అన్వేషించండి

Best horror movies on OTT: ఈ సినిమా చూస్తే లైట్ కట్టాలంటేనే భయమేస్తుంది - ఒంటరిగా చూస్తే ఇక అంతే

Lights Out: హారర్ సినిమాలు ఇష్టపడేవారికి ఇంగ్లీష్ హారర్ చిత్రాలు మరింత థ్రిల్‌ను ఇస్తాయి. అందులో ఒకటి ‘లైట్స్ ఔట్’. ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో అందుబాటులో ఉంది.

Lights Out: చిన్నప్పుడు చాలామందిలో కామన్‌గా ఉండే భయం.. చీకటిపడితే దెయ్యం వస్తుందని, చీకట్లో దెయ్యం ఉంటుందని. ఒకవేళ అదే నిజమయితే ఎలా ఉంటుంది అనేదే ‘లైట్స్ ఔట్’ మూవీ కథ. హాలీవుడ్‌లోని హారర్ సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అలాంటి ఇంగ్లీష్ హారర్ సినిమాల లిస్ట్ టాప్ 50లో ‘లైట్స్ ఔట్’ కచ్చితంగా ఉంటుంది. 2016లో వచ్చిన ఈ మూవీ హారర్ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. చిన్నప్పుడు లైట్స్ ఆఫ్ చేస్తే దెయ్యం వస్తుంది అనే మాటను మనం సరదాగా విన్నా.. దానినే నిజం చేసి చూపించాడు దర్శకుడు డేవిడ్ ఎఫ్ శాండ్బర్గ్.

అక్కా, తమ్ముళ్ల కథ..

‘లైట్స్ ఔట్’ చిత్రంలో తెరెస్సా పాల్మర్ హీరోయిన్‌గా నటించింది. ఇక సినిమా కథ విషయానికొస్తే.. రెబెక్కా (తెరెస్సా పాల్మర్)కు చిన్నప్పటి నుండి లైట్స్ ఆఫ్ చేసిన ప్రతీసారి ఒక ఆకారం కనిపిస్తూ ఉంటుంది. చాలా ఏళ్ల వరకు అందులో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోలేకపోతుంది. వయసు పెరిగేకొద్దీ తనకు ఉన్న ఆ సమస్య తగ్గిపోయిందని రెబెక్కా అనుకుంటుంది. కానీ అదే సమస్యను ఇప్పుడు తన తమ్ముడు మార్టిన్ (గాబ్రియల్ బేట్మెన్) ఎదుర్కుంటాడని తెలుసుకుంటుంది. దీంతో ఇద్దరు ఒకే ఇంట్లో భయంభయంగా జీవితాన్ని గడుపుతుంటారు. ఆ సమస్య తన తల్లి (మారియా బెల్లో) వల్లే మొదలయ్యిందని వారికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ‘లైట్ ఔట్’ అసలు కథ.

చీకటి అయితే చాలు..

ఎక్కువగా హారర్ చిత్రాలు అనేవి చీకట్లోనే తెరకెక్కుతుంటాయి. కానీ వాటికి, ‘లైట్స్ ఔట్’కు ఉన్న తేడా ఏంటంటే ఈ మూవీలో చీకటి అయిన ప్రతీసారి కచ్చితంగా దెయ్యం వస్తుంది. దెయ్యం ఆకారంలో వచ్చే క్రియేచర్ ప్రేక్షకులను భయపెట్టే విధంగా ఉంటుంది. అందులో సినిమాలో లైట్స్ ఆఫ్ అయిన ప్రతీసారి ప్రేక్షకులు అలర్ట్ అయ్యేలా దీనిని తెరకెక్కించాడు దర్శకుడు డేవిడ్. ఇక ఈ మూవీని ఇప్పటివరకు చూడని వారు ఉంటే అమెజాన్ ప్రైమ్‌లో చూసేయొచ్చు. కానీ ‘లైట్స్ ఔట్’ అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్స్ అందరికీ ఫ్రీగా అందుబాటులో లేదు. దీనిని రెంట్ తీసుకుని చూడాల్సి ఉంటుంది. డిప్రెషన్ వల్ల మానసిక పరిస్థితి ఎలా దెబ్బతింటుంది అనే అంశాన్ని కూడా ఈ మూవీలో క్లియర్‌గా చూపించారు.

తక్కువమంది యాక్టర్స్‌తో..

‘లైట్స్ ఔట్’ అనేది ఎక్కువగా రెండు లొకేషన్స్‌లోనే షూట్ చేశారు. ఇందులో యాక్టర్లు కూడా ఎక్కువగా ఉండరు. తెరెస్సా పాల్మర్, గాబ్రియల్ బేట్మెన్ చుట్టూనే ఈ కథ ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది. ఈ సినిమాలో మరొక ఆసక్తికర విషయం ఏంటంటే.. చీకట్లో ఉండే దెయ్యానికి లైట్స్ ఎప్పుడు ఆఫ్ అవ్వాలో, ఎప్పుడు ఆన్ అవ్వాలో నిర్ణయించే శక్తి కూడా ఉంటుంది. దాని వల్ల మూవీలో మరింత హారర్ యాడ్ చేశాడు దర్శకుడు. ఇలాంటి భయంకరమైన సినిమాలకు చిన్నపిల్లలు దూరంగా ఉంటే బెటర్. కానీ ఒకవేళ హారర్ సినిమాలను ఇష్టపడేవారు అయితే మాత్రం ఈ ‘లైట్స్ ఔట్’ చిత్రాన్ని లైట్స్ ఆఫ్ చేసుకొని చూస్తే మరింత థ్రిల్లింగ్ ఫీలింగ్ వస్తుంది.

Also Read: డేనియల్ బాలాజీ చివరి కోరిక తీర్చిన డాక్టర్లు - నువ్వు విలన్ కాదు రియల్ హీరో

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Embed widget