నేర్చుకోవచ్చు అంటారు. అయితే గతంలో మలయాళ సినిమాలకు తెలుగు ఇండస్ట్రీలో అంత ఆదరణ లభించేది కాదు. కానీ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు వీరి సినిమాలను సెర్చ్ చేసి మరీ చూస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా అక్కడి కథలను తెలుగులోకి తెస్తున్నారు. గతంలో వచ్చిన ‘భీమ్లానాయక్’, ‘గాడ్ ఫాదర్’ సినిమాలు కూడా మలయాళ రీమేక్ లే. గతేడాది డిసెంబర్ లో మలయాళంలో చిన్న సినిమాగా విడుదలై సంచలనం సృష్టించిన సినిమా ‘మాలికాపురం’. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టడం సెన్సేషన్. ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో రాబోతుంది.
‘మాలికాపురం’ సినిమా ఓటీటీ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్ స్టార్ లో ఈ సినిమా ఫిబ్రవరి 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో షన్ను అనే ఒక పాపకి శబరిమలై వెళ్లాలనే కోరిక ఉంటుంది. ఈమె కోరికను తీరుస్తానని నటుడు మాటిస్తాడు. కానీ అనుకోని సంఘటన వల్ల శబరిమలై తీసుకెళ్లలేకపోతాడు. అయితే ఆ సంఘటన ఏమిటి? ఇంతకీ షన్ను శబరిమలై వెళ్లిందా లేదా? వెళ్తే ఎవరు తీసుకెళ్తారు అనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. కథ చిన్నదే, కానీ దర్శకుడు విష్ణు తెరపై ఆవిష్కరించిన విధానానికి మెచ్చుకోకుండా ఉండడం కష్టం. ‘జనతా గ్యారేజ్’, ‘యశోద’ వంటి హిట్ సినిమాలలో కీలకపాత్ర పోషించిన ఉన్నీ ముకుందన్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. అయితే దేవా నంద, శ్రీపత్ లు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాకు విష్ణు శశి శంకర్ దర్శకత్వం వహించారు.
ఇక ఈ సినిమా కథ నచ్చి అల్లు అరవింద్ ‘మాలికాపురం’ టైటిల్‌తో తెలుగులో రిలీజ్ చేశారు. కానీ ఊహించిన ఫలితాలు దక్కలేదు. ఈ సినిమా సంక్రాంతి సమయంలో రిలీజైంది. అప్పటికే సంక్రాంతి సినిమాల జోరు ఊపు మీదుంది. పైగా ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా ఈ సినిమాను విడుదల చేశారు. దీంతో ‘మాలికాపురం’ అనే సినిమా రిలీజ్ అవుతుందనే విషయం కూడా చాలా మందికి తెలియదు. దీంతో ఈ మూవీ రూ. 50 లక్షల కలెక్షన్లు కూడా సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో నిర్మాతలు ఓటీటీనే నమ్ముకున్నారు.
View this post on Instagram
ఇక మలయాళంతో పాటు, తెలుగు మరియు తమిళ వెర్షన్లు కూడా అదే తేదీ నుంచి ప్రసారం అవుతాయని తెలుస్తోంది. నీతా పింటో, ప్రియా వేణు నిర్మించిన ఈ చిత్రానికి రంజిన్ రాజ్ స్వరాలు సమకుర్చారు. ఈ మలయాళ హిట్ సినిమాలో సైజు కురుప్, మనోజ్ కె జయన్, రాంజీ పనికర్, రమేష్ పిషారోడి తదితరులు కీలక పాత్రలు పోషించారు. థియేటర్లలో చూడడం మిస్ అయినవారు హాట్ స్టార్ లో చూడవచ్చు.
Also Read: 'అన్‌స్టాపబుల్ 2' ఫైనల్‌కు పవర్ టచ్ - సూసైడ్, డిప్రెషన్‌పై పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్!