అన్వేషించండి

90s Web Series OTT : మరో ఓటీటీలోకి 'లిటిల్ హార్ట్స్', 90s, AIR వెబ్ సిరీస్‌లు - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?

AIR Series OTT Platform : 'ఈటీవీ విన్' ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు 90s మిడిల్ క్లాస్ బయోపిక్, AIR, లిటిల్ హార్ట్స్ మూవీ మరో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది.

Little Hearts 90s Web Series AIR Web Series OTT Streaming : '90s వెబ్ సిరీస్'... ప్రతీ మిడిల్ క్లాస్ ఆడియన్‌ను టచ్ చేసిన వెబ్ సిరీస్. కామెడీ, ఎమోషన్‌తో పాటే ఒక్కసారిగా 90s ప్రపంచంలోకి తీసుకెళ్లిన సిరీస్ 'ఈటీవీ విన్' కోసం ఎక్స్‌క్లూజివ్‌గా రూపొందించిన సంగతి తెలిసిందే. ఇదే కోవలో ఆ తర్వాత వచ్చిన 'AIR' వెబ్ సిరీస్ కూడా. ఈ రెండు సిరీస్‌లు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. తాజాగా 'ఈటీవీ విన్‌'తో పాటే మరో ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతున్నాయి.

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ఈ రెండు సిరీస్‌లతో పాటు రీసెంట్ యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ 'లిటిల్ హార్ట్స్' మూవీ కూడా టాప్ ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. 'లాంగ్ టర్మ్ కోచింగ్ సాధారణంగా వారి కెరీర్ నిర్దేశిస్తుంది. కానీ అది వారికి వారి ప్రేమ జీవితాన్ని కూడా నిర్దేశిస్తుంది.' అంటూ రాసుకొచ్చారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి రానుంది.

View this post on Instagram
 
A post shared by Netflix India (@netflix_in)

Also Read : స్టేజీపై 20 ఏళ్ల సారా అర్జున్‌కు ముద్దు - విమర్శలపై బాలీవుడ్ యాక్టర్ స్ట్రాంగ్ రియాక్షన్

లిటిల్ హార్ట్స్ - యంగ్ హీరో, '90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' ఫేం మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ 'లిటిల్ హార్ట్స్'. ఈ మూవీని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సాయి మార్తాండ్ దర్శకత్వం వహించారు. '90s' దర్శకుడు ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. బన్నీ వాస్, వంశీ నందిపాటి రిలీజ్ చేశారు. కేవలం రూ.2.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ దాదాపు రూ.40 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇప్పటికే 'ఈటీవీ విన్' ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతుండగా తాజాగా 'నెట్ ఫ్లిక్స్'లోనూ అందుబాటులోకి వచ్చింది.

90s: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ - హీరో శివాజీ, 'తొలిప్రేమ' ఫేం వాసుకి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ '90s వెబ్ సిరీస్'. ప్రతీ మిడిల్ క్లాస్ పేరెంట్స్, ఫ్యామిలీని టచ్ చేసేలా ఎమోషన్, లవ్, కామెడీ అన్నింటినీ కలిపి ఈ సిరీస్ రూపొందించారు. ఈ సిరీస్‌లో మౌళి తనూజ్, రోహన్ రాయ్, వాసంతిక తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటివరకూ 'ఈటీవీ విన్'లో అందుబాటులో ఉన్న ఈ సిరీస్ ఇప్పుడు 'నెట్ ఫ్లిక్స్'లోనూ అందుబాటులోకి వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

AIR వెబ్ సిరీస్ - 'కోర్ట్' మూవీ ఫేం హర్ష్ రోషన్, వైవా హర్ష, సందీప్ రాజ్, సునీల్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'AIR'. ప్రజెంట్ ట్రెండ్‌కు అనుగుణంగా ఇప్పటి తరం విద్యార్థులు, పేరెంట్స్‌కు బాగా కనెక్ట్ అయ్యింది ఈ సిరీస్. జోసెఫ్ క్లింటన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ప్రస్తుతం 'ఈటీవీ విన్'లో అందుబాటులో ఉండగా... తాజాగా 'నెట్ ఫ్లిక్స్'లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bondi Beach Attack Case Update : 27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
Advertisement

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bondi Beach Attack Case Update : 27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!
టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!
Ram Charan : 'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
Railway Rules : రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
Embed widget