Dhurandhar : స్టేజీపై 20 ఏళ్ల సారా అర్జున్‌కు ముద్దు - విమర్శలపై బాలీవుడ్ యాక్టర్ స్ట్రాంగ్ రియాక్షన్
Rakesh Bedi Reaction : 'ధురంధర్' ఈవెంట్‌లో యంగ్ హీరోయిన్ సారా అర్జున్‌ను స్టేజీపై బాలీవుడ్ యాక్టర్ రాకేశ్ బేడీ ముద్దు పెట్టడంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన తాజాగా రియాక్ట్ అయ్యారు.

Rakesh Bedi Slams Kiss Controversy With Dhurandhar Co Star Sara Arjun : బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ 'ధురంధర్' ఈవెంట్‌లో 20 ఏళ్ల హీరోయిన్ సారా అర్జున్‌ను నటుడు రాకేశ్ బేడీ ముద్దు పెట్టుకోవడంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. గత నెలలో ఈ ఘటన జరగ్గా తాజాగా దీనిపై ఆయన రియాక్ట్ అయ్యారు. విమర్శించే వారి తీరును తప్పుబట్టారు.
'తప్పుగా అర్థం చేసుకున్నారు'
ఆ ఈవెంట్‌లో ఓ తండ్రి తన కూతురికి కిస్ చేస్తే తప్పుగా అర్థం చేసుకున్నారని రాకేశ్ బేడీ తెలిపారు. తాజాగా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విమర్శలపై రియాక్ట్ అయ్యారు. 'అలా ఆలోచించిన వారు తెలివి తక్కువ వారు. సారా నా వయసులో సగం కంటే తక్కువ. సినిమాలో నా కూతురిగా నటించింది. షూటింగ్ టైంలో మేము కలిసినప్పుడల్లా ఓ కూతురు తన తండ్రితో ఎలా ఉంటుందో అలాగే ఆమె కూడా నన్ను పలకరించి కౌగిలించుకునేది. మేము ఎప్పుడు మంచి అనుబంధం, స్నేహాన్ని పంచుకుంటాం. ఇది తెరపై కూడా ప్రతిబింబిస్తుంది.
ఆ రోజు కూడా ఏమీ డిఫరెంట్‌గా లేదు. కానీ చాలా మంది అక్కడ ప్రేమను చూడడం లేదు. ఓ యువతి పట్ల ఓ వృద్ధునికి ఉన్న ప్రేమ. కూతురికి తండ్రిపై... తండ్రికి కూతురిపై ఉన్న ప్రేమను తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు ఎవరు ఏం చేస్తారు. ఆమె పేరెంట్స్ కూడా అక్కడే ఉన్నారు. వేదికపై బహిరంగంగా చెడు ఉద్దేశంతో అలా ఎందుకు చేస్తాను?. కొందరు సోషల్ మీడియాలో ఏమీ లేకుండానే ఏదో ఒక సమస్యను సృష్టించాలి అని అనుకుంటారు. అందుకే ఇలాంటి విమర్శలు చేస్తున్నారు.' అని తెలిపారు.
What could be more shameful than this, Rakesh Bedi? You turned out to be even worse than the character Jameel in the film... Shameful.#Dhurandhar #DhurandharReview pic.twitter.com/hSSmHNLolp
— Anup barnwal (@amethiya_anup) December 19, 2025
Also Read : TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
రికార్డు కలెక్షన్స్
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. వరల్డ్ వైడ్‌గా రూ.700 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ఇండియావ్యాప్తంగా ఇప్పటివరకూ రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించగా... ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. రణవీర్‌తో పాటు అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మలయాళ స్టార్ ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
పాక్‌లో ఉగ్రసంస్థల్ని నాశనం చేసేందుకు భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ చేయించిన ఆపరేషన్ పేరే 'ధురంధర్'. పంజాబ్‌లో జైలు జీవితం గడిపే ఓ యువకుడిని భారత ఏజెంట్‌గా దాయాది దేశంలోకి పంపుతారు. అక్కడ ఆ యువకునికి ఎదురైన పరిమామాలేంటీ? దాయాది దేశంలో ఉగ్రసంస్థల్ని ఎలా ధ్వంసం చేశాడు? అనేదే ఈ మూవీ స్టోరీ.





















